సోఫాసెట్‌తో ప్యారాగ్లైడింగ్.. వీడియో వైరల్
సాధారణంగా ప్యారాగ్లైడింగ్ చేయడాన్ని మనం చూస్తుంటాం. కానీ, ఓ వ్యక్తి విభిన్నంగా ప్యారాగ్లైడింగ్ చేసి అబ్బుర పరిచాడు. సోఫా సెట్‌కి ఓ టీవీని అమర్చి ప్యారా గ్లైడింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గాలిలోకి ఎగిరాక ఎలాంటి గందరగోళం లేకుండా ఆ వ్యక్తి తీరికగా సోఫా సెట్‌పై కూర్చున్నాడు. బూట్లు మార్చుకున్నాడు. టీవీ ఆన్ చేసి స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేశాడు. కోక్ టిన్ చేతిలో పట్టుకుని ప్యారాగ్లైడింగ్ని ఆస్వాదించాడు. అనంతరం క్షేమంగా ల్యాండ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. … Read more