• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ర్యాగింగ్‌ అంటూ బాలికకు ముద్దులు

    [VIDEO](url): ర్యాగింగ్‌పై ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ పలుచోట్ల వికృత చేష్టలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఒడిశాలో ఓ విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బరంపురంలోని బినాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటికే ఐదుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. In Binayak acharya college campus what's going sir @SP_BERHAMPUR In simple word it's called … Read more

    ఐసీఎఫ్ఏఐ ఘటనపై పోలీసుల చర్యలు

    ICFAI ర్యాగింగ్ ఘటనలో నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మతానికి సంబంధించిన నినాదాలు చేయాలని విద్యార్థిపై దాడి చేసినట్లు వెల్లడించారు. విద్యార్థి కోమాలోకి వెళ్లేలా కొట్టాలని…చచ్చే వరకు కొట్టాలని మాట్లాడుకున్నట్లు తెలిపారు. నార్త్ – సౌత్ అనే గొడవ జరిగిందని ప్రచారం జరగ్గా…అందులో వాస్తవం లేదన్నారు. 12 మంది గొడవకు దిగారని.. ఒక మైనర్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. అందరిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.

    మధ్యప్రదేశ్ లో ర్యాగింగ్ కలకలం

    మధ్యప్రదేశ్ లోని అతిపెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కేసు నమోదైంది. ఎంజీఎం కాలేజీలో జూనియర్ విద్యార్థులు యూజీసీకి ఫిర్యాదు చేశారు. తమపై జరిగిన తీవ్రమైన ర్యాగింగ్ ను వివరించారు. దిండులు, తోటి స్నేహితులతో సెక్స్ చేస్తున్నట్లు యాక్ట్ చేయమని ఒత్తిడి చేశారని తెలిపారు. అమ్మాయిల పేర్లు తీసుకుని వారిపై బూతులు మాట్లాడించారని చెప్పారు. యూజీసీ వెంటనే కళాశాలను సంప్రదించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. యూజీసీకి ఘటనపై ఆడియో, వీడియో రికార్డింగులు కూడా అందినట్లు సమాచారం.

    గుంటూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

    గుంటూరు జిల్లాలోని మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సీనియర్ విద్యార్థులు వేధింపులు చేస్తున్నారు. దీంతో జాతీయ మెడికల్ కమిషన్‌ను ఆ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మెడికల్ కమిషన్, ఘటనపై తక్షణమే వివరణ ఇవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను కోరింది. ర్యాగింగ్ ఘటనపై విచారణ కమిటీ విచారణ చేపడుతుందని, మరి కొద్దీ సేపట్లో రిపోర్ట్ అందజేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

    Categories AP