సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లకు కేంద్రం హెచ్చరికలు
కేంద్రం సోషల్ మీడియా వేదికలకు హెచ్చరికలు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీచేసింది. లేదంటే సురక్షిత ఆశ్రయం హోదాను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అటువంటి కంటెంట్‌ను యాక్సెస్ చేయనీయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని అందులో కేంద్రం పేర్కొంది.