‘ఆ కుటుంబాలకు రూ.30లక్షల పరిహారం’
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మురుగును శుభ్రం చేసే కార్మికులు మృతిచెందితే వారి కుటుంబాలకు పరిహారం అందజేయాలని ఆదేశించింది. దేశంలో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ కార్మికులు చనిపోతున్నారని పిటిషన్ దాఖలైంది. దానిపై న్యాయస్థానం విచారణ జరిపింది. మురుగు శుభ్రం చేస్తూ కార్మికులు మృత్యువాతపడితే వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.30లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.