• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సూపర్‌ స్టార్‌ పేరుతో అవార్డులు!

  సూపర్‌ స్టార్‌ పేరుతో ఓ అవార్డును నెలకొల్పి..ఏటా సినీరంగానికి సేవలు అందించిన వారికి అందించాలని మహేశ్‌ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సూప‌ర్ స్టార్‌కు స్మార‌క స్థూపం తెలుగు ప్ర‌భుత్వాలు భావిస్తున్నాయి. మే 31 కృష్ణ జయంతి సందర్భంగా ఈ అవార్డులు అందించే అవకాశముంది. గతంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ పేరిట కూడా అవార్డులు క్రమం తప్పకుండా ఇచ్చేవారు. ఈ మధ్య ఈ అవార్డుల ప్రదానోత్సవాలు అంత పకడ్బందీగా జరగడం లేదు.

  నాన్న నాకిచ్చిన మీ అభిమానం గొప్పది: మహేశ్ బాబు

  సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమంలో హీరో మహేశ్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. “నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. అందులో మీ అభిమానం ఒకటి. అది ఎంతో గొప్పది. దానికి ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నాన్న గారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లో ఉంటారు. ఆయన మన మధ్యే ఉంటారు. మీ అభిమానం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను ” అని ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

  అమెరికా నుంచి వచ్చిన కృష్ణ మరో మనవడు

  సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణ వార్త తెలిసి ఆయన మనవడు, రమేశ్‌ బాబు కుమారుడు జయకృష్ణ అమెరికా నుంచి ఇండియాకు చేరుకున్నాడు. జయకృష్ణ అమెరికాలో నటనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడు. జయకృష్ణ తండ్రి రమేశ్‌ బాబు ఈ ఏడాదే జనవరిలో ప్రాణాలు కోల్పోయాడు. నెల క్రితం మహేశ్‌బాబు, రమేశ్‌ బాబుల తల్లి ఇందిరా దేవి కూడా తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా మహేశ్‌ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

  సూపర్ స్టార్ కు కన్నీటి నివాళి

  సూపర్ స్టార్ కృష్ణకు అశ్రు నయనాల మధ్య వీడ్కోలు పలికారు. బంధుమిత్రులు, అభిమానులు కన్నీటి నివాళి అర్పించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య నటశిఖరానికి అంతిమ సంస్కారాలు చేశారు. హైదరాబాద్ మహాప్రస్థానంలోని మోక్షస్థల్ కలప దహన వాటికలో హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. పోలీసులు గౌరవ వందనం చేసి గాల్లోకి మూడుసార్లు కాల్పులు జరిపారు. అంత్యక్రియలు పూర్తి చేసి కుటుంబ సభ్యులు వెళ్లిపోయిన తర్వాత చితి వద్దకు అభిమానులకు అనుమతిచ్చారు.

  ఏడ్చేసిన గౌతమ్, సితార

  సూపర్ స్టార్ కృష్ణ అస్తమయంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కృష్ణ కడచూపు కోసం ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మహేశ్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితార..కృష్ణ భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. తాతయ్య పార్థీవ దేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవల మహేశ్ తల్లి ఇందిరాదేవి స్వర్గస్తులయినప్పుడు కూడా వీరిద్దరు బోరున విలపించారు.

  నేడు తెలుగు సినీ పరిశ్రమ బంద్‌

  సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతికి సంతాపంగా నేడు తెలుగు సినీ పరిశ్రమ బంద్ పాటిస్తోంది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 4.10కి కృష్ణ తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం ఘట్టమనేని కుటుంబంతో పాటు మహేశ్‌బాబు ఫ్యాన్స్‌, సినీ పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది. 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. ఆయనగు గౌరవ సూచకంగా నేడు పరిశ్రమ బంద్ చేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది.

  అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్రక్రియలు

  ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ పార్థీవ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంత్యక్రియలకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణ మరణం తీరని లోటని అన్నారు. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి నూతన ఒరవడులు సృష్చించారని వ్యాఖ్యానించారు. నాటి కార్మిక, కర్షక లోకం తమ అభిమాన హీరోగా సొంతం చేసుకున్నారని అన్నారు.

  కుమార్తెను మెచ్చుకున్న మహేశ్ బాబు

  సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి తన కుమార్తె సితారను మెచ్చుకున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార.. తాజాగా దీపావళి సందర్బంగా తాను నాట్యం చేస్తున్న వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇదే వీడియోని షేర్ చేస్తూ ‘నా నమ్మకాన్ని నిలబెట్టడంలో, గర్వపడేలా చేయడంలో నువ్వెప్పుడూ ఫెయిల్ కాలేదు’ అంటూ మహేశ్ పోస్టు చేశాడు. తన గురువు మహతీ భిక్షుతో కలిసి చేసిన క్లాసికల్ డ్యాన్స్ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీడియో చూడటానికి Watch On గుర్తుపై క్లిక్ … Read more

  మహేశ్ ఇంట్లో చోరీకి యత్నం

  సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశాడో వ్యక్తి. ఒడిశాకు చెందిన కృష్ణ.. మహేశ్ ఇంట్లో చొరబడటానికి ఎత్తైన ప్రహరీ నుంచి దూకాడు. దీంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ శబ్ధం విన్న భద్రతా సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తిగా కోలుకున్నాక పోలీసులు అతడిని విచారించనున్నారు. ఇందిరా దేవి మృతికి ముందు రోజు ఈ ఘటన జరిగింది.

  ఆ డైరెక్టర్‌తో జత కట్టనున్న మహేశ్

  మహేశ్ బాబు సర్కారు వారి పాట హిట్‌తో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ సూపర్ స్టార్ తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నాడు. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌలి సిద్ధంగా ఉన్నాడు. వీరిద్దరి కాంబోలో మూవీ వేరే లెవెల్ లో ఉంటుందని.. టాక్ నడుస్తోంది. ఈ మూవీ తర్వాత మహేశ్ నటించే సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి లేదా సుకుమార్ SSMB 30కి దర్శకత్వం వహించే అవకాశం ఉందని … Read more