బండి సంజయ్ చెప్పులు ఇవ్వడంపై KTR తీవ్ర వ్యాఖ్య
కేంద్ర హోమంత్రి అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించడంపై మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ చెప్పులు మోసే నాయకులను తెలంగాణ గమనిస్తుందని వ్యాఖ్యనించారు. మరోవైపు గుజరాత్ నేతల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని TRS నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మునుగోడు పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని అమిత్ షా సందర్శించారు. ఆక్రమంలో గుడి బయట షాకు బండి సంజయ్ చెప్పులు అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.