రాళ్ల మధ్యలో యువతి.. 12 గంటలు నరకం
విశాఖపట్నం అప్పికొండ బీచ్‌లో రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన యువతి 12 గంటల పాటు నరకం అనుభవించింది. కృష్ణా జిల్లాకు చెందిన కావ్య, వర్మ రాజు ఈనెల 2 నుంచి అప్పికొండ ప్రాంతంలో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఫొటోలు తీసుకుంటుండగా కావ్య రాళ్ల మధ్యలో జారిపడిపోయింది. దీంతో రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం ఆమె కేకలు విన్న జాలర్లు అతికష్టం మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా, కావ్య కనిపించడం లేదంటూ ఆమె తల్లి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.