భర్తతో తొలిసారి తిరుమలకు కాజల్ అగర్వాల్
నటి కాజల్ అగర్వాల్ తనకు పెళ్లైన తర్వాత తొలిసారిగా తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దంపతులను పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కాజల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పలువురు అభిమానులు కాజల్‌తో సెల్ఫీలు దిగారు. కాజల్, గౌతమ్ కిచ్లు అక్టోబర్ 2020లో వివాహం చేసుకున్నారు. కాజల్ ఇటీవల ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది.