WPL: గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
WPL: గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు బ్యాటర్ సోఫీ డివైన్ (99) స్వైర విహారం చేసింది. 9 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. అయితే దురదృష్టవశాత్తు సెంచరీకి ఒక పరుగు ముందే సోఫీ ఔట్ అయింది. అటు 37 పరుగులతో కెప్టెన్ స్మృతి మందనా రాణించారు. ఈ మ్యాచ్ ద్వారా డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ రెండో విజయాన్ని నమోదు చేసింది.