WPL: ముంబయి వరుస విజయాలకు యూపీ వారియర్స్ బ్రేకులు వేసింది. ముంబయి ఇండియన్స్ ఉమెన్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 127 పరుగులను యూపీ జట్టు ఛేదించింది. యూపీ బ్యాటర్లలో తహ్లియా మెక్‌గ్రాత్ (38), గ్రేస్ హారిస్ (39) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లకు 127 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ముంబయి బ్యాటర్లలో హేలీ మాథ్యూస్ (35), వాంగ్ (32) రాణించారు. కాగా, WPLలో ముంబయి జట్టుకు ఇదే తొలి ఓటమి.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్