UATelugu2h 28m
కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్.ఆర్. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్ చదివే కల్యాణ్ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
@phps1317570403
7 months ago
తారాగణం
కిరణ్ అబ్బవరం
కళ్యాణ్ప్రియాంక జవాల్కర్
సింధుపి. సాయి కుమార్
కళ్యాణ్ తండ్రితులసి
కళ్యాణ్ తల్లితనికెళ్ల భరణి
కాలేజీ ప్రిన్సిపాల్శ్రీకాంత్ అయ్యంగార్
సింధు తండ్రిగంగవ్వ
పొరుగుసుధ
మరియు కళ్యాణ్ అత్తరాజశేఖర్ అనింగిధర్మ బావమరిది
అరుణ్ కుమార్కళ్యాణ్ స్నేహితుడు
భరత్ రొంగలికళ్యాణ్ స్నేహితుడు
కిట్టయ్య
అనిల్ గీలాకళ్యాణ్ స్నేహితుడు
గోదావరి కుర్రోడు వెంకట్
తుమ్మల నర్సింహారెడ్డి
సిబ్బంది
శ్రీధర్ గాడేదర్శకుడు
ప్రమోద్‌నిర్మాత
రాజునిర్మాత
చైతన్ భరద్వాజ్
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన కిరణ్ అబ్బవరం.. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కొద్దికాలంలోనే నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 'ఎస్‌ఆర్ కళ్యాణమండపం' చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. 'వినరో భాగ్యము విష్ణుకథ', మీటర్, రూల్స్ రంజన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో రైజింగ్ స్టార్‌గా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
కిరణ్ అబ్బవరం ఎత్తు ఎంత?
5 అడుగుల 10 అంగుళాలు
కిరణ్ అబ్బవరంతొలి సినిమా?
రాజా గారు రాణి వారు
కిరణ్ అబ్బవరం ఎక్కడ పుట్టాడు?
రాయచోటి, ఆంధ్రప్రదేశ్
కిరణ్ అబ్బవరం పుట్టిన తేదీ ఎప్పుడు?
1992, జులై 15
కిరణ్ అబ్బవరం వివాహం అయిందా?
ఇంకా జరగలేదు.
కిరణ్ అబ్బవరంకు లవర్ ఉందా?
తెలియదు
కిరణ్ అబ్బవరం ఫెవరెట్ హీరో?
మెగాస్టార్ చిరంజీవి
కిరణ్ అబ్బవరం తొలి హిట్ సినిమా?
SR కళ్యాణమండంపం చిత్రం నటుడిగా మంచి గుర్తింపు ఇచ్చింది.
కిరణ్ అబ్బవరంకు ఇష్టమైన కలర్?
బ్లాక్
కిరణ్ అబ్బవరం తల్లిదండ్రుల పేరు?
తన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారని కిరణ్ చెప్పాడు.
కిరణ్ అబ్బవరానికి ఇష్టమైన ప్రదేశం?
రాయచోటి
కిరణ్ అబ్బవరం ఏం చదివాడు?
ఇంజనీరింగ్, సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు.
కిరణ్ అబ్బవరం అభిరుచులు?
సినిమాలు చూడటం, కథలు రాయడం
కిరణ్ అబ్బవరం ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 8 సినిమాల్లో నటించాడు.
కిరణ్ అబ్బవరానికి ఇష్టమైన ఆహారం?
బిర్యాని
కిరణ్ అబ్బవరం సినిమాకి ఎంత తీసుకుంటాడు?
వరుస ఫ్లాప్స్ వల్ల తాను రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని.. సినిమా హిట్ అయితే మాత్రం లాభాల్లో వాటా తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఇదివరకు సినిమాకు రూ.1.5కోట్లు తీసుకునే వాడు.
https://www.youtube.com/watch?v=FbS3ZzfE44k
మార్చి 21 , 2024
Esther Anil Bold Pics: ‘దృశ్యం’ పాప ఎస్తర్ అనిల్ లేలేత అందాలు.. ఓవర్ డోస్ తట్టుకోగలరా!
యంగ్ బ్యూటీ ఎస్తర్ అనిల్ (Esther Anil) మరోమారు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసింది.
తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్‌లో కనిపించిన ఎస్తర్.. హాట్ అందాలను ఆరబోసింది. యద అందాలు చూపిస్తూ కుర్రకారు హృదయాలను దోచుకుంది.
ఎస్తర్ తేటెస్ట్ అందాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్ తలదన్నే గ్లామర్ ఆమె సొంతం అంటూ పోస్టులు పెడుతున్నారు.
దృశ్యం (Drushyam) సినిమాలో వెంకటేష్ (Venkatesh) చిన్న కూతురిలా నటించిన ఎస్తర్ గత కొంత కాలంగా హాట్ ఫోటో షూట్‌లతో నెట్టింట ట్రెండింగ్‌గా మారుతోంది.
బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఎస్తర్ ఇప్పుడు హాట్ బ్యూటీగా మారేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే తన అందాల తెగింపుతో నెటిజన్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
2001 ఆగస్టు 27న జన్మించిన ఎస్తర్, బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో నల్లావన్ (Nallavan) సినిమా ద్వారా చిత్ర సీమలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత ఓరు నాల్ వారుమ్ (Oru Naal Varum), కాక్‌టైల్ (Cocktail), డాక్టర్ లవ్ (Doctor Love), ది మెట్రో (The Metro) చిత్రాల్లో బాలనటిగా చేసింది.
వయోలిన్ (Violin), మల్లు సింగ్ (Mallu Singh) సినిమాల్లోనూ బాలనటిగా కనిపించి అందరి దృష్టిని ఎస్తర్ ఆకర్షించింది.
అయితే 2013లో మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమాతో ఎస్తర్ ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
అందులో మోహన్‌లాల్ (Mohanlal) చిన్నకూతురిలా నటించింది. ఈ సినిమానే తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ చేయగా తిరిగే అదే పాత్రను ఎస్తర్ పోషించింది.
‘దృశ్యం’ తర్వాత ఎస్తర్‌కు వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ‘దృశ్యం 2’ తెలుగు, మలయాళ వెర్షన్‌లోనూ ఎస్తర్ నటించింది.
గతేడాది జనవరిలో రిలీజైన 'వింధ్య విక్టిమ్ వర్‌డిక్ట్' సినిమాలోనూ ఎస్తర్ ముఖ్యపాత్ర పోషించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం తమిళంలో ‘మిణ్మినీ’ చిత్రంలో ఎస్తర్ నటిస్తోంది. దాదాపు ఏడాది కాలం తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ఎస్తర్ ఆశలన్నీ ఈ సినిమాపై ఉన్నాయి.
ఇక ఎస్తర్ అవార్డుల విషయానికి వస్తే దృశ్యం సినిమాకు గాను ఉత్తమ బాలనటిగా సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌ను దక్కించుకుంది.
అలాగే ‘పాపనాశనం’ మూవీకి సంబంధించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం హీరోయిన్‌గా రాణించాలని చూస్తోన్న ఎస్తర్ సోషల్ మీడియాలో వరుసగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తోంది.
దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఫ్యాన్స్ తాకిడి పెరిగింది. ప్రస్తుతం ఆ ఖాతాను 1.4M మిలయన్ల మంది ఫాలో అవుతున్నారు.
సెప్టెంబర్ 27 , 2024
Esther Anil: దృశ్యం పాప నాభి అందాలతో రచ్చ రచ్చ.. కామెంట్లతో హీటెక్కిన సోషల్ మీడియా
దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా క్యూట్‌గా మెప్పించిన నటి ఎస్తర్ అనిల్ సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో రచ్చరచ్చ చేస్తోంది.
గ్లామర్ డోసును అమాంతం పెంచేసి సొదసుల విందు చేస్తోంది. తాజాగా లాంగ్ స్కర్ట్‌పై క్లీవేజ్ షోతో కైఫెక్కిస్తోంది. టైట్ ఫీట్ జాకెట్ ధరించిన ఈ భామ ఎద అందాలను ఆరబోసింది.
నాభి అందాల ఆలంబనతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎస్తర్ అనిల్ పసందైన పరువాలను చూసిన నెటజన్లు తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.
సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. తద్వారా ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది.
లెలేత పరువాలతో ఓలలాడిస్తున్న ఈ మలయాళి తెగింపుకు.. ఇన్‌స్టాలో 1.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఏ డ్రెస్ వేసినా తనలోని అందాల కోణాలను మాత్రం కసిగానే చూపిస్తోంది.. ఈ కొంటె అందం.
మెున్నటిదాకా చిన్నపిల్లలా కనిపించిన ఎస్తర్ అప్పుడే ఇంత పెద్దదయ్యిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
క్యూట్ లుక్స్‌లో కనిపించిన ఎస్తర్.. ఇప్పుడు హాట్ బ్యూటీగా మారిందంటూ కమెంట్లు చేస్తున్నారు.
ఎస్తేర్ అనిల్ ఆగస్టు 27 (2001) కేరళలోని వాయనాడ్‌లో జన్మించింది.
మలయాళంలో పాపనాశం(దృశ్యం) 2016 సినిమాలో నటించినందుకు గాను కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు సొంతం చేసుకుంది.
2010లో 'నల్లవన్' అనే మలయాళం సినిమాతో ఎస్తర్ సినీ రంగ ప్రవేశం చేసింది.
మలయాళంలో వచ్చిన పాపనాశం చిత్రం ఎస్తర్ కెరీర్‌ను మలుపు తిప్పింది.
తెలుగు, తమిళం రీమేక్‌గా వచ్చిన దృశ్యం 1, 2 సినిమాల్లోనూ ఎస్తర్‌నే తీసుకున్నారు.
తాజాగా తమిళ్‌లో రిలీజైన వింధ్య బాధితుల తీర్పు V3లోనూ నటించింది.
మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా అవకాశాల కోసం ఈ హాట్ క్యూటీ ఎదురు చూస్తోంది. అందులో భాగంగానే హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది
జూలై 10 , 2023
Esther Anil: హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న దృశ్యం పాప.. ఎద అందాలతో రెచ్చిపోతున్న ఎస్తర్ అనిల్
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
మే 08 , 2023
Adiparvam Movie Review: దుష్టశక్తిపై దైవశక్తి పోరాటం.. మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ మెప్పించిందా?
నటీనటులు: మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్ నోర్హానా, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్ తదితరులు
రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి
సంగీతం: మాధవి సైబ
సినిమాటోగ్రఫీ: ఎస్.ఎన్ హరీశ్
ఎడిటింగ్: పవన్ శేఖర్ పసుపులేటి
నిర్మాణ సంస్థలు: అన్వికా ఆర్ట్స్, ఏఐ (అమెరికా ఇండియా) ఎంటర్‌టైన్‌మెంట్స్
‘అమ్మోరు’, ‘అరుంధతి’ వంటి పీరియాడిక్ ఫాంటసీ చిత్రాలు టాలీవుడ్‌లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. అయితే ‘అరుంధతి’ తర్వాత ఆ స్థాయి ఫాంటసీ డ్రామా చిత్రాలు ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. ఈ క్రమంలో ఆ జానర్‌లో మంచు లక్ష్మీ నటించిన చిత్రం 'ఆదిపర్వం' (Adiparvam Movie Review). సంజీవ్ మేగోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ ఫేమ్ ఆదిత్య ఓం, ఎస్తర్, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? మంచు లక్ష్మీ తన నటనతో మెప్పించిందా? విజయాన్ని తన ఖాతాలో వేసుకుందా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
కడప దగ్గర్లోని ఎర్రగుడిలో (Adiparvam Movie Review) గుప్తనిధులు ఉన్నాయని స్థానికులు నమ్ముతుంటారు. ఆ నిధిని దక్కించుకుంటే రాయలసీమలోనే గొప్ప సంపన్నులు అవుతారని అంతా భావిస్తుంటారు. దీంతో ఆ నిధి సొంతం చేసుకునేందుకు కడప ఎమ్మెల్యే నాగమ్మ (మంచు లక్ష్మీ) ప్రయత్నిస్తుంటుంది. ఇందుకోసం క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తుంది. మరోవైపు రాయప్ప అనే గ్రామపెద్ద కూడా నిధి కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ నిధి కోసం రాయప్ప, నాగమ్మ ఎలాంటి అరాచకాలు చేశారు? ఈ క్రమంలో రాయప్ప తన కూతురు బుజ్జమ్మ (శ్రీజిత)ను ఎందుకు చంపాలనుకున్నాడు? నాగమ్మ కూడా ఆమెను ఎందుకు చంపాలనుకుంది? రాయప్ప, నాగమ్మ ఆగడాలను దేవత మారెమ్మ (సుహాసిని) ఏ విధంగా అడ్డుకుంది? నిధి దక్కించుకోవాలన్న నాగమ్మ కోరిక తీరిందా? లేదా? బుజమ్మ, శ్రీను (వెంకట కిరణ్)ల ప్రేమ వ్యవహారం ఏమైంది? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
నాగమ్మ పాత్రకు మంచు లక్ష్మీ (Adiparvam Movie Review) పూర్తిగా న్యాయం చేసింది. పవర్‌ఫుల్ నటనతో కట్టిపడేసింది. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో ఆమె అదరగొట్టింది. ఎలాగైన నిధిని దక్కించుకోవాలన్న నెగిటివ్ షేడ్ పాత్రలో తన మార్క్ చూపించింది. ప్రేమజంటగా చేసిన వెంకట్ కిరణ్, శ్రీజిత మంచి నటన కనబరిచారు. దేవత పాత్రలో చంటిగాడు ఫేం సుహాసిని ఆకట్టుకుంది. రాయప్ప పాత్రలో సత్యప్రకాశ్ బాగా చేశాడు. మంచి లక్ష్మీకి దీటుగా నటించారు. ఎస్తర్ హాట్‌హాట్‌గా కనిపించి అలరించింది. శివ కంఠమనేని, సమ్మెట గాంధీ, ఆదిత్య ఓం తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
1974-1990ల సమయంలో యధార్థంగా జరిగిన ఘటనల ఆధారంగా దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ సినిమా తెరకెక్కించారు. ఒక నిధిని వశం చేసుకోవడానికి నరబలి, తమ స్వార్థం కోసం కన్న బిడ్డను బలి ఇవ్వానుకోవడం దాని పర్యవసానాలు దర్శకుడు చక్కగా చూపించారు. నిధి కోసం ప్రాకులాడే ఇద్దరు స్వార్థపరులను ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాన్న సీక్వెన్స్ మెప్పిస్తుంది. ఎర్రగుడి గ్రామ దేవత మారెమ్మ తన గుప్త నిధిని ఎలా కాపాడుకుంది? తనని నమ్ముకున్న వారికి ఎలా అండగా నిలిచింది? అని తనదైన శైలిలో దర్శకుడు చూపించారు. ఈ క్రమంలో జరిగే దైవ, దుష్ట శక్తుల మధ్య ఫైట్ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. అటు బుజ్జమ్మ, శ్రీనుల లవ్ ట్రాక్ కూడా బాగానే చూపించారు డైరెక్టర్. అయితే రొటిన్ స్టోరీ కావడం, కథలో నాటకీయత మరీ ఎక్కువగా ఉండటం, గ్రాఫిక్స్‌లో నాణ్యత లేకపోవడం మైనస్‌గా మారాయి.
టెక్నికల్‌గా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Adiparvam Movie Review).. హరీష్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్లను భారీగా ఎలివేట్ చేసింది. ఫస్టాఫ్ విషయంలో ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. గ్రాఫిక్స్ టీమ్ ఇంకాస్త బెటర్ పర్‌ఫార్మెన్స్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
మంచు లక్ష్మీ నటనదైవ, దుష్ట శక్తి మధ్య ఫైట్‌సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీపూర్ గ్రాఫిక్స్‌సాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
నవంబర్ 09 , 2024
Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్ థ్రిల్లర్.. ‘మిరల్’ ఎలా ఉందంటే?
నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు
దర్శకత్వం: ఎం. శక్తివేల్
మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్
సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా
ఎడిటర్: కలైవనన్.ఆర్
నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్
విడుదల తేదీ: 17-05-2024
ప్రేమిస్తే ఫేమ్ భరత్ హీరోగా నటించిన చిత్రం 'మిరల్'. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
హరి (భరత్), రమ (వాణీ భోజన్) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హీరో భరత్ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఎం. శక్తివేల్.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
భరత్, వాణీ భోజన్ నటనఆసక్తికరంగా సాగే కథనంనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడంపేలవమైన క్లైమాక్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 17 , 2024
My Dear Donga Review: కామెడీతో అదరగొట్టిన అభినవ్ గోమఠం.. ‘మై డియర్ దొంగ’ ఎలా ఉందంటే?
నటీనటులు: అభినవ్ గోమఠం, శాలినీ కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ మందూరి, వంశీధర్ గౌడ్
దర్శకుడు: బీఎస్ సర్వజ్ఞ కుమార్
రచన: శాలినీ కొండేపూడి
సంగీతం: అజయ్ అరసాద
ఎడిటర్: సాయి మురళి
సినిమాటోగ్రఫీ: ఎస్ఎస్ మనోజ్
నిర్మాత: మహేశ్వర్ రెడ్డి గోజల
స్ట్రీమింగ్ వేదిక : ఆహా
హాస్యనటుడు 'అభినవ్ గోమఠం' ప్రధాన పాత్రలో చేసిన చిత్రం ‘మై డియర్ దొంగ’ (My Dear Donga Review). ఇందులో షాలిని కొండెపూడి (Shalini Kondepudi) మరో కీలక పాత్ర పోషించింది. కాగా, ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో ప్రసారం అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను అలరించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి?
సుజాత (షాలిని), డాక్టర్ విశాల్ (నిఖిల్ గాజుల) ప్రేమికులు. తొలుత బాగానే ఉన్న కొంతకాలం తర్వాత విశాల్‌లో మార్పు వచ్చిందని సుజాత భావిస్తుంటుంది. ఎక్కడకు పిలిచినా బిజీ అని చెబుతున్నాడనీ ఫీలవుతుంది. ఈ క్రమంలోనే సురేశ్ (అభినవ్ గోమఠం) ఆమె ఫ్లాట్‌లో చోరీ చేసేందుకు వెళ్తాడు. అదే సమయానికి షాలిని బర్త్‌డే సెల్రబేషన్ చేసేందుకు విశాల్ ఆమె ఫ్రెండ్స్‌తో ఇంటికి వస్తాడు. అప్పటికే విశాల్‌తో మాట్లాడిన సుజాత.. ఫ్రెండ్స్‌కు అతడ్ని బాల్య స్నేహితుడిగా పరిచయం చేస్తుంది. దొంగ అని తెలిసినా సుజాత.. సురేశ్‌తో ఎందుకు పరిచయం పెంచుకుంది? వారి కుటుంబ నేపథ్యాలేంటి? విశాల్ పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి కారణమేంటి?
ఎవరెలా చేశారంటే?
నటి షాలిని కథను ముందుండి నడిపించింది. సుజాత పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఎప్పటిలానే అభినవ్ తన కామెడీతో గిలిగింతలు పెట్టాడు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. సుజాతను ప్రేమించిన డాక్టర్ విశాల్ పాత్రలో నిఖిల్ ఫర్వాలేదనిపించాడు. దివ్య శ్రీపాద, ఆమె లవర్‌గా నటించిన శశాంక్, వెయిటర్‌గా నటించిన వంశీధర్ గౌడ్ తమ నటనతో ఓకే అనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
నేటి ప్రేమికుల మనస్తత్వం ఎలా ఉందో తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు బీఎస్ సర్వజ్ఞ కుమార్. సుజాత ఉద్యోగ ప్రస్తావన, స్నేహితులు, విశాల్‌తో లవ్ ఎపిసోడ్‌తో సినిమాను నెమ్మదిగా స్టార్ట్ చేసిన డైరెక్టర్.. సుజాత ఫ్లాట్‌లోకి సురేశ్ ప్రవేశించడం నుంచి కథలో వేగం పెంచారు. అభినవ్ గోమఠం చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ప్రతీ ఎపిసోడ్‌ను ప్రేక్షకుడిని నవ్వించాలన్న లక్ష్యంతో రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే సుజాత, సురేశ్ తమ కుటుంబాల గురించి ఒకరికొకరు వివరించే తీరు కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఎమోషనల్ సీన్స్‌ను ఇంకాస్త ప్రభావవంతంగా చూపించి ఉంటే బాగుండేది. కానీ, కామెడీ పేరుతో ఎలాంటి అసభ్యతకు చోటివ్వకుండా ఫ్యామిలీతో ఎంచక్కా చూసేలా దర్శకుడు ఈ మూవీని రూపొందించడం ప్రశంసనీయం. స్లో నేరేషన్ కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.
సాంకేతికంగా
సాంకేతిక విభాగానికొస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉంది.
ప్లస్ పాయింట్స్
షాలిని, అభినవ్ గోమఠం నటనకామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం
Telugu.yousay.tv Rating : 3/5
ఏప్రిల్ 20 , 2024
Tollywood Top 10: ‘సైరా నరసింహ రెడ్డి’ని బీట్ చేయలేకపోయిన ‘దేవర’.. తెలుగులో టాప్-10 ప్రీ-రిలీజ్ బిజినెస్ చిత్రాలు ఇవే!
తారక్ లేటెస్ట్ చిత్రం 'దేవర' రిలీజ్‌కు ఇంకో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే మూవీ టీమ్ కూడా వరుసగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై భారీగానే హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే దేవరకు సంబంధించిన రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నడూ లేనివిధంగా థియేట్రికల్ బిజినెస్ నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ దేవర ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని కోట్లు? తెలుగులో ఇప్పటివరకూ అత్యధిక ప్రిరీలిజ్ బిజినెస్ చేసిన టాప్-10 చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు విక్రయించారని అంటున్నారు. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్‌లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
ముఖ్య అతిథులుగా స్టార్ డైరెక్టర్స్!
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా ఈ నెల 22న ఈవెంట్ జరగనుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ వేడుకకు ముగ్గురు స్టార్ డైరెక్టర్లు హాజరుకానున్నట్లు సమాచారం. దర్శకధీరుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ఈవెంట్‌లో పాల్గొంటారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈవెంట్‌కు హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే దేవర టీమ్ ప్రమోషన్స్ పరంగా నార్త్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్స్‌తోపాటు మహేష్‌ను గెస్ట్‌గా పిలవడం ద్వారా ఆ విమర్శల నుంచి బయటపడాలని దేవర టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రీరిలీజ్ బిజినెస్‌లో టాప్ మూవీస్ ఇవే
ఒకప్పుడు ప్రీరిలీజ్ బిజినెస్ అంటే బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే సాధ్యమన్న ఆలోచనలో తెలుగు ఆడియన్స్ ఉండేవారు. దర్శకధీరుడు రాజమౌళి దీనిని పూర్తిగా మార్చివేశారు. ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డులకు కేరాఫ్‌గా టాలీవుడ్‌ను మార్చారు. అలవోకగా 350 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తూ తెలుగు చిత్రాలు సత్తా చాటాడు. తెలుగులో అత్యధిక ప్రిరీలిజ్ బిజినెస్ చేసిన టాప్ -10 చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆర్‌ఆర్‌ఆర్ (RRR)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు చిత్రంగా టాప్‌లో నిలిచింది. డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కలిపి ఆర్‌ఆర్‌ఆర్‌కు దాదాపు రూ.480 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.191 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. ఇప్పటి
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ. 385 కోట్ల వ్యాపారం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.180 కోట్లు, ఓవర్సీస్‌లో 70 కోట్లు, హిందీలో రూ.85 కోట్ల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
బాహుబలి 2 (Bahubali 2)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా కీలకపాత్రలు పోషించిన చిత్రం బాహుబలి 2. బాహుబలికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.350 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను రూ.190 కోట్లకు పైగా విక్రయించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
సలార్ (Salaar)
కేజీఎఫ్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే చిత్రాన్ని తీశాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.120 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా.
సాహో (Sahoo)
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్మరేపింది. సాహోకు ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.280 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నార్త్ ఇండియాలో ఏకంగా రూ.120 కోట్ల వ్యాపారం చేసి అప్పట్లో సాహో రికార్డ్ క్రియేట్ చేసింది
ఆదిపురుష్ (Adipurush)
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మూవీ ‘ఆదిపురుష్’. రామాయణాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్ సీతమ్మ తల్లిగా నటించారు. మైథలాజికల్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా అందుకు తగినట్లుగానే బిజినెస్ జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద ఈ సినిమా రూ.240 కోట్లకు పైగా వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి
రాధేశ్యామ్ (RadheShyam)
ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ హీరో ప్రభాస్‌ను కంప్లీట్ డిఫరెంట్ లుక్‌లో చూపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.107 కోట్ల వ్యాపారం చేసి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది.
సైరా నర్సింహారెడ్డి (Saira Narasimha Reddy)
చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఏకంగా 187.25 కోట్లకు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. మెగాస్టార్ కెరీర్ అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చిత్రంగా అవతరించింది. ఇక ఈ సినిమా తెలుగులో మాత్రమే బ్రేక్ ఈవెన్ దాటడం గమనార్హం.
దేవర (Devara)
కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 రిలీజ్‌కు ముందు రూ.185 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసి ఈ జాబితాలో టాప్-9లో చోటు సంపాదించింది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే (సోలో హీరోగా) హయ్యెస్ట్ అని చెప్పవచ్చు.
పుష్ప (Pushpa)
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించిన ‘పుష్ప: ది రైజ్’ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐదు భాషల్లోని థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ఇలా అన్ని కలిపి దాదాపు రూ.160 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా.
సెప్టెంబర్ 21 , 2024
68th Filmfare Awards South 2023: బెస్ట్ యాక్టర్స్‌గా రామ్‌చరణ్, తారక్.. ఆ చిత్రాలకు అవార్డుల పంట!
దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) రూపొందించిన 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. రామ్‌చరణ్ (Ram Charan), తారక్ (Jr NTR) కథానాయకులుగా చేసిన ఈ మూవీ గ్లోబల్ స్థాయిలో సత్తా చాటింది. పలు అంతర్జాతీయ అవార్జులను కొల్లగొట్టింది. అంతేకాదు పలు విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలిచి ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇదిలా ఉంటే గతేడాదికి గాను తాజాగా ప్రకటించిన ‘ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2023’ (68 Filmfare Awards south 2023) అవార్డుల్లో 'ఆర్‌ఆర్‌ఆర్' మరోమారు సత్తా చాటింది. ఏకంగా ఏడు అవార్డులు కైవసం చేసుకొని అందరి ప్రశంసలు అందుకుంటోంది. అటు సీతారామం, విరాటపర్వం, భీమ్లా నాయక్ మూవీలకు సైతం అవార్డులు దక్కాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఫిల్మ్‌ఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ మార్క్
68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. దక్షిణాది భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) 2022, 2023 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో 2022 మార్చి 24న విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ సినిమా (ఆర్ఆర్ఆర్), ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ నటుడు (రామ్‌చరణ్, తారక్), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్, ఉత్తమ కొరియోగ్రాఫర్ (ప్రేమ్ రక్షిత్), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ('కొమురం భూముడో' సాంగ్ పాడిన కాలభైరవ) విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.
‘సీతారామం’కు అవార్డుల పంట
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత టాలీవుడ్ నుంచి ‘సీతారామం’ సత్తా చాటింది. వాస్తవానికి ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘సీతారామం’ మధ్యనే గట్టి పోటీ నడిచింది. రాజమౌళి మేనియాను తట్టుకొని సైతం ‘సీతారామం’ నిలబడగలిగింది. ఎక్కువ విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. మెుత్తం ఐదు పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ మూవీ (క్రిటిక్స్), ఉత్తమ నటుడు (క్రిటిక్స్), ఉత్తమ నటి (మృణాల్ ఠాకుర్), ఉత్తమ లిరిక్స్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డులు వరించాయి. అలాగే రానా, సాయిపల్లవి జంటగా నటించిన 'విరాటపర్వం' రెండు అవార్డులు, పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్'కు ఓ అవార్డు లభించింది. మరి ఏఏ విభాగాల్లో ఎవరెవరికి ఈ అవార్డులు దక్కాయో ఒకసారి పరిశీలిద్దాం.
ఆర్‌ఆర్‌ఆర్ అవార్డ్స్
ఉత్తమ సినిమా - ఆర్ఆర్ఆర్
ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నటుడు - రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ - నాటు నాటు పాట)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) - కాల భైరవ (కొమురం భీముడో పాటకు)
సీతారామం అవార్డ్స్
ఉత్తమ మూవీ (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ (సీతారామం)
ఉత్తమ నటి - మృణాల్ ఠాకుర్ (సీతారామం)
ఉత్తమ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కానున్న కల్యాణం (సీతారామం)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్) - చిన్మయి శ్రీపాద (సీతారామం - ఓ ప్రేమ..)
ఇతర చిత్రాలు
ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయిపల్లవి (విరాటపర్వం)
ఉత్తమ సహాయ నటి - నందితా దాస్ (విరాటపర్వం)
ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
జూలై 12 , 2024
Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్ బుష్’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
ఛాయాగ్రహణం: రాజ్ తోట
సంగీతం: సన్నీ MR
ఎడిటర్ : విజయ్ వర్ధన్
నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు
సమర్పణ: యు.వి.క్రియేషన్స్
విడుదల తేదీ: 22-03-2024
శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో చేసిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush Review). శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? వీరు ముగ్గురూ కలిసి చేసిన హంగామా ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. జీవితంపై శ్రద్ద లేకుండా సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. మరి ఈ ముగ్గురు సైంటిస్టులుగా ఎలా మారారు? అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? ఆ ఊరిలోని సంపంగి దెయ్యం ఉన్న కోటలో ముగ్గురు ఎందుకు అడుగుపెట్టారు? ఆ దెయ్యానికి క్రిష్‌కి ఉన్న సంబంధం ఏంటి? కోటలోకి అడుగు పెట్టిన ఈ బిగ్‌బ్యాంగ్ బ్రదర్స్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మధ్యలో జలజాక్షి (ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే?
శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి పండించిన కామెడీ సినిమాకి ప్రధానబలం. వీళ్ల మధ్య కామెడీ టైమింగ్ చాలా సన్నివేశాలకి బలం తీసుకొచ్చింది. కథానాయికలు ప్రీతిముకుందన్, ఆయేషాఖాన్‌లకు కథలో ప్రాధాన్యం తక్కువే. అయితే ప్రియదర్శికి జోడిగా నటించిన అయేషా ఖాన్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ప్రియా వడ్లమాని కూడా అందాలు ఆరబోసింది. రచ్చ రవి, ఆదిత్య మేనన్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘జాతిరత్నాలు’ (Om Bheem Bush Review) తరహాలో ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్రయాణానికి హారర్ కామెడీతో కూడిన ఓ కాన్సెప్ట్‌ని జోడించాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెట్టేలా రూపొందించారు. ప్రథమార్థం మెుత్తాన్ని ఊరిలో వీరు చేపట్టిన ఏ టూ జెడ్ సర్వీసులు, దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో డైరెక్టర్ నడిపించాడు. ఇక ద్వితియార్థాన్ని సంపంగి మహల్ చుట్టూ తిప్పాడు డైరెక్టర్. సంపంగి దెయ్యం కథతోపాటు, పతాక సన్నివేశాలను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఆరంభ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో దెయ్యంతో డేటింగ్ వంటి సన్నివేశాలు అంతగా ప్రభావం చూపించవు. మెుత్తానికి బంగ్లా, దెయ్యం, తీరని కోరిక తదితర అంశాలన్నీ పాతవే అయినా కథకి కొత్తగా హాస్యాన్ని మేళవించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు
సాంకేతికంగా
టెక్నికల్ అంశాలకు వస్తే (Om Bheem Bush).. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎం.ఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటనకామెడీపతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీప్రథమార్ధంలోని ప్రారంభ సీన్లు
Telugu.yousay.tv Rating : 3.5/5
మార్చి 22 , 2024
SSMB 29: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు ఫైనల్ లుక్ ఇదేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు మెుదలవుతుందోనని అటు మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు కూడా చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. కాగా, ప్రస్తుతం 'SSMB29' చిత్రానికి సంబంధించిన ప్రీ పొడక్షన్ పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఈ వర్స్క్‌లోనే మూవీలో మహేష్ లుక్ ఏ విధంగా ఉండాలన్న డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
మహేష్ లుక్ అదేనా?
‘SSMB 29’లో మహేష్ లుక్ ఎలా ఉండనుందన్న క్యూరియాసిటీ ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో మహేష్ షేర్ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. మరి ఈ లుక్ SSMB29 కోసమేనా? లేదా నార్మల్ లుక్? అన్న దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రాజమౌళి చిత్రం కోసం ఈ లుక్‌ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ కూడా రానుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
మహేష్ కోసం 8 లుక్స్ డిజైన్!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తన సినిమాల్లోని హీరోల లుక్ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. కథకు తగ్గట్టుగా హీరో లుక్‌ను మెయిన్‌టైన్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్న పేరు ఇండస్ట్రీలో ఉంది. ఇందుకు అనుగుణంగానే తన అప్‌కమింగ్ మూవీ ‘SSMB29‘లోనూ మహేష్ లుక్‌పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. మహేష్ పాత్రకు సంబంధించి ఎనిమిది లుక్ డిజైన్స్‌ను ఆయన సిద్ధం చేశారట. వాటిని స్కెచ్ రూపంలోకి మార్చి అందులో ఏది మహేష్‌కు బాగా సెట్ అవుతుందో రాజమౌళి దగ్గరుండి పరిశీలిస్తున్నారట. ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే మహేష్ లేటెస్ట్ లుక్ బయటకు రావడం ఆసక్తిని పెంచింది.
కృష్ణుడి గెటప్‌లో మహేష్!
రాజమౌళి ఆ ఎనిమిది లుక్స్‌కు సంబంధించి మహేష్‌తో ఫొటోషూట్ కూడా నిర్వహించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆ ఎనిమిది లుక్స్‌లో కృష్ణుడి గెటప్ కూడా ఉందట. ఇటీవల మహేష్‌ను కృష్ణుడి గెటప్‌లో షూట్ కూడా చేశారని సమాచారం. ఆ లుక్ మహేష్‌కు మాటల్లో చెప్పలేనంత బాగా కుదిరిందని అంటున్నారు. మహేష్‌ను కృష్ణుడి గెటప్‌లో చూసి చిత్ర యూనిట్ ఎంతగానో మురిసిపోయిందని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
200 మందితో ప్రీ ప్రొడక్షన్ పనులు!
ప్రస్తుతం రాజమౌళి తన 200 మంది బృందంతో ప్రీ ప్రొడక్షన్, స్కెచ్, లుక్ టెస్ట్ నిర్వహిస్తున్నారట. సినిమా ప్రారంభం కాకముందే 200 మంది టీమ్ అంటే సెట్స్ పైకి వెళ్లాక ఇంకెంత మంది పని చేస్తారోనని ఫిల్మ్ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. కాగా, ‘SSMB29’ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమని ప్రచారం జరుగుతోంది. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ మేకర్స్‌తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు ఇటీవల వార్తలు సైతం వచ్చాయి.
‘చెల్సియా ఎంత ఫేమస్సో తెలుసా?
అమెరికన్ - ఇండోనేషియా నటిగా బ్యూచెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌కి మంచి గుర్తింపు ఉంది. ‘చెల్సియా ఇస్లాన్.. 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్‌ను సైతం ఈ అమ్మడు అందుకుంది. ఈ భామ ఎంట్రీపై రాజమౌళి టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్!
‘SSMB29’ సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈసారి జక్కన్న కాస్త భారీగానే ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘SSMB29’ సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్ ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా? అని మూవీ టీమ్ ఆలోచిస్తోందట. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది త్వరలోనే తెలియనుంది.
మార్చి 08 , 2024
This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే
ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజైన ఆయా చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం.
థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలు
రంగబలి(Rangabali)
నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. ఈ మూవీని పవన్ బాసంశెట్టి తెరకెక్కించాడు. ‘లవ్ స్టోరీ’ మూవీకి మ్యూజిక్ అందించిన పవన్ సీహెచ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సత్య, సప్తగిరి, బ్రహ్మాజీ, తదితరులు నటించగా సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. జులై 7న సినిమా విడుదల కానుంది.
రుద్రంగి(Rudrangi)
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన చిత్రం ‘రుద్రంగి’. జగపతి బాబు, మమత మోహన్‌దాస్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అజయ్ సామ్రాట్ డైరెక్షన్ చేయగా నోఫెల్ రాజా మ్యూజిక్ అందించాడు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది.
భాగ్ సాలే(Bhaag Saale)
శ్రీసింహ కోడూరి హీరోగా వస్తున్న చిత్రం ‘భాగ్ సాలే’. నేహా సోలంకి శ్రీసింహ సరసన నటించింది. వైవా హర్ష, రాజీవ్ కనకాల, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ మూవీని క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. కాలభైరవ మ్యూజిక్ అందించాడు. జులై 7న రిలీజ్ అవుతోంది.
ఇద్దరు(Iddaru)
యాక్షన్ కింగ్ అర్జున్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మాణంలో వస్తోందీ సినిమా. జులై 7న రిలీజ్ కానుంది.
సర్కిల్(Circle)
‘ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో’ అంటూ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకత్వం వహించాడు. సాయి రోనక్, అర్షిణ్ మెహతా, బాబా భాస్కర్, నైనా తదితరులు ఇందులో నటించారు. జులై 7న మూవీ రిలీజ్.
ఓ సాథియా (Oo Sathiya)
దివ్య భావన దర్శకత్వంలో ‘ఓ సాథియా’ తెరకెక్కింది. ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి, తదితరులు నటించారు. చందన కట్టా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా సైతం జులై 7న విడుదల కానుంది.
7.11 PM
ఆసక్తికరమైన కథాంశంతో 7.11 PM మూవీ థియేటర్లలోకి వస్తోంది. చైతు మాదాల ఈ మూవీని తెరకెక్కించాడు. సాహస్, దీపిక ప్రధాన పాత్రల్లో నటించారు. నరేశ్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సినిమాను నిర్మించారు. జులై 7న విడుదల కాబోతోంది.
మోహనకృష్ణ గ్యాంగ్‌లీడర్ (Mohanakrishna’s Gang Leader)
మోహనకృష్ణ, సౌజన్య, హరిణి, సుమన్, తదితరులు నటించిన చిత్రమే ఇది. మోహనరావు డైరెక్షన్ చేసి నిర్మాతగా వ్యవహరించారు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది.
నాతో నేను(Natho Nenu)
సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల తదితరులు నటించిన చిత్రం ‘నాతో నేను’. జులై 7న విడుదల కానుంది. తుర్లపాటి శాంతికుమార్ దర్శకత్వం వహించగా ప్రశాంత్ టంగుటూరి నిర్మాతగా వ్యవహరించారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
TitleCategoryLanguagePlatformRelease DateIshq Next DoorMovieHindiJio CinemaJuly 3GoodNightMovieTamilDisney + HotstarJuly 3BabylonMovieEnglishAmazon PrimeJuly 5Sweet Kaaram CoffeeWeb SeriesTeluguAmazon PrimeJuly 6The Pope's ExorcistMovieEnglishNetflixJuly 7DeepFakeLoveWeb SeriesEnglishNetflixJuly 7AdhuraWeb SeriesHindiAmazon PrimeJuly 7TarlaMovieHindiZee5July 7IB 71MovieHindiDisney + HotstarJuly 7FarhanaMovieTamil/TeluguSony LivJuly 7BlindMovieHindiJio CinemaJuly 7
APP
ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్ల ముందు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో ‘YouSay Web’బటన్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.
జూలై 03 , 2023
Guntur Kaaram: త్రివిక్రమ్‌తో ఆ విషయంలో కుదరకే పూజా హెగ్డే బయటకొచ్చిందా? సంయుక్త మీనన్ ఎంట్రీ!
మహేష్ బాబు, త్రివిక్రమ్(Mahesh Babu-Trivikram) కాంబినేషన్‌లో గుంటూరు కారం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ గురించి ఏదొక వివాదం చర్చలకు మూల కేంద్రంగా మారుతునే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మార్పులే మార్పులు
ఇప్పటికే స్టోరీ మహేష్‌బాబుకు తగ్గట్టు లేదని ఓసారి మార్చివేశారు. కొన్ని కారణాల వల్ల ఫైట్ మాస్టర్స్‌ను తొలగించారు. రెండు షెడ్యూల్స్‌లో జరిగిన షూటింగ్‌ను కంప్లీట్‌గా పక్కకు పెట్టారు. ఇప్పుడు పూజా హెగ్డే సైతం బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది.
ఫలితంగా ఈ చిత్రం కాస్టింగ్‌లో భారీగా మార్పులు రానున్నాయి. పూజా హెగ్డే స్థానంలో మరొక స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంయుక్త మీనన్ లేదా త్రిషను సినిమాలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.
అదే అసలు సమస్య
డేట్ సమస్యల కారణంగా పూజా హెగ్డే సినిమా నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. జూన్- ఆగస్టు టైమ్‌ఫ్రేమ్‌లో పూజా హెగ్డే ఇతర సినిమాలు చేయాల్సి ఉంది. ఈ టైమ్‌లో గుంటూరు కారం సినిమా వల్ల ఇతర చిత్రాల షెడ్యూల్‌కు ఆటంకం కలుగుతుందని ఆమె భావించిందని సమాచారం. షెడ్యూల్స్ సరైన టైమ్‌కి పూర్తికాకపోవడం, కొన్ని సీన్లు రీషూట్ చేయడం, అనుకున్న సమయానికి షెడ్యూల్స్ పూర్తికాకపోయినా.. కొత్త షెడ్యూల్స్ ప్రకటించడం, కొన్ని షెడ్యూల్స్‌లో జరిగిన సన్నివేశాలను రీ షూట్ చేయడం వంటి వాటి పట్ల పూజా హెగ్డే తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేందుకే.. గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే వైదొలిగినట్లు తెలిసింది.
తమన్ తప్పుకున్నట్లు ప్రచారం..
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. తమన్‌కు బదులు అనిరుధ్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నట్లు బజ్ నడిచింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తమన్ క్లారిటీ ఇచ్చారు. కావాలని కొంత మంది కడుపు మంటతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కడుపుమంట ఉన్నవాళ్లు తన ఆఫీస్ వద్దకు రావాలని సూచించారు. ఆఫీస్ ముందు మజ్జిగ స్టాల్ ఏర్పాటు చేశానని అక్కడ ఫ్రీగా మజ్జిగ తాగి కడుపు మంట తగ్గించుకోవాలని సూచించారు. ఈసారి తాను అందించే మ్యూజిక్‌తో బాక్స్‌లు బద్దలు అవుతాయని చెప్పుకొచ్చారు.
https://twitter.com/MusicThaman/status/1670846867650002946?s=20
పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్?
పూజా హెగ్డే స్థానంలో మరో హీరోయిన్ కోసం చిత్ర బృందం అన్వేషణ మొదలు పెట్టిందని సమాచారం. మహేష్ సరసన సంయుక్త మీనన్(Samyuktha Menon)ను హీరోయిన్‌గా తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. సంయుక్త మీనన్ కాకపోతే.. త్రిష(Trisha)ను కూడా సంప్రదించాలని భావిస్తున్నారట. మరి పూజా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవర్నీ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
https://twitter.com/SSMB28_29/status/1671043502451609601?s=20
పూజా ఓవర్ యాటిట్యూడ్
అయితే కొంత మంది అభిమానులు పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు పూజా హెగ్డేను ఎంకరేజ్ చేయడం ఆపాలని సూచిస్తున్నారు. ఆమెకు తెలుగు సినిమాలంటే గౌరవం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభాస్‌తో తీసిన సినిమాలోనూ ఇదే జరిగిందని కామెంట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో హిందీ, తమిళ్ సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఇవ్వదని ఏకిపారేస్తున్నారు.
https://twitter.com/898SAG/status/1671025365240942595?s=20
పూజా హెగ్డే స్థానంలో కియరా అద్వానిని మహేష్‌కు జోడీగా తీసుకొస్తే బాగుంటుందని మరికొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
మూవీ బృందం క్లారిటీ
గుంటూరు కారం మూవీలో జరుగుతున్న మార్పులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. పూజా హెగ్డేని హీరోయిన్‌గా మూవీ నుంచి తీసివేసే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఆమెతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. సినిమా షూటింగ్ 24 జూన్ 2023 నుంచి ప్రారంభమవుతుంది అని స్పష్టం చేసినట్లు తెలిసింది.
https://twitter.com/TheAakashavaani/status/1671040847054528512?s=20
అల్లు అర్జున్‌తో మళ్లీ...
మరోవైపు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు త్రివిక్రమ్ ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనుండగా... నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఇంతకుముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు వచ్చాయి.
జూన్ 20 , 2023