• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Guntur Kaaram: త్రివిక్రమ్‌తో ఆ విషయంలో కుదరకే పూజా హెగ్డే బయటకొచ్చిందా? సంయుక్త మీనన్ ఎంట్రీ!

    మహేష్ బాబు, త్రివిక్రమ్(Mahesh Babu-Trivikram) కాంబినేషన్‌లో గుంటూరు కారం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ గురించి ఏదొక వివాదం చర్చలకు మూల కేంద్రంగా మారుతునే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    మార్పులే మార్పులు

    ఇప్పటికే స్టోరీ మహేష్‌బాబుకు తగ్గట్టు లేదని ఓసారి మార్చివేశారు. కొన్ని కారణాల వల్ల ఫైట్ మాస్టర్స్‌ను తొలగించారు. రెండు షెడ్యూల్స్‌లో జరిగిన షూటింగ్‌ను కంప్లీట్‌గా పక్కకు పెట్టారు. ఇప్పుడు పూజా హెగ్డే సైతం బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది.

    ఫలితంగా ఈ చిత్రం కాస్టింగ్‌లో భారీగా మార్పులు రానున్నాయి. పూజా హెగ్డే స్థానంలో మరొక స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంయుక్త మీనన్‌ లేదా త్రిషను సినిమాలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.

    అదే అసలు సమస్య

    డేట్ సమస్యల కారణంగా పూజా హెగ్డే సినిమా నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. జూన్- ఆగస్టు టైమ్‌ఫ్రేమ్‌లో పూజా హెగ్డే ఇతర సినిమాలు చేయాల్సి ఉంది. ఈ టైమ్‌లో గుంటూరు కారం సినిమా వల్ల ఇతర చిత్రాల షెడ్యూల్‌కు ఆటంకం కలుగుతుందని ఆమె భావించిందని సమాచారం. షెడ్యూల్స్ సరైన టైమ్‌కి పూర్తికాకపోవడం, కొన్ని సీన్లు రీషూట్ చేయడం, అనుకున్న సమయానికి షెడ్యూల్స్ పూర్తికాకపోయినా.. కొత్త షెడ్యూల్స్ ప్రకటించడం, కొన్ని షెడ్యూల్స్‌లో జరిగిన సన్నివేశాలను రీ షూట్ చేయడం వంటి వాటి పట్ల పూజా హెగ్డే తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేందుకే.. గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే వైదొలిగినట్లు తెలిసింది.

    తమన్ తప్పుకున్నట్లు ప్రచారం..

    మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. తమన్‌కు బదులు అనిరుధ్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నట్లు బజ్ నడిచింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తమన్ క్లారిటీ ఇచ్చారు. కావాలని కొంత మంది కడుపు మంటతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కడుపుమంట ఉన్నవాళ్లు తన ఆఫీస్ వద్దకు రావాలని సూచించారు. ఆఫీస్ ముందు మజ్జిగ స్టాల్ ఏర్పాటు చేశానని అక్కడ ఫ్రీగా మజ్జిగ తాగి కడుపు మంట తగ్గించుకోవాలని సూచించారు.  ఈసారి తాను అందించే మ్యూజిక్‌తో బాక్స్‌లు బద్దలు అవుతాయని చెప్పుకొచ్చారు.

    పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్?

    పూజా హెగ్డే స్థానంలో మరో హీరోయిన్‌ కోసం చిత్ర బృందం అన్వేషణ మొదలు పెట్టిందని సమాచారం. మహేష్ సరసన సంయుక్త మీనన్‌(Samyuktha Menon)ను హీరోయిన్‌గా తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. సంయుక్త మీనన్ కాకపోతే.. త్రిష(Trisha)ను కూడా సంప్రదించాలని భావిస్తున్నారట. మరి పూజా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవర్నీ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

    పూజా ఓవర్ యాటిట్యూడ్

    అయితే కొంత మంది అభిమానులు పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు పూజా హెగ్డేను ఎంకరేజ్ చేయడం ఆపాలని సూచిస్తున్నారు. ఆమెకు తెలుగు సినిమాలంటే గౌరవం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభాస్‌తో తీసిన సినిమాలోనూ ఇదే జరిగిందని కామెంట్ చేస్తున్నారు.  ప్రమోషన్స్ విషయంలో హిందీ, తమిళ్‌ సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఇవ్వదని ఏకిపారేస్తున్నారు.

    పూజా హెగ్డే స్థానంలో కియరా అద్వానిని మహేష్‌కు జోడీగా తీసుకొస్తే బాగుంటుందని మరికొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 

    మూవీ బృందం క్లారిటీ

    గుంటూరు కారం మూవీలో జరుగుతున్న మార్పులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. పూజా హెగ్డేని హీరోయిన్‌గా మూవీ నుంచి తీసివేసే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఆమెతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.  సినిమా షూటింగ్ 24 జూన్ 2023 నుంచి ప్రారంభమవుతుంది అని స్పష్టం చేసినట్లు తెలిసింది.

    అల్లు అర్జున్‌తో మళ్లీ…

    మరోవైపు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు త్రివిక్రమ్ ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనుండగా… నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఇంతకుముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు వచ్చాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv