• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాట్నా అభిమానులకు ‘బన్నీ’ స్పెషల్ థ్యాంక్స్

    నవంబర్ 18న పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారికి కృతజ్ఞతలు చెప్పారు. థ్యాంక్యూ పాట్నా అంటూ ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు. https://x.com/alluarjun/status/1858464910726058248

    పుష్ప 2 ట్రైలర్ ఆల్ టైం రికార్డు

    పుష్ప 2 ట్రైలర్ అల్ టైం రికార్డు సృష్టించింది. ఇండియాలో విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. అన్నీ భాషల్లో కలిపి పుష్ప ట్రైలర్ 102 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసింది.

    ‘పుష్ప 2’ నుంచి సడెన్‌ సర్‌ప్రైజ్‌!

    ‘పుష్ప 2’ టీమ్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది. పుష్ప ఫస్టాఫ్‌ లాక్‌ అయిందని ఓ స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా తెలిపింది. తొలి భాగం ఫుల్‌ ఫైర్‌తో లోడ్‌ అయ్యిందని చెప్పింది. ఈ మేరకు ‘పుష్ప ఫస్ట్‌ ఆఫ్‌ లాక్‌ అండ్‌ లోడెడ్‌’ అనే క్యాప్షన్‌ పెట్టి పోస్టర్‌ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్‌ షూట్‌ జరుగుతోంది. ఫహాద్‌ ఫాజిల్‌, బన్నీ మధ్య సీన్స్‌ షూట్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ 6న వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది.

    ‘పుష్ప 2’ కొత్త షెడ్యూల్!

    ‘పుష్ప 2 ది రైజ్’ చిత్రంపై తాజా అప్‌డేట్ వినిపిస్తుంది. ఈ చిత్రంకి సంబందించిన షూటింగ్ పై క్లారిటీ వచ్చింది. రేపటి నుండి ఈ సినిమాకి సంబందించిన కొత్త షెడ్యూల్ ఒకటి స్టార్ట్ కానుందని సమాచారం. హైదరాబాద్‌లో కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. అయితే దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    బన్నీ సరసన దీపికా పదుకొనే..?

    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా తెరకెక్కనుంది. పుష్ప-2 తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొనేను తీసుకోబోతున్నట్లు సమాచారం. సెకండ్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డేను సైతం తీసుకుంటారని తెలిసింది. ఈ వార్తలపై స్పష్టత రావాల్సింది. ఇక దీపికా భారత్‌లోని అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఉన్నారు. అలాంటి దీపికతో బన్నీ స్టెప్పులేస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే తెగ సంబరపడిపోతున్నారు.

    20 ఏళ్ల మాట నిజమైంది: బన్నీ

    మైత్రీ మూవీ మేకర్స్‌ ఇచ్చిన గ్రాండ్‌ పార్టీలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్‌కు వెళ్లమని దేవిశ్రీకి ఎన్నో సార్లు చెప్పానని పేర్కొన్నాడు. ‘ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు నేనూ వచ్చేస్తా’ అని దేవీ అనేవాడని తెలిపాడు. అయితే ‘పుష్ప’ చిత్రం ద్వారా ఇద్దరం ఒకేసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టామని, జాతీయ అవార్డులు సైతం అందుకున్నామని బన్నీ సంతోషం వ్యక్తం చేశాడు. 20 ఏళ్ల నుంచి దేవితో అంటున్న మాట నిజమైనందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

    బన్నీ బ్యూటీపుల్ మూమెంట్స్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న సంగతి తెలిసిందే. పుష్పలో తన మెస్మరైజ్ యాక్టింగ్‌తో బన్నీ .. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లోకి తీసుకెళ్లాడు. ఆయన నటనకు గాను భారత ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డుతో సత్కరించింది. ఈక్రమంలో అక్కడి బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను అల్లు అర్జున్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    ఇది గొప్ప ఆనందం: అల్లు అర్జున్

    69వ నేషనల్ అవార్డు 2023 కార్యక్రమంలో ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరుగుతోంది. జాతీయ ఉత్తమ నటుడిగా హీరో అల్లు అర్జున్ అవార్డు స్వీకరించనున్నారు. ఈ సందర్బంగా వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నేషనల్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం పుష్పలోని తగ్గేదేలే డైలాగ్ చెప్పి అలరించారు. దీనికి సబంధించిన మీడియాను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచున్నారు. NATIONAL AWARD WINNING BEST ACTOR Icon Star @alluarjun shares his excitement ahead of … Read more

    అల్లు అర్జున్ అరుదైన రికార్డ్

    మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌లో మైనపు బొమ్మ కలిగి ఉన్న తొలి టాలీవుడ్ నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించబోతున్నారు. దీని కోసం దుబాయ్ వెళ్లిన బన్నీ 200లకు పైగా కొలతలు ఇచ్చారు. పుష్ఫ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న ఆయన మరో ఘనతను సొంతం చేసుకుంటుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్, మహేశ్ బాబు, కాజల్, సత్యరాజ్ మైనపు బొమ్మలు ఇప్పటికే ఇతర దేశాల్లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాల్లో ఉన్నాయి.

    బన్నీ ఇస్తానన్న సర్‌ప్రైజ్ ఇదే

    ఈ రోజు ఇస్తానన్న సర్‌ప్రైజ్‌ను అల్లు అర్జున్ ఇంస్టా వేదికగా ఓ వీడియోతో పంచుకున్నాడు. అందులో తన ఇంట్లోని గార్డెన్, స్విమ్మింగ్ పూల్ ఏరియాను చూపించాడు. ఇక సెట్స్‌కు వెళ్లే దారిలో పిల్లలకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్‌లోకి వెళ్లి అక్కడ తన అభిమానులను కలిసి మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా మా ఇండియన్ అభిమానుల్లా ఎవ్వరూ ఉండరు అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. … Read more