మార్చి 21న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో 125 ఏళ్ల యోగా గురు స్వామి శివానంద హైలెట్‌గా నిలిచారు. చెప్పులు లేకుండా తెల్లటి కుర్తా, ధోతీ ధరించి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ప్రధానికి, రాష్ట్రపతికి సాష్ఠాంగ నమస్కారం చేసి పద్మశ్రీని అందుకోవడానికి వెళుతుండగా రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ చప్పట్లతో ప్రతిధ్వనించింది.
పద్మ అవార్డ్స్‌లో స్వామి శివానంద స్టార్ ఆఫ్ ది నైట్‌గా నిలిచారు. మరి ఎందుకు ఆయన అంత ప్రత్యేకమైన వ్యక్తి, అంతటి అభిమానం ఎలా సంపాదించుకున్నాడో తెలుసుకుందాం.
స్వామి శివానంద భారతదేశం విభజన జరగకముందు సిల్హెట్ జిల్లాలో 1896లో జన్మించారు. యోగా సాధన, నూనె లేని ఉడికించిన ఆహారం తినడంతో ఆయన దీర్ఘాయువును ఆపాదించుకొని మానవాళికి సేవల్ని అందిస్తున్నాడు. 1963 లో రిషికేశ్ పేరుతో అతని జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా అనేక యోగా ఆశ్రమాలు స్థాపించబడ్డాయి. స్వామి శివానంద తల్లిదండ్రులు జీవనోపాధి కోసం భిక్షాటన చేసేవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన శివానంద పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్‌లో గురు ఓంకారానంద గోస్వామి సంరక్షణలో గడిపాడు. ఆశ్రమంలో సాధారణ పాఠశాల విద్యతో పాటు యోగా, ఆధ్యాత్మిక విద్యలో శిక్షణ పొందాడు.
‘ప్రపంచమే నా ఇల్లు, ప్రజలే నా తల్లిదండ్రులు. వారిని ప్రేమించడం, సేవ చేయడం నా మతం – ఇది అతని విశ్వాసం. ఇదే సంకల్పంతో ప్రస్తుతం ఈశాన్య భారతదేశంలోని వారణాసి, పూరి, హరిద్వార్, నబద్వీప్ మొదలైన ప్రాంతాలలో నిరుపేదలకు తన సేవలను అందిస్తున్నాడు. గత 50 సంవత్సరాలుగా, ‘స్వామి శివానంద పూరీలో 400-600 మంది కుష్టువ్యాధి పీడిత బిక్షాటన చేసేవారి గుడిసెల వద్దకు వెళ్లి వారికి గౌరవప్రదంగా సేవ చేస్తుంటాడు.
వారినే దేవుళ్లుగా భావించి ఆహార పదార్థాలు, పండ్లు, బట్టలు, దుప్పట్లు, దోమతెరలు, వంట పాత్రలు వంటి వివిధ వస్తువులను వారి అవసరాల ఆధారంగా ఏర్పాటు చేస్తాడు. సమాజానికి ఆయన చేసిన కృషికి బసుంధర రతన్ అవార్డు, 2019లో యోగా రత్నతో సహా మరెన్నో అవార్డులు లభించాయి. అతడి జీవనశైలి ఆధారంగా ఆరోగ్య పరిస్థితి, అవయవాలు ఎలా పనిచేస్తున్నాయని పరిశీలించేందుకు పలు హాస్పిటల్స్ అతడికి పరీక్షలు కూడా జరిపాయి. కోవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పొందిన దేశంలోనే అతి పెద్ద వయసు కలిగిన వాడు. కోవిడ్ టీకా తీసుకోవాలని తన అనుచరులకు సందేశాన్నిచ్చాడు.
స్వామి శివానంద.. యోగా, వేదాంతతో పాటు ఇతర వేర్వేరు విషయాలకు సంబంధించి 296 పుస్తకాలను రచించారు. అతని పుస్తకాల్లో ఎక్కువగా యోగా ప్రాముఖ్యత గురించి చెప్పడమే కాకుండా దాని ఆచరణపై ఎక్కువగా దృష్టిసారించాడు. ఈ యోగా గురువు దర్భార్ హాల్‌లోకి రాగానే ముందుగా ప్రధాని నరేంద్రమోది ముందు సాష్టాంగ నమస్కారం చేయగా, అది చూసి ఆయన కూడా నమస్కరించారు. దేశాధినేత రామ్‌నాథ్ కోవింద్ కు గౌరవ సూచకంగా ఆయన ముందు మళ్లీ నమస్కరించారు. 125 ఏళ్ల యోగా గురు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!