ప్రముఖ బాక్సర్లలో ఒకరైన మైక్ టైసన్ పేరు తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. అతడ్ని ఓడించడం అసంభవమని అందరూ భావిస్తుంటారు. అటువంటి మైక్ టైనస్ తాజాగా జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయారు. 27 ఏళ్ల బాక్సర్ జేక్ పాల్ (Jake Paul) చేతిలో ఓటమి చవిచూశాడు. 78-74తేడాతో మ్యాచ్‌ను కోల్పోయాడు. అయితే ఈ మ్యాచ్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లైవ్ ఇచ్చింది. దిగ్గజ బాక్సార్ అయిన మైక్ టైసన్ ఓ కుర్రాడి చేతిలో ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డబ్బు కోసం కావాలనే టైసన్ ఓడిపాయారని విమర్శలు చేస్తున్నారు.
టైసన్ కావాలనే ఓడిపోయారా?
మైక్ టైసన్‌ను (Jake Paul vs Mike Tyson) ఎదుర్కొవాలంటే అవతలి బాక్సార్ కూడా దిగ్గజం అయ్యి ఉండాలి. కానీ, ఓ యువకుడి చేతిలో టైసన్ ఓటమిని చవిచూడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అది కూడా యూట్యూబర్, ప్రొఫెషనల్ బాక్సర్ జేక్ పాల్ (27 ఏళ్లు) చేతిలో ఓడిపోవడాన్ని ఆయన అభిమానులు, సగటు బాక్సింగ్ లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ బాక్సింగ్ మ్యాచ్ టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్‌లోని AT&T స్టేడియంలో జరిగింది. మైక్ టైసన్ – జేక్ పాల్ మధ్య మెుత్తం 8 రౌండ్లు జరగ్గా ఏ దశలోనే పాల్ పోటీ ఇవ్వలేకపోవడం ఆశ్చర్యమే. కేవలం రెండు రౌండ్లలో మాత్రమే గెలిచి మిగిలిన ఆరు రౌండ్లలో టైసన్ ఓడిపోయారు. దీంతో 10-9, 10-9, 9-10, 9-10, 9-10, 9-10, 9-10, 9-10 తేడాతో పాల్ విజయం సాధించాడు. అయితే ఇది WWW తరహాలో జరిగిన ఫిక్సింగ్ మ్యాచ్ అంటు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. టైసన్ కావాలనే ఓడిపోయారని మ్యాచ్ చూసిన ఎవరికైనా స్పష్టంగా తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. టైసన్ లాంటి దిగ్గజ బాక్సర్ ఇలా డబ్బుకోసం ఓడిపోవడం ఏమాత్రం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టైసన్ ఆటతీరుపై అనుమానాలు!
మ్యాచ్‌కు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం విజేతగా నిలిచిన జేక్ పాల్‌కు (Jake Paul vs Mike Tyson) 40 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.337 కోట్లు) బహుమానంగా లభించనుంది. ఓడిపోయినప్పటికీ టైసన్‌కు 20 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.168 కోట్లు) ఇవ్వబడుతుంది. అయితే పాల్ కోసం టైసన్ కావాలనే ఓడిపోయారన్న వాదనలు నెట్టింట బలంగా వినిపిస్తున్నాయి. జేక్ పాల్‌కు డబ్బు అవసరం బాగా ఉందని ఈ కారణం చేతనే మ్యాచ్ పేరుతో ప్రజల్లో హైప్ తీసుకొచ్చారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. టైసన్ కూడా పాల్‌తో కుమ్మక్కై తెలివిగా ఓడిపోయారని అంటున్నారు. మ్యాచ్ జరిగిన తీరును పరిశీలిస్తే తొలి రెండు రౌండ్లు టైసన్ దూకుడు ప్రదర్శించారని గుర్తు చేస్తున్నారు. పాల్‌ను కార్నర్‌లోకి నెట్టి పంచ్‌లు కురిపించాడని చెబుతున్నారు. తద్వారా మ్యాచ్‌ను రక్తి కట్టించాడని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత అనూహ్యాంగా టైసన్ డల్ కావడం గమనించామని చెబుతున్నారు. దాడి చేసిన వ్యక్తే తిరిగి ఎలా అలిసిపోతారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ప్రాక్టిస్ వీడియోలో చూపించినంత వేగం రియల్ మ్యాచ్‌లో కనిపించలేదని చెబుతున్నారు.
ప్రమోషన్ స్టంట్స్‌లో భాగమేనా?
ఈ మ్యాచ్ స్క్రిప్టెడ్ అని చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు సైతం (Jake Paul vs Mike Tyson) నెటిజన్లు ఇస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైక్ టైసన్, జేక్ పాల్ బరువును కొలిచే కార్యక్రమాన్ని నిర్వహాకులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తన ముందుకు వచ్చిన పాల్‌పై టైసన్ ఆవేశంతో చేయిచేసుకున్నాడు. చెంప చెల్లుమని అనిపించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. అయితే ఇదంతా మ్యాచ్‌పై హైప్ తీసుకురావడం కోసమే చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఆ ఘటన తర్వాత టైసన్ – పాల్ మధ్య హోరా హోరీ పోరు తప్పదని అంతా భావించేలా చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే మ్యాచ్ చివరలో జరిగిన ఓ విషయాన్ని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సాధారణంగా బాక్సింగ్ వంటి ఫిజికల్ గేమ్‌లో పోటీదారుల్లో విపరీతమైన ఆవేశం, ఆగ్రహం ఉంటుంది. ఈ నేపథ్యంలో విన్నర్‌ను అనౌన్స్ చేసినప్పటికీ వారిలో కోపం కొద్ది నిమిషాల పాటు అలాగే ఉంటుంది. అయితే మ్యాచ్‌లో విన్నర్‌ను ప్రకటించిన వెంటనే టైసన్‌కు పాల్ అభివాదం చేశాడు. తనకెదో మేలు చేసినట్లు ఒంగిమరి కృతజ్ఞతలు తెలిపినట్లు అనిపించిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరి ఈ ప్రచారంలో వాస్తవమెంతో తేలాల్సి ఉంది.
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: టాలీవుడ్‌పై రేవంత్ సర్కార్ పగ? వరుస ఘటనలు ఏం చెబుతున్నాయి?