చాలా మంది యువత వర్షకాలంలో బయటకు వెళ్లేందుకు, ప్రయాణాలు చేసేందుకు ఇష్టపడరు. వేడి వేడిగా టీ, కాఫీ సిప్ చేస్తూ ఇంట్లోనే, స్నేహితుల మధ్యలోనే ఎంజాయ్ చేస్తుంటారు. అయితే భారత దేశంలో ముఖ్యంగా వర్షకాలంలో యూత్ చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని గుర్తించుకోవాలి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అప్పుడప్పుడూ దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈక్రమంలో తప్పకుండా ఈ ఆరు వస్తువులను మీ వెంట క్యారీ చేసుకోవడం ఎంతైనా అవసరం. మరి తప్పకుండా తీసుకెళ్లాల్సి ఆ ఆరు వస్తువులు ఏమిటో ఓసారి చూద్దామా ఫ్రెండ్స్..
1. గొడుగు(Umbrella)
వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరి బ్యాగుల్లో గొడుగు ఉండాల్సిందే. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎక్కువగా గొడుగు తీసుకెళ్లేందుకు యూత్ ఇష్టపడరు. ఎందుకంటే మనం తీసుకెళ్లే గొడుగు సైజ్ బ్యాగులో పట్టకపోవడమే. అయితే మీ బ్యాగ్‌లో సరిపోని సూపర్‌సైజ్డ్ గొడుగులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా చిన్న సైజ్‌లో మడతపెట్టే గొడుగులు మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకదానిని ఎంచుకుంటే సరిపోతుంది.
2. Rain Coat
నిత్యం ప్రయాణించే విద్యార్థులకు, రోజు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు ముఖ్యంగా బైక్‌పై వెళ్లేవారికి ఖచ్చితంగా ఒక వాటర్‌ప్రూఫ్ కోటు అవసరం. ఎందుకంటే వర్షకాలంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కదా.మీ సౌలభ్యం ఆధారంగా రెయిన్ కోట్ లేదా రెయిన్ పోన్చోస్ తీసుకుంటే మంచిది. ఇవి చాలా తేలికగా ఉండమే కాకుండా మీ బ్యాగ్‌లలో సులభంగా ప్యాక్ చేసుకోవచ్చు.
3. వాటర్ ఫ్రూఫ్ షూస్ (Waterproof Shoes)
వానకాలంలో చిరుజల్లులు పడే సమయంలో కూడా త్వరగా ఆరిపోయే వాటర్‌ఫ్రూఫ్ బూట్లు లేదా చెప్పులు ధరించడం చాలా అవసరం. ఈ వాటర్ ఫ్రూఫ్ షూస్ ముఖ్యంగా జలపాతాలను ఆస్వాదించే సమయంలో, ఏదైన విహారయాత్ర కోసం దూర ప్రయాణలు చేసే టైంలో బాగా ఉపయోగపడుతాయి.
4. వాటర్ ఫ్రూఫ్ బ్యాగ్స్ (waterproof backpack)
వర్షకాలంలో చేసే ప్రయాణాల్లో ఇబ్బంది కలగకుండా వెంట ఉంచుకోవాల్సిన మరొక వస్తువు వాటర్ ఫ్రూఫ్ బ్యాగ్. ఎన్ని వస్తువులు తీసుకెళ్లినా, సరైన వాటర్ ఫ్రూఫ్ బ్యాగ్ లేకుంటే ఆ ప్రయాణం ఇబ్బందే. సాధారణంగా పాలీఎస్టర్, క్యాన్వాస్‌తో తయారైన బ్యాక్‌ప్యాక్స్‌ను ఎంచుకుంటే బెటర్. ఇవి తేలికగా ఉండి మోత భారాన్ని తగ్గిస్తాయి. అదనంగా ల్యాప్‌టాప్ బ్యాక్ ప్యాక్ లేదా రేయిన్ కవర్ ఆఫర్ చేసే బ్యాగ్స్ తీసుకుంటే మంచిది.
5. వాటర్ ఫ్రూఫ్ మొబైల్ కవర్స్ (waterproof mobile cover)
ట్రావలింగ్ టైంలో మర్చిపోకుండా వెంట ఉంచుకోవాల్సిన మరొక వస్తువు వాటర్ ఫ్రూఫ్ మొబైల్ కవర్. ఇది ఫొన్‌కు ఉంటే వానలో మొబైల్ తడిసిపోతుందనే భయం ఉండదు. ఎంచక్కా టూర్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్ మొబైల్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ టేస్ట్‌కు తగిన మొబైల్ కవర్ ఎంచుకోవచ్చు.
వాటర్ ఫ్రూఫ్ పౌచెస్ (Waterproof Pouch)
ఇక వానకాలంలో ఎక్కువ బయటగడిపే వారు వాటర్ ఫ్రూఫ్ పౌచెస్ వెంట ఉంచుకుంటే బెటర్. ఎందుకంటే.. డబ్బులు. కీలు, ఇయర్ ఫొన్స్, కాస్మోటిక్స్, ఛార్జర్స్ దాచుకునేందుకు వాటర్ ఫ్రూఫ్ డ్రై పర్సెస్ లేదా పౌచెస్ అయితే అవసరం.
చివరగా ఒకమాట.. మనం చేసే పనులపైన వాతావరణం ఆధారపడదు… వాతావరణం ఆధారంగా మనం సిద్ధం కావాలి.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!