• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bigg Boss 7: రచ్చ రేపుతున్న పల్లవి ప్రశాంత్‌ ఇష్యూ. తొడగొట్టిన రైతు బిడ్డ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

    ప్రస్తుతం పల్లవి ప్రశాంత్‌ పేరు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. బిగ్‌బాస్‌ సీజన్‌-7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రశాంత్‌ను రెండో వారం నామినేషన్‌ సందర్బంగా హౌస్‌ సభ్యులు ఓ ఆట ఆడుకున్నారు. నామినేషన్స్ వేసే క్రమంలో.. ఎందుకు చేస్తున్నామో కంటెస్టెంట్స్ చెప్పిన సమాధానాలు దానికి ప్రశాంత్ ఇచ్చిన కౌంటర్స్ ఆసక్తికరంగా సాగాయి. ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్‌ ప్రశాంత్‌ను నామినేట్‌ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.  మెుదట గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, ప్రియాంక, దామిని, షకీలా … Read more

    బిగ్‌బాస్ నుంచి క్రేజీ ప్రోమో

    బిగ్‌బాస్ నుంచి మరో క్రేజీ ప్రోమో వచ్చింది. రమేష్-రాధల పాత్రలతో ప్రోమోను ఓ రేంజ్‌లో తీశారు. బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ల ఆటలు ఇక సాగవని.. బిగ్‌బాస్ ఆడించే ఆటలు మాత్రమే చెల్లుతాయని తెలిసే విధంగా ఈ ప్రోమో వదిలారు. బిగ్‌బాస్ 7 సీజన్ వచ్చే నెల 3న గ్రాండ్‌గా లాంఛ్ కానున్నట్లు సమాచారం. అమర్‌దీప్-తేజస్విని, బుల్లెట్ భాస్కర్, మోహన భోగరాజు, వర్ష, శోభాశెట్టి, బ్యాంకాక్ పిల్ల, సాకేత్, ఈటీవీ ప్రభాకర్, సురేఖావాణి, సుప్రీత, తదితరులు ఈ సీజన్‌లో సందడి చేయనున్నట్లు టాక్.

    BIGBOSS 7: ఓపెనింగ్ ఆ రోజే?

    బిగ్‌బాస్ 7 నుంచి తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమో ప్రకారం సెప్టెంబర్ 3 నుంచి బిగ్‌బాస్ 7 సీజన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. లేదా ఆగష్టు చివరి వారంలో కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రొమోలో నాగార్జున మాటలు వింటుంటే ఈ సారి సీజన్ సరికొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘‘6 సీజన్లు చూశాం. కంటెస్టెంట్స్ అంతా తెలుసనుకుంటున్నారు.. పాపం పసివాళ్లు. మన ప్లాన్స్ వేరే ఉన్నాయ్. ఈసారి బిగ్‌బాస్ 7 ఉల్టా పల్టా.’’ అంటూ నాగ్ ప్రోమోలో పేర్కొన్నాడు.

    బిగ్‌బాస్ 7 ప్రోమో వచ్చేసింది

    బిగ్‌బాస్ సీజన్ 7 ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ సారి మరిన్ని ఎమోషన్స్, సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగులు ఉంటాయని ప్రోమోలో తెలిపారు. కాగా సీజన్ 7కు దగ్గుబాటి రానా హోస్ట్ చేయనున్నారని సమాచారం. ఈ షోలో మంగ్లీ, మోహన భోగరాజు, హేమచంద్ర, దీపిక పిల్లి, రష్మీ గౌతమ్, సాకేత్ కొమండూరి, విష్ణప్రియ, సిద్ధార్థ్ వర్మ, ఈటీవీ ప్రభాకర్, మిత్రా శర్మ, ఐశ్వర్య, శోభాశెట్టి, పండు, జబర్దస్త్ అప్పారావు, ప్రత్యూష, సాయిరోనాక్, ఎస్తేర్, నోయల్, తేజస్విని, అమర్‌దీప్‌లు కంటెస్టెంట్లుగా ఉంటారని టాక్. #BiggBossTelugu7 – A … Read more

    ట్రెండింగ్‌ చౌదరి సిబ్లింగ్స్‌ రీయూనియన్

    [VIDEO](url):సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా బిగ్‌బాస్‌ 16 ఫ్యామిలీ వీక్‌ ఉత్సాహంగా సాగబోతోంది. కంటెస్టంట్‌ ప్రియాంక చాహర్‌ చౌదరి, తన సోదరుడు యోగేశ్‌ చౌదరిని కలవబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇప్పుడు ఇది ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. CHOUDHARY SIBLINGS REUNION ట్విట్టర్‌లో హవా సృష్టిిస్తోంది. ఈ లైన్‌తో ఏకంగా సుమారు 2 లక్షల ట్వీట్లు వచ్చాయి. Priyanka ne milwaaya ghar mein aaye unke bhai ko sabhi contestants se. ?❤ Dekhiye #BiggBoss16 Mon-Fri raat 10 … Read more

    బిగ్‌బాస్‌ బ్యూటీ ఇనయ, సోహైల్‌కు లవ్‌ ప్రపోజల్

    బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా, అదే షో ద్వారా పాపులర్‌ అయిన సౌహైల్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ‘నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా సోహైల్‌. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం’ అని ప్రపోజ్‌ చేసింది. సోహైల్‌ స్పందనేంటో తెలియాలంటే వేచిచూడండి అంటూ ఇనయా పోస్ట్‌ చేసింది. వీరిద్దరి జంట అదిరిందంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

    బిగ్‌బాస్ 6 లోగో వచ్చేసింది

    మోస్ట్ పాపులర్ షో అయిన తెలుగు బిగ్‌బాస్ 6వ సీజన్ వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన లోగోను షో నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. బిగ్‌బాస్ 6 ఈ సారి హాట్‌స్టార్‌లో 24 గంటలు ప్రసారం కానుందని తెలుస్తుంది. అటు స్టార్ మాలో సైతం ప్రతి రోజూ గంటపాటు టెలిక్యాస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.