• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Modi’s Independence Day Speech: 9 ఏళ్లలో మోదీ 6 కీలక ఆవిష్కరణలు ఇవే! మరి ఈసారి?

    భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజు ఆగస్ట్ 15. ఇండిపెండెన్స్ డే రోజున అధికారికంగా ఎర్రకోట వద్ద వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు. ఇప్పటి వరకు సాధించిన పురోగతి, భవిష్యత్ లక్ష్యాల గురించి ప్రజలతో పంచుకుంటారు. అందుకే ఈ స్పీచ్ కోసం ఆతురతగా ఎదురు చూస్తారు. 2024 ఎన్నికల నేపథ్యంలో మోదీ టర్మ్‌లో జరుగుతున్న చివరి స్వాతంత్య్ర వేడుకలు ఇవే. దీంతో కచ్చితంగా కీలక ప్రకటనలు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. మరి, … Read more

    వచ్చే అసెంబ్లీలో నేను ఉండనేమో: రాజాసింగ్

    TS: అసెంబ్లీలో మూడో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగాా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందులో ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఉండరో తెలియదు. నేనైతే ఉండనేమోనని అనిపిస్తోంది అధ్యక్షా. ఎందుకంటే నాకు తెలిసిపోతోంది. బయటివాళ్లు, సొంతవాళ్లు కూడా నేను రావొద్దనే అనుకుంటున్నారు. ఏదేమైనా, నేను, వచ్చినా రాకపోయినా మా ధూళ్‌పేట్ ప్రజలపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ ఆశీస్సులు ఉండాలి. వారికి ఏదైనా ఉపాధి కల్పించండి’ అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత నేను అసెంబ్లీలో నేను … Read more

    ‘సైలెంట్‌గా ఉండకపోతే మీ ఇంటికి ‘ఈడీ’ వస్తుంది’

    లోక్‌సభలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ సైలెంట్‌గా ఉండక పోతే తమ ఇంటికి ఈడీ వస్తుందని హెచ్చరించారు. అనంతరం బిల్లుపై మాట్లాడుతూ కేజ్రీవాల్ పావు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఈడీని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పకనే చెప్పారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. This insinuating threat given by @M_Lekhi in the heat of the … Read more

    మళ్లీ మాట జారిన మంత్రి మల్లారెడ్డి

    తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి మాట జారారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఎన్నికల స్టంట్ అని ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. ‘‘టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ గుర్తించారు. ఎన్నికల స్టంట్ అనుకోండి.. ఏదైనా అనుకోండి. మాది రాజకీయ పార్టీ. ఎలక్షన్లకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల స్టంట్ ఉంటుంది.’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. వెంటనే సవరించుకుని.. ఏదైతేనేం కార్మికులకు మంచి జరిగింది కదా అంటూ సర్దిచెప్పుకున్నారు. Mallareddy: మాది రాజకీయ పార్టీ.. ఎన్నికల స్టంట్ ఎట్లైనా ఉంటది: … Read more

    రాహుల్‌ గాంధీకి పెళ్లి చేద్దామా..?

    కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన హరియాణా మహిళా రైతులు.. సోనియా గాంధీతో మాట్లాడుతూ రాహుల్‌ వివాహం గురించి అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి’ అని అన్నారు. దీంతో ‌అక్కడే ఉన్న రాహుల్‌ నవ్వుతూ ‘అవుతుంది.. అవుతుంది’ అని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణం గురించి మహిళలు సోనియాను అడగ్గా ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. मां, प्रियंका और मेरे … Read more

    రేవంత్ పర్యటన.. ఉప్పల్‌లో ఉద్రిక్తత

    HYD: ఉప్పల్‌లో కాంగ్రెస్ నేతలు మధ్య ఘర్షణ తలెత్తింది. రేవంత్ పర్యటన నేపథ్యంలో రేగా లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను మందముల పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చించేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన వ్యక్తులపై లక్ష్మారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల ఎదుటే తీవ్రంగా దూషిస్తూ కొట్టారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి కిందపడ్డారు. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడంతో ఉప్పల్‌లో ఉద్రిక్తత నెలకొంది. ‘ఎంపీ కనబడుట లేదు’ అనే పోస్టర్లు వెలిసిన అనంతరం రేవంత్ ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. రేవంత్ రెడ్డి పర్యటనలో … Read more

    హెలికాప్టర్ లేకే ప్రాణాలు పోయాయ్: సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో 8 మంది గల్లంతై మృతి చెందారు. దీంతో వీరి మరణానికి కారణం అలసత్వమేనని ఆరోపించారు. సమయానికి హెలికాప్టర్‌ని పంపించి ఉంటే కనీసం ప్రాణాలైనా కాపాడుకునే వారమని ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీతక్క డిమాండ్ చేశారు. కాగా, జంపన్నవాగు ఉప్పొంగడంతో కొండాయి గ్రామం అతలాకుతలం అయింది. My heart broke to see 8 members lost their … Read more

    సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ VS బీఆర్‌ఎస్‌

    TS: పార్టీల మధ్య వివాదం సోషల్ మీడియాకెక్కింది. వరదలతో ధ్వంసమైన రోడ్ల ఫొటోలను షేర్ చేస్తూ ‘అవినీతితో వేసిన రోడ్లపై బంగారు తెలంగాణ ఇదిగో’ అంటూ కాంగ్రెస్‌ విమర్శించింది. దీనికి బీఆర్ఎస్ ధీటుగా స్పందించింది. అవినీతి గురించి ‘ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ’ మాట్లాడటం విడ్డూరమంటూ రిప్లై ఇచ్చింది. కాగా, చిల్లర రాజకీయాలు మానుకొని పార్టీలకతీతంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని నెటిజన్లు సూచిస్తున్నారు. What an irony!The King of Corruption – 'All Indian Corruption Committee' is talking about corruption. … Read more

    మణిపుర్ ఘటన.. బీజేపీ నేత రాజీనామా

    మణిపుర్‌లో హింసకు ప్రధాని మోదీ, సీఎం బీరెన్ సింగ్‌లే కారణమని ఆరోపిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ రాజీనామా చేశారు. ‘ఇకనైనా మోదీ నిద్ర లేవాలి. మహిళలను నగ్నంగా ఊరేగించడంతో అంతర్జాతీయంగా భారత్ పరువు పోయింది. బేటీ బచావో, సనాతన ధర్మం గురించి మాటలు చెప్తారు. మహిళలను ఇలా అవమానించి చంపమని సనాతన ధర్మంలో ఉందా? నేను ఢిల్లీలో 5 రోజులు ఉన్నా. నన్ను ఈ ఘటనలో సమర్థిస్తూ మాట్లాడమని చెప్పారు. దీంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా ’ అని చెప్పారు. నరేంద్ర … Read more

    భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క కంటతడి పెట్టారు. వరదలతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారని ఆవేదన చెందారు. ‘దయచేసి కేటీఆర్‌ గారిని అడుగుతున్నా. ఒక్క హెలికాప్టర్ పంపించండి. రెస్క్యూ టీం శాయాశక్తులా ప్రయత్నిస్తున్నా తరలింపు చర్యలు పూర్తి కావట్లేదు. 9 గంటల నుంచి హెలికాప్టర్ కోసం వేడుకుంటున్నాం. ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి’ అంటూ సీతక్క కోరారు. ఏటూరు నాగారం మండలంలో కొండై గ్రామస్థులు దాదాపు 100 మంది ప్రాణాలతో పోరాడుతున్నారని ఆమె తెలిపారు. Please send helicopters to save our … Read more