• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘శాకిని డాకిని’ థీమ్ సాంగ్ రిలీజ్

    రెజీనా, నివేతా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘శాకిని డాకిని’ మూవీ నుంచి థీమ్ సాంగ్ రిలీజ్ అయింది. సెప్టెంబ‌ర్ 16న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. కొరియా మూవీ మిడ్‌నైట్ ర‌న్న‌ర్ రీమేక్‌గా ఇది తెర‌కెక్కింది. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. పోలీస్ అకాడ‌మీలో ట్రైనింగ్‌లో చేరిన ఇద్ద‌రు అమ్మాయిలు ఒక స‌మ‌స్యను ఎలా ఎదుర్కొన్నార‌నేదే సినిమా క‌థ‌. ఇప్ప‌టికే వ‌చ్చిన ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సుధీర వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

    ‘ధ‌మాకా!’ నుంచి రొమాంటిక్ గ్లింప్స్‌

    ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ధ‌మాకా మూవీ నుంచి నేడు రొమాంటిక్ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. హీరో-హీరోయిన్ ఇద్ద‌రు ఈ వీడియ‌లో క్యూట్ రొమాంటిక్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో అల‌రించారు. త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్‌మీడియా ఫ్యాక్ట‌రీ దీన్ని నిర్మిస్తుంది. త్వ‌ర‌లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    ఇలా మళ్ళీ మీ ముందు రావడం నా అదృష్టం: SDT

    పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఈ ఈవెంట్‌లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాల్గొని మాట్లాడాడు. ఇలా మళ్ళీ స్టేజ్ ఎక్కి, మీ ముందుకు వస్తానని అనుకోలేదని తెలిపాడు. దేవుని దయ, మీ ప్రేమతో మళ్ళీ ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన తమ్ముడు వైష్ణవ్‌ను ఆటపట్టించాడు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

    10M వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘ది ఘోస్ట్’ ట్రైలర్

    అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘ది ఘోస్ట్’. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్లిపోతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ 10 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో పాటు 3 లక్షల పైగా లైక్స్‌తో ట్రెండ్ అవుతుంది. అక్టోబర్ 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు తెలుగు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    వైష్ణ‌వ్ తేజ్-కేతిక శ‌ర్మ రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్

    వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న ‘రంగ‌రంగ వైభ‌వంగా’ సినిమా నుంచి సిరిసిరిమువ్వ‌ల్లోన అనే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను జావెద్ అలీ, శ్రేయా ఘోష‌ల్ క‌లిసి పాడారు. ఈ సినిమాలో కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. గిరీశాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర దీన్ని నిర్మిస్తుంది. సెప్టెంబ‌ర్ 2న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    అల్లు అర్జున్‌కు థ్యాంక్స్ చెప్పిన ‘బ్రేక్ అవుట్’ టీం

    కామెడీ కింగ్ బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ నటించిన ‘బ్రేక్ అవుట్’ మూవీ ట్రైలర్‌ను నేడు విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఓ థ్యాంక్యూ పోస్టర్ విడుదల చేసింది. కాగా ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

    జయం రవి ‘సైరెన్’ మోషన్ పోస్టర్

    పొన్నియన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నటుడు జయం రవి తన తరువాతి సినిమాను ప్రకటించాడు. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో ‘సైరెన్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మేరకు మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

    బింబిసారా నుంచి ‘నీతో ఉంటే చాలు’ సాంగ్ విడుదల

    కళ్యాణ్ రామ్, వశిష్ఠ కాంబినేషన్‌లో వచ్చిన ‘బింబిసారా’ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన అన్ని చోట్ల భారీగా కలెక్షన్స్ రాబట్టడంతో కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ నుంచి ‘నీతో ఉంటే చాలు’ అనే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. కళ్యాణ్ రామ్, పాప మీద సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది.

    ఆకట్టుకుంటున్న ‘బ్రేక్ అవుట్’ ట్రైలర్

    కామెడీ కింగ్ బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ హీరోగా నటించిన ‘బ్రేక్ అవుట్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. సుబ్బు చెరుకూరి తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ఓ ఫోబియాతో బాధపడుతున్న ఓ యువకుడు, ఎవరూ లేని ఒక షెట్టర్‌లో ఉండిపోతే ఎలా అనేది ఆ ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్ BGM, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

    థ్రిల్లింగ్‌గా ‘బ్రేక్ అవుట్’ ట్రైల‌ర్‌

    రాజా గౌత‌మ్ హీరోగా న‌టిస్తున్న ‘బ్రేక్ అవుట్’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీన్ని లాంచ్ చేశారు. ఒంట‌రిగా ఉండేందుకు భ‌య‌ప‌డే మోనోఫోబియా ఉన్న ఒక వ్య‌క్తి ఎవ‌రూ లేని ఒక ప్రాంతంలో ఇరుక్కుపోతే ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంది. అత‌డి ప‌రిస్థితి ఏంటి. బ‌య‌ట‌కు రావ‌డానికి ఎటువంటి ప్ర‌యత్నాలు చేశాడో ట్రైల‌ర్‌లో ఆస‌క్తిక‌రంగా చూపించారు. రాజా గౌత‌మ్ త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు. ఈ థ్రిల్ల‌ర్ మూవీకి సుబ్బు చెరుకూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్వ‌ర‌లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు … Read more