• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన పవర్ గ్లాన్స్

    హరిహర వీరమల్లు నుంచి విడుదలైన పవర్ గ్లాన్స్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియో 5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. మరో 3లక్షల లైక్స్ సాధించింది. 24 గంటలు గడిస్తే మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు. పవర్ గ్లాన్స్‌పై పాజిటివ్ టాక్ రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. హరిహర వీరమల్లు చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.

    ఎమోష‌న‌ల్‌గా ‘ఒకే ఒక జీవితం’ ట్రైల‌ర్‌

    శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ‘ఒకే ఒక జీవితం’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. జీవితంలో మ‌ళ్లీ ఒక‌సారి వెన‌క్కి వెళ్లి త‌న అమ్మ‌ను క‌లుసుకోవాల‌నుకున్న హీరోకి ఎటువంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి అనే విష‌యాల్ని ట్రైల‌ర్‌లో ఎమోష‌న‌ల్‌గా చూపించారు. మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రీతూ వ‌ర్మ హీరోయిన్‌. ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిశోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. సెప్టెంబ‌ర్ 9న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

    ‘జనతా గ్యారేజ్’కి ఆరేళ్లు.. డైలాగ్ గుర్తుందా..!

    ‘జనతా గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును’ డైలాగ్ గుర్తుందా. జూనియర్ ఎన్టీఆర్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన ‘జనతా గ్యారేజ్’లోనిదిది. ఈ సినిమా విడుదలై ఆరేళ్లు పూర్తయింది. సామాజిక అంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. అటు క్లాస్.. ఇటు మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. ఇందులోని ‘పక్కా లోకల్’ ఐటమ్ సాంగ్ కుర్రకారును ఊపేసింది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని ఇంట్రెస్టింగ్ సీన్ కోసం Watch On బటన్ … Read more

    ‘ప్రిన్స్’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్

    శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తున్న ‘ప్రిన్స్’ మూవీ నుంచి బింబిలికి పిలాపి సాంగ్ రిలీజ్ అయింది. రామ్ మిరియాల‌, రమ్య బెహ్రా, సాహితి చాంగ‌టి క‌లిసి ఈ పాట పాడారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. జాతిర‌త్నాలు ఫేమ్ డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీ అ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తెలుగు, త‌మిళ్ ద్విభాషా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఒక ఇండియ‌న్ అబ్బాయి, ఫారిన్ అమ్మాయి మ‌ధ్య జ‌రిగే ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా క‌థ తెర‌కెక్కుతుంది. త్వ‌ర‌లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    సీతా రామం నుంచి ‘ఓ సీత’ వీడియో సాంగ్ రిలీజ్

    ‘సీతా రామం’ మూవీ నుంచి ఓ సీత హేయ్ రామ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఆగ‌స్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్లాసిక్ లవ్‌స్టోరీకి ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌పంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వ‌సూలు చేసి సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పాట‌లు, మ్యూజిక్ ఈ సినిమాను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లాయి. ర‌ష్మిక‌, సుమంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించి మెప్పించారు.

    ‘విజ‌న్ ఆఫ్ బ్ర‌హ్మాస్త్ర’ గురించి చెప్పిన రాజ‌మౌళి

    ‘బ్ర‌హ్మాస్త్ర’ మూవీ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి విజ‌న్ ఆఫ్ బ్ర‌హ్మాస్త్ర గురించి వివ‌రించాడు. 2016లో ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ నాకు ఈ క‌థ గురించి చెప్పాడు. మ‌న పురాణాల ఆధారంగా తెర‌కెక్కిన ఈ క‌థ న‌న్ను ఎంత‌గానో ఆక‌ర్షించింది. పంచ‌భూతాల‌ను శాసించే బ్ర‌హ్మ శ‌క్తి నుంచి పుట్టిన అస్త్రాలు, వాటిని ఉప‌యోగించే సూప‌ర్ హీరోల గురించే చెప్పే స్టోరీ ఇది అని వివ‌రించాడు. బ్ర‌హ్మాస్త్ర సినిమాను నాలుగు ద‌క్షిణాధి భాష‌ల్లో రాజ‌మౌళి రిలీజ్ చేస్తున్నాడు.

    ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ టీజ‌ర్ రిలీజ్

    ఆది సాయికుమార్ హీరోగా న‌టించిన ‘క్రేజీ ఫెలో’ మూవీ టీజ‌ర్ రిలీజ్ అయింది. దిగంగ‌నా సూర్య‌వంశీ, మిర్నా ఇద్ద‌రూ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ క్రేజీ ల‌వ్‌స్టోరీకి ఫ‌ణి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. టీజ‌ర్‌లో ఆది త‌న ఎన‌ర్జిటిక్ న‌ట‌న‌తో అల‌రించాడు. ఇటీవ‌ల చేసిన సీరియస్ పాత్ర‌ల‌కు విభిన్నంగా రొమాంటిక్ కుర్రాడి పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రాన్ని శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 14న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    రికార్డులు సృష్టిస్తున్న ‘జల్సా’ బుకింగ్స్

    స్పెషల్‌ షో సినిమా బుకింగ్స్‌లో జల్సా నయా రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఇటీవల విడుదలైన కొత్త సినిమాలతో ‘జల్సా’ పోటీ పడుతోంది. హైదరాబాద్‌లో ఇవాళ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తే.. సినిమా గ్రాస్‌ బుకింగ్స్(రూ. కోట్లలో) ఆక్యుపెన్సీ% కోబ్రా 0.196 10.84 కార్తికేయ2 0.165 12.55 సీతారామం 0.072 9.82 జల్సా 0.625 96.78 తమ్ముడు 0.024 28.02 లైగర్‌ 0.091 11.74 బింబిసార 0.017 15.09

    ట‌ర్కీ రెస్టారెంట్‌లో ఒక ఫ్యామిలీతో బాల‌య్య స‌ర‌దా ముచ్చ‌ట్లు

    బాల‌కృష్ణ ప్ర‌స్తుతం NBK 107 షూటింగ్‌లో భాగంగా ట‌ర్కీలో ఉన్నారు. తాజాగా ఒక రెస్టారెంట్‌లో బోజ‌నం చేస్తూ ఒక ఫ్యామిలీతో మాట్లాడాడు. సినిమాల్లో న‌టిస్తూ, ఎమ్మెల్యేగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ, బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ చూసుకుంటున్నాను. ఇన్ని ప‌నుల‌తో బిజీగా ఉన్నందుకే సంతోషంగా ఉన్నాను. ఆడ‌వాళ్లు కొంత‌మంది ఇంట్లో ఖాళీగా కూర్చొని బుర్ర పాడు చేసుకుంటారు టీవి చూడ‌క‌పోతే క‌ళ్ల‌కు మంచిది మొత్తం చూడ‌క‌పోతే మెద‌డుకు మంచిది అంటూ స‌ర‌దాగా మాట్లాడాడు. దీంతో అక్క‌డున్న వారందరూ న‌వ్వుకున్నారు. ఎంత పెద్ద హీరో అయిన‌ప్ప‌టికీ వారితో ఎంత … Read more

    ప‌వ‌న్‌కు అడ్వాన్స్ విషెస్ చెప్పిన మెగాస్టార్

    మెగాస్టార్ చిరంజీవి నేడు ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ సినిమా విడుద‌ల రోజున సెప్టెంబ‌ర్ 2న మా త‌మ్ముడు ప‌వ‌న్ బ‌ర్త్‌డే ఉంది. అడ్వాన్స్‌ హ్యాపీ బ‌ర్త్‌డే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని చెప్పాడు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాణ సంస్థ పూర్ణోద‌య పిక్చ‌ర్స్ చాలా గొప్ప సినిమాలు చేస్తూ వ‌స్తుంద‌ని తెలిపాడు. దాంతో పాటు త‌న చిన్న‌ప్ప‌టి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో ఎక్స్‌పీరియ‌న్స్ చెప్పి అంద‌ర్నీ … Read more