• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస‌క్తిక‌రంగా ‘ర‌హ‌స్య’ ట్రైల‌ర్

    నివాస్ సిస్తు, సారా ఆచార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘ర‌హ‌స్య’ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల అయింది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. ఒక టెర్ర‌రిస్టును హ‌త్య చేసిన వ్య‌క్తిన పట్టుకునే ప‌నిలో పోలీసుల‌తో పాటు ఎన్ఐఏ త‌ల‌మున‌క‌ల‌వుతుంది. హీరో, హీరోయిన్ ఇద్ద‌రూ పోలీసాఫీస‌ర్లుగా న‌టించారు. శివశ్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ అందించాడు. ఎస్ఎస్ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్ర‌న్ని నిర్మించింది.

    ఆర్య ‘కెప్టెన్’ మూవీ సాంగ్ రిలీజ్

    ఆర్య హీరోగా న‌టిస్తున్న ‘కెప్టెన్’ మూవీ నుంచి ‘కైలా’ అనే మెలొడి సాంగ్ రిలీజ్ అయింది. డి.ఇమ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను తెలుగులో య‌జీన్ నాజిర్, శ్రినిషా జ‌య‌శీల‌న్ క‌లిసి పాడారు. ఈ సినిమాలో ఆర్య ఆర్మీ జ‌వాన్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్‌. శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థింక్ స్టూడియోస్ దీన్ని నిర్మించింది. సెప్టెంబ‌ర్ 8న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతుంది.

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్ డేట్ ఫిక్స్

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఈమేరకు విడుదల చేసిన స్పెషల్ వీడియోలో హీరో సుధీర్ బాబు ట్రైలర్ లాంచ్ డేట్‌ను ప్రకటించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు. కాగా ఈ సినిమాను మోహన కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్‌గా కృతిశెట్టి నటిస్తోంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం ఈనెల 16న విడుదల కానుంది.

    ‘ఉనికి’ నుంచి నిప్పురవ్వ రగిలింది సాంగ్ విడుదల

    చైత్ర శుక్లా ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉనికి’. ఈ చిత్రం నుంచి తాజాగా ‘నిప్పురవ్వ రగిలింది’ అనే సాంగ్ విడుదలైంది. కాలభైరవ ఆలపించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. పెద్దపల్లి రోహిత్ మ్యూజిక్ కూడా వినసొంపుగా ఉంది. ఎవర్‌గ్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై బాబీ ఎడిడా, రాజేష్ బొబ్బిరి నిర్మించారు.

    అదిరిపోయిన ‘బ్రహ్మాస్త్రం’ రిలీజ్ ప్రోమో

    రణ్‌బీర్ కపూర్, ఆలియా జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్రం’ మూవీ ఈనెల 9వ తేదీన విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. అస్త్రాలతో చేసుకునే యాక్షన్ సీక్వెన్స్ ఇందులో చూపించగా అవి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. కాగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నాడు.

    రూ.75 కే సినిమా టికెట్‌!

    సినిమా టికెట్‌ ధరలు చర్చనీయాంశంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘జహా చార్‌ యార్‌’ చిత్రబృందం క్రేజీ నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ సినిమా డే సందర్భంగా సెప్టెంబర్‌ 16న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలిరోజు తమ సినిమా టికెట్‌ ధరను రూ.75గా చిత్రబృందం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ తొలి రోజు తమ సినిమా కేవలం రూ.75కే చూడొచ్చని తెలిపింది. వినోద్‌ బచ్చన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో స్వర భాస్కర్‌తో పాటు పలువురు నటిస్తున్నారు.

    యూట్యాబ్ లో ‘పవర్ గ్లాన్స్’ సునామీ..!

    ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. పవర్ స్టార్ పుట్టినరోజున విడుదల చేసిన గ్లాన్స్.. యూట్యూబ్ లో సునామీ రేపింది. విడుదల చేసిన 24 గంటల్లోనే కోటి వీక్షణలను దాటేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ పవర్ గ్లాన్స్ వీడియోకు అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా పవర్ స్టార్ ఎంట్రీ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ గ్లాన్స్ వీడియో చూడటానికి Watch On పై క్లిక్ చేయండి.

    ప్చ్.. రణ్ బీర్ నోట ‘ఆది’ డైలాగ్ మిస్సయ్యాం!

    ‘బ్రహ్మాస్తం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడంతో ఓ మంచి సీన్ ని మనం మిస్సయ్యాం! రణ్ బీర్ కపూర్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.స్టేజిపైకి వచ్చాక చివర్లో రణ్ బీర్ ఎన్టీఆర్ తో ‘చిన్నా.. తొడగొట్టు చిన్నా’ అని అడుగుతారు. తారక్ అలా తొడగొట్టగానే ఫైర్ వర్క్స్ పేలేలా ప్లాన్ చేశారు. ఇది జరిగి ఉంటే ఎంతో అద్భుతంగా ఉండేదని రాజమౌళి అన్నారు. ఆడియెన్స్ లోకి వెళ్లి మరీ ఈ సన్నివేశాన్ని చూడాలని ఆరాటపడ్డట్లు జక్కన్న చెప్పారు. సినిమా సక్సెస్ ఈవెంట్ … Read more

    అదరగొడుతున్న విష్ణుప్రియ మాస్‌ సాంగ్‌

    యాంకర్‌, నటి విష్ణు ప్రియ ఫోక్‌ సాంగ్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ మానస్‌తో కలిసి చేసిన ‘జరీ జరీ పంచ కట్టి’ పాట వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. విష్ణుప్రియ, మానస్‌ డ్యాన్స్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. సుద్దాల అశోక్‌ తేజ ఈ పాటను రచించగా… శ్రావణి భార్గవి, సాకేత్‌, స్పూర్తి జితేందర్‌ ఆలపించారు. మదీన్‌ ఎస్‌.కె. మ్యూజిక్ అందించారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. గురువారం విడుదలైన ఈ పాట ఇప్పటిదాకా 25 లక్షలకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది.

    LIVE: ‘బ్రహ్మాస్త్రం’ ప్రెస్ కాన్ఫరెన్స్

    రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన మూవీ ‘బ్రహ్మాస్త్రం’. నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రబృందంలో పార్క్ హయాత్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఆ లైవ్ వీడియోను పైన ఉన్న వీడియోలో చూడొచ్చు.