• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ర‌ష్మిక తొలి హిందీ మూవీ ‘గుడ్‌బాయ్’ ట్రైల‌ర్ రిలీజ్

    ర‌ష్మిక మంద‌న న‌టించిన తొలి బాలీవుడ్ చిత్రం ‘గుడ్‌బాయ్’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ట్రైల‌ర్‌లో ఫ‌న్, ఎమోష‌న్, స‌మాజంపై సెటైర్లు అన్నీ క‌లిసి ఉన్నాయి. ర‌ష్మిక తండ్రిగా అమితాబ్ న‌టించాడు. పుష్ప సినిమాతో త‌న‌కు బాలీవుడ్ ప్రేక్ష‌కుల నుంచి చాలా ప్రేమ ల‌భించింది. ఇది నా మొద‌టి హిందీ సినిమా. దీన్ని కూడా అంతే ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అని ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ర‌ష్మిక చెప్పింది. ఈ మూవీ అక్టోబ‌ర్ 7న విడుద‌ల కానుంది.

    ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. విశ్వ‌క్ ఏమ‌న్నాడంటే

    యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ గురించి మాట్లాడాడు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌ని సినిమా వాళ్ల గురించి కొంత‌మందికి ఉండే ఆ చిన్న‌చూపు అంశాన్ని లేవ‌నెత్తార‌ని చెప్పాడు. ఈ పాయింట్‌ను క‌రెక్ట్‌గా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ చెప్పి ఉంటాడ‌ని అనుకుంటున్నా అన్నాడు. సెప్టెంబ‌ర్ 16న అంద‌రూ త‌ప్ప‌కుండా ఈ సినిమాను థియేట‌ర్ల‌లో చూడాల‌ని కోరాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించారు.

    బాలీవుడ్ బాక్సాఫీస్‌పై చీకట్లను ‘బ్రహ్మాస్త్ర’ చీల్చగలదా?!

    పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల వద్ద జనం క్యూ కట్టేవారు. సినిమా నచ్చితే బ్లాక్ బస్టర్ గా మలిచేవారు. కానీ ఈ ఏడాది బాలీవుడ్ లో హంగామా పూర్తిగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే.. మిగతావన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. దక్షిణాది చిత్రాలు మెరిసిపోతుండటం, ఓటీటీ హవా కూడా పెరగడంతో అక్కడి వెండితెరకు గిరాకీ తగ్గింది. వచ్చిన సినిమా వచ్చినట్టు థియేటర్ల ముందు బోల్తా పడుతుంటే బీటౌన్‌లో తెలియని అలజడి మొదలైంది. బాలీవుడ్ … Read more

    యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న నాగ‌శౌర్య సాంగ్

    నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ‘కృష్ణ వ్రింద విహారి’ నుంచి విడుద‌లైన తార నా తార సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. యూట్యూబ్‌లో ఇప్ప‌టికే 1.5 మిలియ‌న్ వ్యూస్, 160కK లైక్‌తో ట్రెండింగ్‌లో కొన‌సాగుతుంది. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ పాట‌కు సంగీతం అందించ‌డంతో పాటు న‌కాశ్ అజీజ్‌తో క‌లిసి పాడారు. ఈ సినిమాలో నాగ‌శౌర్య‌కు జంట‌గా శెర్లీ సేతియా న‌టిస్తుంది. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.సెప్టెంబ‌ర్ 23న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్

    సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ఈ ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఒక అమ్మాయిని క‌ష్ట‌ప‌డి సినిమాలో న‌టించేందుకు డైరెక్ట‌ర్‌ ఒప్పిస్తాడు. కానీ ఆమె తండ్రికి అది ఇష్టం లేక‌పోవ‌డంతో సినిమా మ‌ధ్య‌లో ఆగిపోతుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అత‌డి సినిమా క‌ల నేర‌వేరిందా లేదా అనే క‌థాంశంతో సినిమా తెర‌కెక్కిన‌ట్లుగా తెలుస్తుంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెప్టెంబ‌ర్ … Read more

    ‘శాకిని డాకిని’ సాంగ్ విడుద‌ల‌

    నివేతా థామ‌స్, రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘శాకిని డాకిని’ మూవీ నుంచి క‌దిలే క‌దిలే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ అయింది. సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్టింది. కొరియ‌న్ మూవీ ‘మిడ్‌నైట్ ర‌న్న‌ర్’ రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ఇప్ప‌టికే విడులైన ట్రైల‌ర్, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి. సెప్టెంబ‌ర్ 16న మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

    త‌మ‌న్నా ‘బ‌బ్లీ బౌన్స‌ర్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

    త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ‘బ‌బ్లీ బౌన్స‌ర్’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. మ‌ధుర్ బండార్క‌ర్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప‌బ్‌లో లేడీ బౌన్స‌ర్‌గా ఉద్యోగం చేసే ఒక అమ్మాయి క‌థ‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ట్రైల‌ర్ ఆద్యంతం కామెడీగా సాగింది. త‌మ‌న్నా మొద‌టిసారిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుండ‌టంతో దీనిపై ఆస‌క్తి పెరిగింది. సెప్టెంబ‌ర్ 23నుంచి మూవీ హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగు, త‌మిళ్, హిందీలో స్ట్రీమింగ్ కానుంది.

    ‘పంచతంత్ర క‌థ‌లు’ నుంచి సూప‌ర్‌హిట్ సాంగ్ రిలీజ్

    ‘పంచ‌తంత్ర క‌థ‌లు’ మూవీలో నేనేమో మోతేవ‌రి సాంగ్ సూప‌ర్‌హిట్ అయింది. ఈ పాట‌ను రామ్ మిరియాలా పాడాడు. ఈ వీడియో సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. పంచ‌తంత్ర క‌థ‌లు సినిమాలో వేర్వేరు క‌థ‌ల‌ను ఒక్క‌చోట చూపించారు. నోయ‌ల్, నందిని రాయ్ తదిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. గంగ‌మోని శేఖ‌ర్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌మ్రాన్ మ్యూజిక్ అందించాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

    ఆశికి 3 వచ్చేస్తోంది.. హీరో ఎవరంటే..?

    బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఆశికి, ఆశికి 2 సినిమాలకు సీక్వెల్ రాబోతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. అనురాగ్ బసు మెగాఫోన్ పట్టుకోనున్నాడు. ముఖేశ్ భట్, భూషణ్ కుమార్ తిరిగి ఏకమై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఆశిక్ 3 కోసం బీటౌన్ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా అప్డేట్ రావడంతో పండుగ చేసుకుంటున్నారు. కార్తీక్ ఆర్యన్ ముఖేశ్ భట్, అనురాగ్ బసు, సంగీత దర్శకుడు ప్రీతమ్ తో కలిసి ఉన్న ఫొటోను ఇన్ … Read more

    అల్ల‌రి న‌రేశ్ ‘ఉగ్రం’ షూటింగ్ స్టార్ట్

    అల్ల‌రి న‌రేశ్, విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రెండో సినిమా ‘ఉగ్రం’. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లుగా చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన వీడియోలో అల్ల‌రి న‌రేశ్ మొహానికి మ‌సి పూసుకొని భ‌యంక‌రంగా ఉగ్ర‌రూపంలో క‌నిపిస్తున్నాడు. మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. మిర్నా మీన‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.