• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జూ.ఎన్టీఆర్ ఎనర్జీ మనుషులకు సాధ్యం కాదు: ఆర్య

    కెప్టెన్‌తో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ నటుడు ఆర్య, తెలుగు హీరోలపై ఆసక్తికర కామెంట్లు చేశాడు. నాని,నితిన్, ఎన్టీఆర్‌ తదితరులపై తన అభిప్రాయం తెలిపాడు. ఎన్టీఆర్‌ గురించి చెబుతూ ‘ఎన్టీఆర్‌కు అంత ఎనర్జీ ఎక్కడినుంచి వస్తుందో తెలియదు. అరగంటకు మించి ఆయనలా ఉండలేం. మనుషులకు ఆయన ఎనర్జీని మ్యాచ్‌ చేయడం సాధ్యం కాదు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. అలాగే నితిన్‌ ఇష్క్‌ సినిమా తాను చేయాల్సిందని చెప్పాడు.

    సీతారామం మూవీ డిలెటెడ్ సీన్ వైరల్

    సీతారామం మూవీ డిలెటెడ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూవీలో పాక్ యువతి అఫ్రిన్‌గా నటించిన రష్మిక ఇండియా గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది. బ్యాగ్‌ను తిరిగిచ్చిన క్యాబ్ డ్రైవర్‌తో పొగరుగా ప్రవర్తిస్తుంది. ఈ సీన్ సినిమాలో ఉంటే కాంట్రవర్సీ అవుతుందని తీసేశారు. అయితే ఇది కూడా ఉంటే రష్మిక పాత్ర హైలైట్ అయ్యేదని భావిస్తున్నారు. దేశం గురించి గొప్ప మాటలే ఉన్నాయి కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    ఒకే ఒక జీవితం చూసి నాగార్జున కంట‌త‌డి

    శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా నేడు చిత్ర‌బృందం స్పెష‌ల్ స్కీనింగ్ చూసింది. వారితో పాటు నాగార్జున‌, అమ‌ల‌, శ‌ర్వానంద్ కుటుంబ‌స‌భ్యులు అంద‌రూ క‌లిసి సినిమాను చూశారు. నాగార్జున మాట్లాడుతూ నాకు మా అమ్మ గుర్తొచ్చిందంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. అంద‌రూ కంట‌త‌డితో బ‌య‌ట‌కు రావ‌డం చూడ‌వ‌చ్చు. అమ్మ మీద ప్రేమ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంద‌ని చెప్తున్నారు.

    ‘సీతా రామం’ మూవీ నుంచి డిలీటెడ్ సీన్ రిలీజ్

    ‘సీతా రామం’ నుంచి తాజాగా ఒక డిలీటెడ్ సీన్‌ను రిలీజ్ చేశారు. అఫ్రీన్‌గా న‌టించిన ర‌ష్మిక సీత గురించి తెలుసుకునేందుకు నూర్జ‌హాన్ ప్యాలెస్‌కు వెళ్తుంది. ఆ స‌మ‌యంలో క్యాబ్‌లో ఆమె బ్యాగ్‌, పాస్‌పోర్ట్‌, వీసా అన్ని మ‌రిచిపోతుంది. బ‌య‌ట‌కు వ‌చ్చి చూసేస‌రికి ఆ క్యాబ్ డ్రైవ‌ర్ అక్క‌డే ఉంటాడు. దీంతో పాకిస్తాన్‌కు చెందిన ఆమె ఇండియాలో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అడుగుతుంది. మా దేశంలో అంద‌రూ ఇలానే ఉంటారు మేడ‌మ్. మీ బ్యాగ్ తీసుకొని వెళ్లి మా దేశం ప‌రువు తీయ‌లేను … Read more

    ‘ఒకే ఒక జీవితం’ సెలబ్రిటీ రివ్యూ

    శర్వానంద్‌ హీరోగా వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఒకే ఒక జీవితం’ ఇవాళ సెలబ్రెటీలకు ప్రీమియర్‌ షో వేశారు. అయితే సినిమా అద్భుతంగా ఉందని నాగార్జున, అమల, రీతూవర్మ తదితరులు చెప్పారు. సినిమా చూస్తుంటే తనకు అమ్మ గుర్తొచ్చిందని అన్నారు. అమల నటల మరో స్థాయిలో ఉందని పలువురు ప్రముఖులు చెప్పారు. టైం ట్రావెల్‌ సినిమా అయినపుడు ఎమోషనల్‌గా ఉందని, కంటతడి పెట్టించిందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ‘కోబ్రా’ మూవీ నుంచి ‘త‌రంగిణి’ వీడియో సాంగ్ రిలీజ్

    విక్ర‌మ్ హీరోగా న‌టించిన ‘కోబ్రా’ మూవీ థియేట‌ర్ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. తాజాగా మూవీ నుంచి ‘త‌రంగిణి’ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, మృణాళిని ర‌వి హీరోయిన్లుగా న‌టించారు. ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించాడు. అజ‌య్ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోబ్రా మూవీకి త‌మిళ‌నాడుతో పాటు తెలుగు రాష్ట్రాలో కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

    ‘స్వాతిముత్యం’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

    బెల్లంకొండ గ‌ణేశ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన చిత్రం ‘స్వాతిముత్యం’. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ తాజాగా రిలీజ్ అయింది. పెళ్లి నేప‌థ్యంలో సాగే ఈ పాట‌కు మ‌హ‌తి సాగ‌ర్ మ్యూజిక్ అందించాడు. ఆదిత్య అయ్యంగార్, లోకేశ్, అరుణ్ క‌లిసి పాట‌ను పాడారు. ల‌క్ష్మ‌ణ్ కె.కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ అక్టోబ‌ర్ 5న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    నెగెటివ్‌ రివ్యూస్‌ ఇస్తే చంపేస్తాడట!

    ఓకే బంగారంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచి ‘సీతారామం’తో తనకంటూ ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్న నటుడు దుల్కర్‌ సల్మాన్‌. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాల్లో తనకంటూ పేరు సంపాదించుకున్నాడు.అయితే ఇప్పుడు దుల్కర్‌ తర్వాతి సినిమా కథ మరింత ఆసక్తిగా ఉంది. దుల్కర్‌ నుంచి బాలివుడ్‌ మూవీ ‘చుప్, ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఆర్ బాల్కి ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలకు నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చేవారిని చంపే సైకో థ్రిల్లర్ కథ అని తెలుస్తోంది. సన్నీడియోల్ కీలక … Read more

    పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1పై సీనియ‌ర్ సిటిజ‌న్ల ఆస‌క్తి

    మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘పొన్నియ‌న్ సెల్వ‌న్-1’ సినిమా సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను చూసేందుకు సాధార‌ణ ప్రేక్ష‌కులు ఆస్తిక‌రంగా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఇన్నిరోజులు ఇంటికే ప‌రిమిత‌మైన సీనియ‌ర్ సిటిజ‌న్లు కూడా ఈ మూవీని థియేట‌ర్ల‌లో చూడాల‌నుకుంటున్నార‌ట‌. త‌మిళ‌నాడులో ముఖ్యంగా ఈ ర‌క‌మైన టాక్ వినిప‌స్తుంది. మ‌ణిర‌త్నం సినిమాల‌కు ఉండే క్రేజ్ అలాంటిది మ‌రి. దాంతోపాటు ఆయ‌న‌ మొద‌టిసారిగా ఇలా యుద్ధానికి సంబంధించిన చారిత్రాత్మ‌క క‌థ‌ను తెర‌కెక్కించ‌డం, ప్ర‌ముఖ తార‌లు అంద‌రూ న‌టించ‌డం కూడా ముఖ్య కార‌ణంగా క‌నిపిస్తుంది.

    విజువల్ వండర్ లా పీఎస్-1 ట్రైలర్

    మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’. ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరో విజువల్ వండర్ లా కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ ట్రైలర్ లో రానా వాయిస్ ఓవర్ గొప్పగా సాగింది. చోళుల కాలంలో జరిగిన సంఘటనలు కళ్లకు కట్టేలా ట్రైలర్ లో ఉన్నాయి. విక్రమ్, కార్తి, ప్రకాశ్ రాజ్, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష.. ఇలా ప్రతి పాత్ర ప్రధానమైందే. ఆస్కార్ విన్నర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో అడ్వాంటేజ్ గా నిలవనుంది. కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల … Read more