• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రేక్షకుల చప్పుట్లతో చాలా హ్యాప్పీ: శర్వానంద్

    థియేటర్లలో మూవీ చూసి ప్రేక్షకులు చప్పుట్లు కొడుతుండటం చాలా సంతోషంగా ఉందని హీరో శర్వానంద్ పేర్కొన్నారు. అంతకంటే ప్రేమ ఏం కావాలి చెప్పుకొచ్చాడు. ఒకే ఒక జీవితం మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా ఈ మేరకు వెల్లడించారు. జనాల్లోకి ఈ సినిమాను తీసుకెళ్లిన మీడియాకు స్పెషల్‌గా కృతజ్ఞతలు తెలిపారు. ఇది సక్సెస్ మీట్ కాదని, థాంక్యూ మీట్ అని శర్వానంద్ అన్నారు. గత రెండు మూడు సినిమాల నుంచి తనకు హిట్టు లేదని పేర్కొన్నారు. డైరెక్టర్ శ్రీ కార్తీక్ మొదటి సినిమాలో తాను ఉన్నందుకు … Read more

    అదిరిపోయిన ‘సూర్య 42’ మోషన్ పోస్టర్

    తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో ‘సూర్య 42’ అనే మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 3Dలో 10 భాషల్లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

    SUPER: ట్రైలర్ అదిరిపోయింది

    నాగ శౌర్య హీరోగా షిర్లీ సెటియా హీరోయిన్‌గా అనీష్ తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణ విృంద విహారి’. ఈనెల 23వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ నేడు విడుదలైంది. వినోదభరితంగా సాగిన ఈ ట్రైలర్‌లో రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నల కిషోర్ కామెడీ ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా.. ఉషా మల్పూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

    విక్రమ్ గర్జనకు 100 రోజులు

    థియేటర్లో, ఓటీటీలో రికార్డులు కొల్లగొట్టిన సినిమా ‘విక్రమ్’. ఈ మూవీ విడుదలై 100రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా కమల్ హాసన్ ఓ ట్వీట్ చేశారు. చిత్రాన్ని విజయం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ని తమ్ముడిగా అభివర్ణిస్తూ ధన్యావాదాలు చెప్పారు. వాయిస్ నోట్ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలపడం విశేషం. మ్యూజికల్ గా మెస్మరైజ్ చేసిన ఈ సినిమా.. థియేటర్ల వద్ద రూ.450కోట్లు కొల్లగొట్టింది. ఇందులో మీకు నచ్చిన డైలాగ్/సీన్ ఏంటో చెప్పండి. #100DaysofVikram #VikramRoaringSuccess pic.twitter.com/7SjZIpTB6M — Kamal … Read more

    బ్రహ్మాస్త్ర మూవీ డే1 బాక్సాఫీస్ కలెక్షన్స్

    బ్రహ్మాస్త్ర మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు పేర్కొన్నారు. ఒక హిందీ సినిమాకి నాన్ హాలిడే రోజు ఇవే బిగ్గేస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లని తెలిపారు. హిందీలో రూ.32 కోట్ల వసూళ్లు రాబట్టగా, తెలుగు రాష్ట్రాల నుంచి రూ.5 కోట్ల నుంచి 6 కోట్లు వచ్చాయి. మిగతా వసూళ్లు ఓవర్సీస్‌లో వచ్చినట్లు ప్రకటించారు. ఈ సినిమాపై ప్రతికూల రివ్యూలు వచ్చినప్పటికీ వసూళ్లు భారీగానే వచ్చాయి. ఈ చిత్రంలో రణబీర్-ఆలియాతో పాటు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున, షారుక్ ఖాన్ … Read more

    సమంత యశోద మూవీ టీజర్ రిలీజ్

    సమంత యాక్ట్ చేసిన యశోద మూవీ టీజర్ విడుదలైంది. వీడియోలో మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పే డైలాగ్స్, అందుకు సమంత వింటున్న తీరు మూవీపై ఆసక్తిని పెంచుతుంది. మరోవైపు తర్వాత సీన్లలో ఫైట్స్ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతున్నాయి. ఈ చిత్రానికి హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా, శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

    హింసాత్మకంగా ‘అహింస’ గ్లింప్స్

    ఎంతోమంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ. ‘అహింస’ చిత్రంతో దగ్గుపాటి అభిరాంను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. హింసను ప్రేరేపించేలా ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ‘నువ్వు నేను’ తరువాత తేజ, పట్నాయక్, ఆనంది క్రియేషన్స్ కాంబోలో వస్తున్న చిత్రమిది. సదా ముఖ్య పాత్రలో నటిస్తోంది.

    ఛార్మీ ట్వీట్ వైరల్..అవన్నీ పుకార్లే

    టాలీవుడ్ నటి, నిర్మాత ఛార్మి మళ్లీ వార్తల్లో నిలిచారు. గతంలో కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పిన ఛార్మి..నిన్న మళ్లీ ఓ పోస్ట్ పెట్టారు. రూమర్స్, రూమర్స్..పుకార్లన్నీ ఫేక్ అని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ పురోగతిపైనే దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది. ఇది చూసిన నెటిజన్లు ఛార్మిని పలురకాలుగా కామెంట్లు రూపంలో ప్రశ్నిస్తున్నారు. జనగణమణ ఉందా లేదా చెప్పండి అంటున్నారు. సోషల్ మీడియాకు బ్రేక్ అని చెప్పి ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. మరికొంత మంది అసలు ఏమైందని, ఈ … Read more

    ‘విక్ర‌మ్ వేద’ ట్రైల‌ర్ రిలీజ్

    బాలీవుడ్ హీరోలు సైఫ్ అలీఖాన్, హృతిక్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విక్ర‌మ్ వేద థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఈరోజు రిలీజ్ అయింది. ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్, ఒక గ్యాంగ్‌స్ట‌ర్ మ‌ధ్య జ‌రిగే వార్ కథాంశంతో ఇది తెర‌కెక్కింది. సెప్టెంబ‌ర్ 30న సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఇది త‌మిళ్ సూప‌ర్ హిట్ మూవీ విక్ర‌మ్ వేద రీమేక్‌గా తెర‌కెక్కింది. ఒరిజిన‌ల్‌లో మాధ‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి హీరోలుగా న‌టించారు. దాన్ని తెర‌కెక్కించిన పుష్క‌ర్ & గాయ‌త్రి హిందీలో కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

    ఆదిపురుష్ నుంచి బిగ్ అప్డేట్..!

    ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే వార్త. వచ్చేనెలలో డార్లింగ్ పుట్టినరోజు. దీంతో ఆదిపురుష్ నుంచి ఓ పెద్ద అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఓం రౌత్ స్పష్టం చేశారు. తాజాగా ఈ వీడియో ట్రెండవుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పీరియాడికల్ సినిమాగా రూపొందుతోంది. అయితే, ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను యువీ క్రియేషన్స్ సొంతం చేసుకున్నట్లు టాక్. వచ్చే ఏడాది జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. Something BIG.. … Read more