ది లైఫ్ ఆఫ్ ముత్తు ట్రైలర్ రిలీజ్
తమిళ్ హీరో శింబు యాక్ట్ చేసిన ది లైఫ్ ఆఫ్ ముత్తు మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇది కథ కాదు, జీవితం అంటూ కొనసాగుతున్న ట్రైలర్ వీడియో ఆకట్టుకుంటుంది. నిజం చెప్పడం చాలా కష్టమని, నిప్పుతో చెలగాటమనే డైలాగ్స్ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచాయని చెప్పవచ్చు. శింబు, సిద్ధి ఇద్నాని జంటగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 17న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.