• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బ్రహ్మాస్త్ర’ స్పెషల్ వీడియో రిలీజ్

    పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ నుంచి ఓ స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విటర్‌లో విడుదల చేశారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. సినిమా విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ వీడియో వదిలారు. ఈ చిత్రం మొదటి వారం రూ.300 కోట్లు వసూలు చేసినట్లు కరణ్ తెలిపారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో రెండో వారంలోకి అడుగు పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీడియో కోసం వాచ్ ఆన్ బటన్‌పై క్లిక్ చేయండి. https://twitter.com/karanjohar/status/1570634809009143808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1570634809009143808%7Ctwgr%5Ea7a2d6ea5a681b6db9ae3aa602f463a3db4f710e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-6454159011845084414.ampproject.net%2F2208242209000%2Fframe.html

    ‘ది ఘోస్ట్’ నుంచి వేగం లిరికల్ వీడియో రిలీజ్

    ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ నుంచి వేగం లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. వీడియోలో హీరో నాగార్జున, హీరోయిన్ సోనాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయి. మరోవైపు దుబాయ్ లోకేషన్లలో షూట్ చేసిన సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ పాటకు కృష్ణ మాదినేని లిరిక్స్ అందించగా, భరత్- సౌరభ్, కపిల్ కపిలన్, రమ్య బెహరాలు సంయుక్తంగా ఆలపించారు.

    ఆస్కార్‌ బరిలో ‘దోస్తీ’ పాట

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమా పేరును మార్మోగేలా చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అద్భుత నటకు జూ.ఎన్టీఆర్‌ ఆస్కార్‌ బరిలో ఉంటాడని సినీ విశ్లేషకులు ఇప్పటికే చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాలోని దోస్తీ పాట కూడా అకాడమీ అవార్డుల బరిలో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. దోస్తీ పాటను తెలుగులో హేమచంద్ర ఆలపించగా, హిందీలో అమిత్‌ త్రివేది పాడారు. గంభీరంగా సాగే ఈ పాట విడుదలైన అన్ని భాషల్లోనూ శ్రోతలను అలరించింది.

    ఉత్కంఠగా ‘నేనే వస్తున్నా’ టీజర్

    తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘నేనే వస్తున్నా’ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ నటన అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ధనుష్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. మూవీలో ధనుష్ అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక టీజర్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహిాంచారు. కలైపులిఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

    రేపు ‘ది ఘోస్ట్’ నుంచి ‘వేగం’ అనే సాంగ్ విడుదల

    అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ మూవీ అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా ‘వేగం’ అనే సాంగ్‌కు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. నాగార్జున, సోనాల్ మధ్య ఈ సాంగ్ సాగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను రేపు(Sep 16న) సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.

    ఆకట్టుకుంటున్న ‘దొంగలున్నారు జాగ్రత్త’ ట్రైలర్

    కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా సతీష్ త్రిపుర తెరకెక్కిస్తున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు, సునీతా తాటి నిర్మిస్తున్నారు. ఈనెల 23వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించాడు.

    ఆకట్టుకుంటున్న ‘స్వాతిముత్యం’ టీజర్

    బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో ‘స్వాతిముత్యం’ అనే సినిమా తెరకెక్కుతుంది. అయితే హీరో గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆధ్యాంతం వినోదభరితంగా సాగిన ఆ టీజర్ ఆకట్టుకుంటుంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తామని చిత్రబృందం ఈ సందర్భంగా వెల్లడించింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    తగ్గేదెలే.. వర్షంలోనూ హీరో పాదయాత్ర

    సినిమా ప్రమోషన్ల కోసం తగ్గేదెలే అంటున్నాడు నాగశౌర్య. ఆయన నటించిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారీ’ ప్రమోషన్లలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. తిరుపతిలో నాగశౌర్య అండ్ టీం ఈ యాత్రను మొదలుపెట్టింది. అయితే, వర్షంలోనూ ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హీరోతో సెల్ఫీల కోసం అభిమానులు పోటీపడ్డారు. నేడు నెల్లూరు, ఒంగోలులో ఈ పాదయాత్ర జరగనుంది. కాగా, పాదయాత్ర ద్వారా సినిమా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారి. Hero @IamNagashaurya begins the 'Paadha Yatra' amidst the rain in Tirupathi & … Read more

    Live: నేను మీకు బాగా కావాల్సినవాడిని ప్రీ రిలీజ్ ఈవెంట్

    హీరో కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ మూవీలో హీరోయిన్లుగా సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శ్రీధర్ గాధే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    అదరగొడుతున్న ‘ఇంతందం’ ఫుల్ వీడియో సాంగ్

    ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న సీతారామం మూవీ నుంచి ‘ఇంతందం’ ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట ప్రేక్షకుల మదిలను దోచుకుంటోంది. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా చూశారు. తెలుగు, తమిళం పాటు మలయాళంలో కూడా ఈ సాంగ్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. మీరు కూడా ఈ పాటను చూసేయండి.