• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అల్లూరి’ మేకింగ్ స్టిల్స్ అదుర్స్

    శ్రీవిష్ణు హీరోగా, కయదు లోహర్ హీరోయిన్‌గా తెరకెక్కిన అల్లూరి చిత్రం నుంచి మేకింగ్ స్టిల్స్ విడుదల చేశారు మూవీ మేకర్స్. సినిమాలో ‘నీ చూపులకు’ అనే వెడ్డింగ్ సాంగ్‌కు సంబంధించిన స్టిల్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రాన్నిసెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    గాడ్ ఫాదర్ నుంచి పవర్ ఫుల్ డైలాగ్ రిలీజ్

    గాడ్ ఫాదర్ మూవీ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఓ డైలగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు” అనే పవర్ ఫుల్ డైలాగ్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. డైలాగ్‌ను కోసం [క్లిక్ ](url)చేయండి pic.twitter.com/6UQ1QwNsWi — … Read more

    ప్రేమదేశం ‘తెలవారేనే’ లిరికల్ వీడియో రిలీజ్

    ప్రేమదేశం సినిమా నుంచి తెలవారేనే స్వామి లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. వీడియోలో హీరోహీరోయిన్ల మధ్య కొనసాగిన రొమాంటింక్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఈ పాటకు రాజు లిరిక్స్ అందించగా, అంజనా సౌమ్య, అనురాగ్ కులకర్ణి అలపించారు. మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించగా, శిరీషా సిద్ధమ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, త్రిగుణ్, అజయ్ కతుర్వార్, మాయ, మధుబాల, వైష్ణవి చైతన్య, తనికెళ్ల బరణి, వైవా హర్ష, కమల్ తేజ నార్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    వినోద భరితంగా ‘లైక్ షేర్ & సబ్స్‌క్రైబ్’ టీజర్

    సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా ‘లైక్ షేర్ & సబ్స్‌క్రైబ్’ అనే సినిమాలో నటించారు. అయితే నేడు విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది. వినోదభరితంగా సాగిన ఆ టీజర్‌లో హీరో కామెడీ బాగుంది. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ మూవీని వెంకట్ బోయినపల్లి నిర్మించారు. నవంబర్‌లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలుస్తుండగా.. ఈ సినిమాకు రామ్ మిర్యాల, ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

    PS-1 నుంచి మావయ బీటీఎస్ వీడియో

    PS-1 మూవీ నుంచి రాచస మావయ సాంగ్ బీటీఎస్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హీరో కార్తీ పలు రకాల కాస్ట్యూమ్స్ ధరించి డాన్స్ చేయడం చూడవచ్చు. దీంతోపాటు హీరోయిన్ త్రిష, శోభిత ధూళిపాళ వివిధ వేషధారణల్లో ఆకట్టుకుంటున్నారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా..శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్, మహేష్ వినాయక్ ఆలపించారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ (PS1) పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఈ మూవీ చోళ రాజవంశం నేపథ్యంలో … Read more

    అదిరిపోయిన ‘గోలీసోడా’ లిరికల్ వీడియో

    మంచు విష్ణు హీరోగా, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా సూర్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘జిన్నా’. తాజాగా ఈ మూవీ నుంచి ‘గోలీసోడా’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. విష్ణు, పాయల్ మీద కొనసాగిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్‌కు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించగా.. బాలాజీ లిరిక్స్ అందించారు. ప్రభుదేవా మాస్టర్ ఈ పాటకు కోరియోగ్రఫీ చేశారు.

    అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌

    శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ తెరకెక్కించిన అల్లూరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది.ఈ వేడుకు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సినిమాకు హర్షవర్ధన్ సంగీత అందించాడు. సెప్టెంబర్ 23 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    అల్లూరి కోసం ‘పుష్ప’

    యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. ఈనెల 23వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

    రికార్డు సృష్టిస్తున్న ‘కబ్జా’ టీజర్

    ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కబ్జా’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ నిన్న విడుదలైంది. ఆ టీజర్ ఆకట్టుకోగా తాజాగా అది రికార్డు సృష్టించింది. ఏకంగా 10మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి.. కన్నడ సినిమా స్థాయిని మరోసారి నిలబెట్టించి. కాగా ఈ మూవీ టీజర్ KGFమూవీకి పోలి ఉందని నెటిజన్స్ భావిస్తున్నారు.

    ఉపేంద్ర కబ్జా మూవీ టీజర్‌ రిలీజ్

    రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన కబ్జా మూవీ టీజర్‌ విడుదలైంది. టీజర్ వీడియోలో తుపాకులు, గ్యాంగ్‌స్టార్ల నేపథ్యంలో స్టోరీ కొనసాగుతున్నట్లుగా సినిమాపై మరింత ఆసక్తిని రేపుతుంది. ఆర్.చంద్రు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్ సహా తదితరులు నటిస్తున్నారు. మరోవైపు ముగ్గురు కన్నడ స్టార్స్, ఉపేంద్ర, సుదీప్, శివరాజ్‌కుమార్‌ల ఈ సినిమాలో నటించడం విశేషం. భారీ అంచనాలతో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.