• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చియాన్‌ విక్రమ్ అదిరిపోయే స్పీచ్‌

    పీఎస్‌1 ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో భారతీయ సంస్కృతి, చారిత్రక గొప్పదనాన్ని చెబుతూ విక్రమ్‌ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం నెట్టింట వావ్‌ అనిపిస్తోంది. ఆయన మాట్లాడినంత సేపు అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో విక్రమ్‌తో పాటు జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్‌, త్రిష వంటి భారీ తారాగణం ఉంది.

    ‘రానా నాయుడు’ టీజర్ రిలీజ్

    హీరోలు విక్టరీ వెంకటేష్, రానా నటించిన RanaNaidu వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరెకెక్కించిన ఈ సిరీస్ టీజర్ అదిరింది. ఫైట్స్‌తోపాటు పలురకాల డైలాగ్స్, రానా నెగెటివ్ షేడ్ సీన్స్ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతున్నాయి. ఈ వీడియో చివరిలో హీరో వెంకటేష్‌పై రానా తుపాకీ ఎక్కుపెట్టే సీన్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ వెబ్ సిరీస్‌కు కరన్ హన్షమాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో నెట్‌ప్లిక్స్ సంస్థ ఈ సిరీస్ నిర్మిస్తోంది.

    ‘ప్రిన్స్’ నుంచి మరో సాంగ్ రిలీజ్

    తమిళ నటుడు శివ కార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘జెస్సికా’ పాటను ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో వదిలారు. ఇంతకుముందు ‘బింబిలక్కి పిలపి’ సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ సినిమాలో కార్తికేయన్‌కు జోడీగా ఉక్రెయిన్ నటి మరియా నటించింది. జాతిరత్నాలు ఫేం అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వచ్చే దీపావళికి ఈ చిత్రాన్నిథియేటర్లలో విడుదల చేస్తున్నారు.

    LIVE: హైదరాబాద్‌లో పీఎస్‌1 ప్రీ రిలీజ్‌

    మణిరత్నం నుంచి వస్తున్న భారీ చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. ఐశ్వర్య రాయ్‌, త్రిష, విక్రమ్‌, కార్తీ వంటి భారీ తారాగణం నటించారు. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తోంది.

    ’సీతారామం‘ నుంచి డిలీటెడ్ సీన్

    క్లాసికల్ హిట్ మూవీ ‘సీతారామం’ నుంచి డిలీటెడ్ సీన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. పాకిస్తాన్ జైలులో రామ్-విష్ణుశర్మ మధ్య జరిగే సన్నివేశాన్నిరిలీజ్ చేశారు. ఇద్దరి మధ్య జరిగే ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సీన్ సినిమాలో ఉంచి ఉంటే ఇంకా బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా సీతారామం మూవీ ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

    ‘గోలీసోడా’ మేకింగ్ వీడియో

    మంచు విష్ణు హీరోగా, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్‌లుగా సూర్య తెరకెక్కించిన చిత్రం ‘జిన్నా’. అయితే ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన ‘గోలీసోడా’ అనే సాంగ్ మేకింగ్ వీడియోను నేడు రిలీజ్ చేసింది చిత్రబృందం. విష్ణు, పాయల్ మధ్య సాగిన పాటకు ప్రభుదేవా మాస్టర్ కోరియోగ్రఫీ చేయగా.. అనూప్ రుబెన్స్ సంగీతం అందించాడు. నకాష్ అజీజ్, నూతన మోహన్ ఆలపించిన ఈ పాట.. నెటిజన్స్‌ను అలరిస్తుంది.

    ‘ఏముందిరా’ మేకింగ్‌ వీడియో

    శుక్రవారం థియేటర్లలో అలరించబోతున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. నాగశౌర్య, షెర్లీ జంటగా అనీశ్‌ ఆర్‌. దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే అనేక పాటలు, మేకింగ్‌ వీడియోలు విడుదల కాగా తాజాగా మరో వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. సినిమాలోని ‘ ఏముందిరా’ పాట మేకింగ్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది.

    ‘లచ్చి గాని పెళ్లి’ సాంగ్ లాంచ్ చేసిన రవితేజ

    సంజయ్, ప్రణవి మానుకొండ హీరో హీరోయిన్లుగా AR శ్రీధర్ తెరకెక్కించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. తాజాగా ఈ మూవీ నుంచి ‘లచ్చి గాని పెళ్లి’ అంటూ సాగే మొదటి పాటను మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించి పాటను పాడగా.. కాసర్ల శ్యామ్ బాణీలు అందించారు. జిత్తు మాస్టర్ కోరియోగ్రఫీ చేశాడు.

    ‘కీడా కోలా’ నుంచి క్రేజీ ఇంటర్వ్యూ

    ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో యువతలో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. అతడి నుంచి వస్తున్న తర్వాతి చిత్రం ‘కీడా కోలా’. సురేశ్‌ బాబు నిర్మాణంలో క్రైమ్‌ కామెడీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను గత నెలలోనే ప్రారంభించారు. సినిమా అనౌన్స్‌మెంట్‌ సమయంలో విడుదల చేసిన పోస్టర్‌తోనే ఎంతో ఆసక్తిని రేకెత్తించిన తరుణ్‌ భాస్కర్‌…ఈ సారి ఓ ఇంటర్వ్యూ తీసుకొచ్చాడు. కీడా కోలా గర్ల్‌ గ్యాంగ్‌తో వచ్చిన ఈ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన క్రేజీ విషయాలను … Read more

    ‘కృష్ణ వ్రింద విహారి’ యాక్షన్‌ మేకింగ్‌ వీడియో

    నాగశౌర్య, షెర్లీ జంటగా అనీశ్‌ ఆర్‌. దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ కృష్ణ వ్రింద విహారి’. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటిదాకా ఈ సినిమా సాఫ్ట్‌ యాంగిల్‌ను చూపించిన చిత్రబృందం తాజాగా యాక్షన్‌ మేకింగ్‌ వీడియోతో సర్‌ప్రైజ్‌ చేసింది. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు.