• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 6M వ్యూస్‌ క్రాస్ చేసిన గాడ్ ఫాదర్ ట్రైలర్

    గాడ్ ఫాదర్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు 6మిలియన్ వ్యూస్‌ సాధించిన ట్రైలర్.. యూట్యూబ్‌లో నం.1గా ట్రెండ్ అవుతోంది. మరో 278 వేల లైక్స్ రాబట్టింది. మెగాస్టార్ దెబ్బకు ఇదివరకు ఉన్న ట్రైలర్ల రికార్డులు కనుమరుగవుతున్నాయి. ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మెగాస్టార్ మాస్ మూమెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న విడుదల కానుంది.

    LIVE: ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

    అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గాడ్‌ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అనంతపురంలో ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వేదికపై చిరంజీవి మాటలు వినేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    ‘గాడ్ ఫాదర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది. అక్టోబర్‌ 5న సినిమా విడుదల కానుండగా చిత్రబృందం ట్రైలర్‌ విడుదల చేసింది. పూరీ వాయిస్‌ ఓవర్‌తో సాగిన ఈ ట్రైలర్‌ ఆసక్తిగానే అనిపించింది. చివర్లో సల్మాన్‌ ఖాన్‌ డైలాగ్‌ అభిమానులకు ఊపునిచ్చేలా ఉంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ గుడ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై విడుదల అవుతోంది. మళయాలంలో సూపర్ హిట్‌ అయిన లూసిఫర్‌క్‌ రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    ట్రెండింగ్‌లో ‘స్వాతిముత్యం’ ట్రైలర్

    నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు గణేష్ హీరోగా తెరకెక్కిన ‘స్వాతిముత్యం’ సినిమా ట్రైలర్ ట్రెండింగ్‌లో నిలిచింది. ట్రైలర్ రిలీజైన రెండు రోజులకే యూట్యూబ్‌లో 2 మిలియన్ల వ్యూస్‌కు చేరువలో నిలిచింది. క్యూట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్‌కు జోడీగా వర్ష బొల్లమ్మ నటించింది. ఈ సినిమాకు లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

    బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ ఆంథమ్‌ చూశారా?

    ‘ఆహా’ ఓటీటీలో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టాక్‌ షోగా నిలిచిన బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ రెండో సీజన్‌ ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ…. ,షో ఆంథమ్‌ను విడుదల చేశారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చి, ర్యాపర్‌ రోల్‌ రిడా పాడిన ఈ పాట బాలయ్య మాస్‌ డైలాగ్స్‌తో స్టార్ట్‌ అయి ఊపునిచ్చేలా సాగింది. ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ నీ ఫుడ్‌లో ఉందేమో నా బ్లడ్‌లోనే ఉందిరా బ్లడీ ఫూల్‌’ అంటూ బాలయ్య డైలాగ్స్‌ బాగా పేలాయి.

    ‘నజభజ’ సాంగ్ అదుర్స్

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ నుంచి మరో పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ’నటభజ జజరా’ అనే సాంగ్‌‌లో చిరు నట విశ్వరూపం ప్రదర్శించారు. ఈ మాస్ సాంగ్‌ చూసి చిరు అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా గాడ్ ఫాదర్ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, నయనతార, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు.

    ఈ వారం(sep 29, 30) థియేటర్‌/OTTలో వస్తున్న తెలుగు సినిమాలు

    తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం దసరా సందడి మొదలుకానుండగా ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలేవీ తలపడటం లేదు. దసరాకు గాడ్‌ఫాదర్‌, ది ఘోస్ట్ వంటి స్టార్ల సినిమాలు వస్తుండగా, ఈ వారం డబ్బింగ్‌ సినిమాల హవానే ఉంది. పొన్నియన్‌ సెల్వన్‌ లాంటి భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ గురు, శుక్ర వారాల్లో తెలుగులో వస్తున్న సినిమాలేంటో ఓసారి చూద్దాం. నేనే వస్తున్నా ధనుష్‌ డ్యూయల్‌ రోల్‌లో వస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం నేనే వస్తున్నా. ధనుష్‌, ఇలి అవ్రామ్‌, ఇందుజా, … Read more

    పొన్నియన్ సెల్వన్ ఎవరు? చోళ సామ్రాజ్యంలో ఈయన పాత్ర ఏంటి?

    పొన్నియన్ సెల్వన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. మణిరత్నం తన సినిమాతో ఈ నవలకు మరింత హైప్ క్రియేట్ చేశాడు. అసలు ఎవరీ పొన్నియన్ సెల్వన్..? అతడి గొప్పదనం ఏంటి? వంటి అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం.  రాజరాజ చోళుడే పొన్నియన్ సెల్వన్..( Who is Ponniyan selvan) చోళ సామ్రాజ్యాధినేత రాజరాజచోళుడినే పొన్నియన్ సెల్వన్‌గా పిలుస్తుంటారని చరిత్ర చెబుతోంది. సుందర చోళుడి కుమారుడు. చిన్నగా ఉన్న రాజ్యాన్ని అఖండ సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన చక్రవర్తిగా పొన్నియన్ సెల్వన్ ప్రసిద్ధికెక్కాడు. సోదరి కుందవి సాయంతో … Read more

    మహేష్‌తో మూవీకి నేను సిద్ధం: నాగార్జున

    మహేష్ బాబుతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేసేందుకు తాను సిద్ధమని హీరో నాగార్జున వెల్లడించారు. మహేష్ ఎప్పుడు రెడీ అంటే తాను అప్పుడు రెడీ అని స్పష్టం చేశారు. మరోవైపు తనకు ఎంతో అప్తుడైన చిరంజీవీ గాడ్ ఫాదర్ మూవీ కూడా అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్నట్లు గుర్తు చేశారు. ఘోస్ట్‌తోపాటు చిరు మూవీ కూడా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. కర్నూల్లో నిర్వహించిన ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా నాగార్జున పేర్కొన్నారు. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడినట్లు నాగ్ … Read more

    మేఘాల్లో చిరు ‘గాడ్ ఫాదర్’ ఇంటర్వ్యూ

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచేసింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవితో ప్రముఖ యాంకర్ విమానంలో ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి మూవీకి సంబంధించిన పంచుకున్నాడు.