• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నవ్వుతూనే సల్మాన్‌ ఖాన్‌ మనసులో మాట!

    ఇటీవల హిందీలో సౌత్‌ సినిమాలో హవా పెరిగింది. దీంతో బాలివుడ్‌ కూడా మార్కెట్‌ కోసం మనవైపు చూస్తోంది. కానీ ఈ మధ్య ఒక్క బాలివుడ్‌ డబ్బింగ్‌ సినిమా కూడా ఇక్కడ ఆడలేదు. అయితే దీనిపై ‘గాడ్‌ఫాదర్‌’లో చిరుతో పాటు నటిస్తున్న సల్మాన్‌ ఖాన్‌ నవ్వుతూనే పంచ్‌ వేశాడు. చిరు మనమంతా ఇండియన్‌ యాక్టర్స్‌ అని చెబుతుండగా సల్మాన్‌ కలగజేసుకుంటూ ‘చిరు సర్‌ మీ సినిమాలు మేం యాక్సెప్ట్‌ చేస్తున్నాం. కానీ మా సినిమాలే మీరు యాక్సెప్ట్‌ చేయట్లేదంటూ’ ఒకింత ఆవేదన వెళ్లగక్కారు. దీనిపై చిరు … Read more

    థ్రిల్లింగ్‌గా ‘హంట్’ టీజర్

    సుధీర్ బాబు హీరోగా కొత్త దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తున్న మూవీ ‘హంట్’. సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్ నేడు విడుదలైంది. రెండు క్యారెక్టర్లను సుధీర్ బాబు ఒకేసారి పోషిస్తున్నట్లు ఆ టీజర్‌లో చూపించారు. థ్రిల్లింగ్‌గా, ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి గిబ్రాన్ సంగీత దర్శకుడు.

    యాక్టర్స్ కోసమే వర్క్ షాప్

    పవన్ కళ్యాణ్, క్రిష్ కంబినేషన్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ మూవీ వర్క్ షాప్ తాజాగా నిర్వహించారు. అయితే ఈ వర్క్ షాప్‌ను కేవలం నటీనటుల కోసమే నిర్వహించారట. షూటింగ్‌కు వెళ్లేముందు ఆయా పాత్రలు ఎలా నటిస్తాయో ఒక క్లారిటీ వచ్చెనందుకు వర్క్ షాప్ నిర్వహించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

    ‘ఆదిపురుష్’పై నెగెటివ్ ఫీడ్‌బ్యాక్

    ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. కానీ, టీజర్‌ని చూస్తుంటే యానిమేటెడ్ మూవీని తలపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గ్రాఫిక్స్ తేలిపోయిందని వారు భావిస్తున్నారు. టీజర్‌లో పాత్రల కదలికలను చూస్తుంటే ఇది స్పష్టమవుతోందని అంటున్నారు. అయితే, తన డైలాగులతో ప్రభాస్ హోరెత్తిస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.

    LIVE: ఆదిపురుష్ టీజర్ ఈవెంట్

    అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్ ఈవెంట్ జరుగుతోంది. ఈ మేరకు చిత్రబృందం అక్కడికి చేరుకుంది. ఇదివరకే విడుదల చేసిన ఆదిపురుష్ పోస్టర్ అదిరింది. రాముడి లుక్‌లో ప్రభాస్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేసేందుకు మేకర్స్ బృందం సిద్ధమవుతోంది. ఓం ప్రకాశ్ రౌత్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

    ఆకట్టుకుంటున్న ‘క్రేజీ ఫెలో’ ట్రైలర్

    టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘క్రేజీ ఫెలో’ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే ఈసారి ఆది ఖచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌ట్రైనర్‌గా ఈ చిత్రాన్నిరూపొందించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఫణిక్రిష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆదికి జోడీగా సూర్యవంశీ, మర్నామీనన్‌లు నటించారు. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 14న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

    ‘గాడ్‌ఫాదర్’ హిందీ ట్రైలర్ రిలీజ్

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ ట్రైలర్‌ను హిందీలో కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. శనివారం ముంబైలో ఈ ట్రైలర్ విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నిదసరా సందర్భంగా అక్టోబర్ 5న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ‘నో మోర్ మెర్సీ’ అంటున్న నాగ్

    కింగ్ నాగార్జున హీరోగా, సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించిన ‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో నాగార్జున మాస్ యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. యాక్షన్ సీన్స్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉండడంతో ప్రేక్షకులకు ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ‘నో మోర్ మెర్సీ’ అంటూ నాగార్జున విలన్లను ఊచకోత కోయడం ట్రైలర్‌కే హైలెట్‌గా మారింది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం చేపట్టారు. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

    యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘అవుననవా’ సాంగ్

    విశ్వక్ సేన్, మిథిలా జంటగా అశ్వత్ మరిముత్తు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ‘అవుననవా’ అనే సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. 3 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో 8వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కానుంది.

    ఆకట్టుకుంటున్న ‘మంత్ ఆఫ్ మధు’ టీజర్

    నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా శ్రీకాంత్ నాగోతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న కొన్ని అపార్థాల, వాటి వలన కలిగిన నష్టాలను ఈ మూవీలో చూపించినట్లు తెలుస్తుంది. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.