• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంతారా తెలుగు ట్రైలర్ విడుదల

    ఇటీవల కన్నడలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘కాంతారా’ మూవీ ఈనెల 15వ తేదీన తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన ఈ సినిమా డబ్బింగ్ హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు.

    ఆరోజు నిద్ర కూడా పోలేదు: చిరంజీవి

    గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్‌కు ముందు రోజు నాకంటే సురేఖా ఎక్కువ టెన్షన్ పడింది. డల్ అయింది. తనని చూసి నేను కూడా కాస్త డల్ అయ్యాను. ఆ రోజు రాత్రి నేను అస్సలు నిద్రపోలేదు. కానీ రిలీజ్ రోజు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఉత్సాహం వచ్చింది. ప్రతి సినిమాలో ప్రాణం పెట్టి తీస్తాం. కొంచెం తేడా కొట్టినా.. ప్రాణసంకటంగా అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

    LIVE: గాడ్‌ఫాదర్ సక్సెస్ వేడుక

    ‘గాడ్‌ఫాదర్’ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహిస్తోంది. ఈ సినిమాలో ‘బ్రహ్మ’గా చిరు అదరగొట్టారు. జయ్‌దేవ్ పాత్రలో సత్యదేవ్ ఒదిగిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. మళయాల సినిమా ‘లూసిఫర్’ సినిమాలో కొన్ని మార్పులు చేసి.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్ రాజా.

    ట్రెండింగ్‌లో ‘ధూం ధాం దోస్తాన్’

    నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ధూం ధాం దోస్తాన్’ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. 56లక్షలకు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మాస్ కోణంలో సాగే ఈ పాట జనాలను ఉర్రూతలూగిస్తోంది. నాని గెటప్ ఆకట్టుకుంటోంది. ఇక కాసర్ల శ్యామ్ లిరిక్స్‌కి రాహుల్ సిప్లిగంజ్ మాస్ వాయిస్ తోడవడంతో ఓ ఊపు ఉపేస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. మీరూ ఓసారి ఈ పాట వినేయండి.

    అదిరిన ‘ఓరి దేవుడా’ ట్రైలర్‌

    అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ‘ఓరి దేవుడా’ ట్రైలర్‌ విడుదలైంది. దేవుడు, స్నేహం, ప్రేమ, పెళ్లి ఇలా ప్రతి మనిషీ రిలేట్‌ చేసుకోగలగేలా ట్రైలర్‌ ఆకట్టుకుంది. తమిళంలో ఇప్పటికే ఈ సినిమా ‘ఓహ్‌ మై కడవులే’గా విజయం సాధించింది. ఆ సినిమాలో విజయ్‌ సేతుపతి చేసిన దేవుడి పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేశ్ చేస్తున్నారు.

    యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘హంట్’ టీజర్

    ఈనెల 3వ తేదీన విడుదలైన సుధీర్ బాబు ‘హంట్’ టీజర్ ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4.5 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి దూసుకెళ్తుంది. మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు.

    ‘దీంతనానా’ ప్రోమో విడుదల

    అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ప్రోమో విడుదలైంది. ‘దీంతనానా’ అంటూ సాగే పాటను సిద్ శ్రీరాం ఆలపించారు. ఈ పాటను అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అచు సంగీతం అందిస్తున్నారు.

    వినసొంపుగా ‘లైక్ షేర్ అండ్ సబ్స్‌క్రైబ్’ టైటిల్ సాంగ్

    సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్‌క్రైబ్’. నవంబర్ 4వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజగా టైటిల్ సాంగ్ విడుదలైంది. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ, సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.

    ‘UnStoppable 2’ టీజర్ విడుదల

    విజయవాడలో ‘UnStoppable 2’ టీజర్‌ని నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ‘మా నాన్న నేర్పిన సంస్కారం వుంది. సినిమా రంగం ఎప్పుడూ బాగుండాలి. నా తండ్రే నాకు స్ఫూర్తి దైవం. సినీ పరిశ్రమకు చైర్మన్‌గా, హిందూపురానికి ఎమ్మెల్యేగా సేవలు చేస్తున్నా’ అని బాలకృష్ణ తన అనుభవాలను పంచుకున్నారు. కాగా, టీజర్‌లో బాలయ్య వినూత్న గెటప్‌లో అలరించారు. ఈ షోకు మొదటి గెస్ట్‌గా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రానున్నట్లు సమాచారం.

    ‘ఆదిపురుష్ VFX‌తో మాకు సంబంధం లేదు’

    ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ మూవీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కు మిశ్రమ స్పందన వస్తుంది. గ్రాఫిక్స్ తేలిపోయిందని, ఇంకా బాగా చేయాల్సి ఉందని కామెంట్స్ వచ్చాయి. తాజాగా దీనిపై NY VFXwalla సంస్థ స్పందించింది. తమకు, ఆదిపురుష్ సినిమాకు సంబంధం లేదని ప్రకటించింది. తాము ఆదిపురుష్ సినిమా VFX పనుల్లో భాగం కాలేదని వెల్లడించింది. కాగా NY VFXwalla బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు చెందిన సంస్థ.