• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమోషనల్‌ అయిన హీరోయిన్‌ మరియా

    “ప్రిన్స్‌” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న నటి మరియా. ఉక్రెయిన్‌కు చెందిన ఈ నటి సినిమా షూటింగ్‌ కోసం ఇండియాకు వచ్చిరెండు వారాల్లోనే అక్కడ యుద్ధం మొదలైంది. ఆ విషయాన్ని తలుచుకుని మరియా ఎమోషనల్‌ అయింది. కష్టకాలంలో చిత్రబృందం తనకు ఎంతో సాయం చేసిందని చెప్పుకొచ్చింది. అక్టోబర్‌ 21న ప్రిన్స్‌ సినిమా విడుదల కాబోతుండగా…మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

    HEAD BUSH సూపర్ ట్రైలర్

    కేజీఎఫ్‌తో మొదలైన కన్నడ సినిమాల హవా ‘కాంతార’తో నెక్స్ట్‌ లెవెల్‌కి వెళ్లింది. ఈ ఏడాది KGF2, విక్రాంత్‌ రోణ, 777చార్లీ, కాంతార ఇలా సూపర్ హిట్ల తర్వాత… ఇప్పుడు ‘హెడ్‌ బుష్‌’ అంటూ మరో సినిమా రాబోతోంది. అగ్ని శ్రీధర్ రచన, శూన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. వయొలెంట్‌గా ఉన్న ట్రైలర్‌ చూస్తుంటే మరో మాస్‌ సినిమా లోడ్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. పుష్పలో జాలి రెడ్డిగా ధనంజయ ఇందులో హీరోగా కనిపిస్తున్నారు. అక్టోబర్‌ 21న ఈ సినిమా రిలీజ్‌ … Read more

    విశ్వక్‌సేన్ అలాంటి నటుడు: చరణ్

    సినిమా హిట్టయినా.. ఫ్లాపయినా వ్యక్తిత్వమే మనల్ని స్టార్‌గా నిలబెడుతుందని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తెలిపాడు. అలాంటి నటుడు విశ్వక్‌సేన్ అని.. అందుకే తనంటే ఇష్టమని చెర్రీ వెల్లడించాడు. ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన రాంచరణ్ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకున్నాడు. ‘రజినీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లాగా విశ్వక్‌సేన్ వ్యక్తిత్వం ఒకేలా ఉంటుంది. పర్సనాలిటీ నిండుగా ఉన్న హీరో విశ్వక్‌సేన్. ట్రైలర్ చూశా. బాగుంది. పండుగకు ఇంతకన్నా మంచి సినిమా ఏముంటుంది. ఎంతోమంది అభిమానులను విశ్వక్‌సేన్ సంపాదించుకున్నాడు’ అని చెర్రీ … Read more

    LIVE: ఓరి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్

    ఓరిదేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ వచ్చారు. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీ రోల్ పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్‌లలో సంయుక్తంగా రూపొందిన ఈ చిత్రాన్ని అశ్వత్ డైరెక్ట్ చేశారు. ఇదివరకే విడుదలైన ఈ సినిమా పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 21న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

    ‘అజయంతె రందమ్ మోషాణమ్‌’ గ్లింప్స్‌

    మళయాల స్టార్‌ టోవినో థామస్‌ హీరోగా పాన్‌ ఇండియా సినిమా‘అజంయతే రందమ్ మోషాణమ్‌’ ,షూటింగ్‌ ప్రారంభమైంది. మూడు యుగాల్లో జరిగే కథతో 3Dలో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. టొవినో థామస్‌ ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. టొవినో థామస్‌ సరసన కృతి శెట్టి, ఐశ్వర్య రాజేశ్‌, సురభి లక్ష్మి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అంచనాలు పెంచేలా ఈ గ్లింప్స్‌ అద్భుతంగా ఉంది.

    ఎమోషనల్ అయిన త్రివిక్రమ్

    త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘నువ్వే.. నువ్వే’ ఈ సినిమా విడుదలై 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ చిత్రబృందానికి స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆనాటి మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. తనకు తొలి అవకాశమిచ్చిన స్రవంతి రవికిశోర్‌ని ఎన్నటికీ మరచిపోనని.. ఆయన పాదాలకు త్రివిక్రమ్ అభివందనం చేశారు. తన మాటలను శ్రద్ధగా వినే ప్రొడ్యూసర్ దొరకడం అదృష్టమని మాటల మాంత్రికుడు అభిప్రాయపడ్డారు.

    నాకు రెండు ఫ్యామిలీస్ బావా: బాలకృష్ణ

    అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రొమో విడుదలైంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో చంద్రబాబు, లోకేష్‌ను బాలయ్య పిలిచారు. నా బెస్ట్ ఫ్రెండ్ YSR అని చంద్రబాబు చెప్పారు. ఇద్దరం కలిసి చాలా అల్లరి చేశామన్నారు. నాకు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి బావా అంటూ బాలయ్య హంగామా చేశారు. ఒకటి అక్కడ రోడ్ నెం.45లో వసుంధర, పిల్లలు. రెండోది యాక్చువల్‌గా లాస్ట్ ఇయరే స్టార్ట్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చారు. 1995లో మనం తీసుకున్న నిర్ణయం తప్పా అని బాలకృష్ణను చంద్రబాబు అడిగారు. ‘కాళ్లు పట్టుకుని అడుకున్నాను.. నా … Read more

    వేదికపైనే హీరోపై హీరోయిన్‌ ముద్దుల వర్షం

    త్రివిక్రమ్‌ దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ, సునీల్, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించి అలరించిన ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం సంబరాలు చేసుకుంది. ఆనాటి రోజులకు గుర్తు చేసుకుని చిత్ర యూనిట్ ఎమోషనల్‌ అయింది. హీరోయిన్ శ్రియ అయితే తరుణ్‌తో తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ అతడిపై ముద్దుల వర్షం కురిపించింది. త్రివిక్రమ్‌ మాటలు, సునీల్‌ కామెడీ టైమింగ్‌తో ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నలిచింది.

    జిన్నా నుంచి ‘జారు మిఠాయా’ సాంగ్ రిలీజ్

    మంచు విష్ణు నటించిన జిన్నా మూవీ నుంచి ‘జారు మిఠాయా’ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ ఐటెం సాంగ్‌లో శృంగార తార సన్నిలియోన్‌తో విష్ణు స్టెప్పులు వేశారు. సాంగ్‌లో సన్నిలియోన్‌ ఇరగదీసింది. గ్లామర్ పండించింది. హాట్ హాట్ అందాలతో చెలరేగింది. అందాల అరబోతతో సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది.

    FILMFARE AWARDS 2022: ఇటు మాస్.. అటు క్లాస్.. దక్షిణాది చిత్రాలకు అవార్డుల నీరాజనం

    67వ ఫిల్మ్‌ఫేర్ వేడుకలు బెంగుళూరులో ఘనంగా జరిగాయి. 2020, 2021కి గాను జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో అలరించిన సినిమాలకు, తారలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో తెలుగు నుంచి ‘పుష్ప’, తమిళ్‌ నుంచి ‘సూరారై పొట్రు’, మళయాలం నుంచి ‘అయ్యప్పనుమ్ కొషియమ్’, కన్నడ నుంచి ‘యాక్ట్ 1978’ సినిమాలు అత్యధిక విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ఓ కన్నుల పండుగగా నిలిచింది. October 16న తమిళ, కన్నడ … Read more