• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హెబ్బాా పటేల్ ‘B&W’ టీజర్ విడుదల

    కుమారి 21ఎఫ్‌తో పరిచయమైన హెబ్బా పటేల్ మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘బ్లాక్ అండ్ వైట్’ సినిమా టైటిల్. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని రచయిత వి. విజయేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. బటన్ నొక్కి ఆయన టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రొమాన్స్, యాక్షన్ సీన్లతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా టీజర్ సాగుతోంది. ఎల్.ఎన్.వి సూర్యప్రకాశ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నేని నవీన్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

    ఉత్కంఠగా ‘యశోద’ ట్రైలర్

    స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘యశోద’ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. గురువారం విజయ్ దేవరకొండ ఈ చిత్ర తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ చిత్రం సరోగసీ నేపథ్యంలో తీసినట్లు అర్ధమవుతోంది. ఈ చిత్రం వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు.

    గాడ్ ఫాదర్ టైటిల్ సంగ్ రిలీజ్

    గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ ఫుల్ వీడియోని మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్‌ సిక్వెన్స్‌తో ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా ఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. హీరో మెగాస్టార్ చిరంజీవి తనకే సాధ్యమైన యాక్షన్ పెర్ఫార్మన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో నయనతార, సముద్రఖని, సునిల్ ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

    “ లైక్‌,షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌” ట్రైలర్‌

    సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా వస్తున్న కామెడీ చిత్రం “లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌”. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు. కామెడీ, సీరియస్‌ సీన్ల మిశ్రమంగా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. నెల్లూరు సుదర్శన్‌ టైమింగ్‌ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవంబర్‌ 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

    డీజే టిల్లు-2 టీజర్‌

    చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన సినిమా డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో డైలాగులు మాస్‌ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా రెండో పార్ట్ తెరకెక్కుతోంది. అందుకు సంబంధించిన టీజర్‌ను ఇవాళ దీపావళి సందర్భంగా విడుదల చేశారు. ఈ సారి డబుల్‌ ఫన్‌ గ్యారంటీ అనేలా టీజర్‌ తీర్చిదిద్దారు. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

    “వాల్తేరు వీరయ్య” టైటిల్ టీజర్‌

    చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ట్ చేస్తున్న #Mega154 సినిమా టైటిల్ టీజర్‌ అదిరిపోయింది. వాల్తేరు వీరయ్య టైటిల్‌ ఫిక్స్‌ చేస్తూ చిరు లుక్‌ రివీల్‌ చేస్తూ టీజర్‌ విడుదల చేశారు. మాస్‌ గెటప్‌లో ముఠా మేస్త్రీని గుర్తుతెచ్చేలా చిరు కనిపించారు. ఈ సినిమాలో రవితేజ, ప్రకాశ్ రాజ్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    వావ్.. బోల్డ్ లుక్‌లో విక్రమ్

    చియాన్ విక్రమ్ మరో విభిన్న పాత్రలో అలరించబోతున్నాడు. పా రంజిత్ రచించి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో బోల్డ్‌ లుక్‌లో కనిపించి మరోసారి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా టైటిల్‌ని ‘తంగలాన్’గా ఫిక్స్ చేసి.. నేడు టీజర్‌ని విడుదల చేశారు. నిజ జీవిత ఘటనలను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విక్రమ్‌ లుక్‌ని చూసి ‘నటన కోసం తాను ఎంత సాహసానికైనా వెనుకాడబోనని మరోసారి నిరూపించుకున్నాడు’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

    జపాన్‌లో భారత్‌కు ప్రౌడ్ మూమెంట్

    ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి, భారతదేశానికి ప్రౌడ్ మూమెంట్ చోటు చేసుకుంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జపాన్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా జపాన్‌లోని ఒక థియేటర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితమవుతోంది. థియేటర్లో జపాన్ దేశస్తులు భారత జెండా చేతబట్టుకుని, భారత్‌పై తమ గౌరవాన్నివ్యక్తపరిచారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. Proud moment for us to see the VANDE MATARAM flag in the hands of the Japanese and … Read more

    జపనీస్‌లో ఎన్టీఆర్ స్పీచ్‌

    “RRR” ప్రమోషన్స్‌లో భాగంగా ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌, రాజమౌళి జపాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఫుడ్‌ను వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తూనే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక ఎన్టీఆర్‌ గురించి మనకు తెలియందేముంది…ఏక సంథాగ్రాహి. ఒక్కసారి విన్నాడంటే పట్టేస్తాడు. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఇప్పుడు జపనీస్‌లోనూ మాట్లాడుతున్నాడు. జపాన్‌లో ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ జపనీస్‌లో మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. NTR speaking in Japanese … Read more

    ఆసక్తిగా ‘మైఖేల్’ ట్రైలర్

    టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్‌లో సందీప్ లుక్స్, నటన చాలా కొత్తగా ఉన్నాయి. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంలో సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటించింది. రంజిత్.జె ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, అనసూయ, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు.