• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ సాంగ్ రిలీజ్

    కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న ‘నేను మీకు బాగా కాల్సిన‌వాడిని’ మూవీ నుంచి మాస్ సాంగ్ రిలీజ్ కానుంది. అట్టాంటి ఇట్టాంటి అనే ఈ సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. మణిశ‌ర్మ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను కీర్త‌న శ‌ర్మ, సాకేత్ క‌లిసి పాడు. ఈ సినిమాలో సంజ‌న ఆనంద్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీధ‌ర్ గాడె ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కోడి దివ్య నిర్మిస్తుంది. సెప్టెంబ‌ర్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది.

    విద్యార్థులతో స్టెప్పులేసిన హీరోహీరోయిన్

    ఏపీ విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీని రంగ రంగ వైభవంగా చిత్ర బృందం సందర్శించింది. ఈ కార్యక్రమంలో హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతిక శర్మ, దర్శకుడు గిరీశయ్య, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. పలువురు స్టూడెంట్స్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. అదే క్రమంలో విద్యార్థులతో కలిసి హీరోహీరోయిన్లు కూడా కలిసి డాన్స్ స్టెప్పులేశారు. మరోవైపు కొంత మంది విద్యార్థులు నటినటులతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.

    ఘనంగా అలీ కుమార్తె నిశ్చితార్థం

    బాల నటుడి నుంచి స్టార్‌ కమెడియన్‌గా, హీరోగా రెండు తరాల తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిన నటుడు అలీ. ప్రస్తుతం బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. తాజాగా అలీ పెద్ద కుమార్తె ఫాతిమా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని ఆయన సతీమణి జుబేదా తన యూట్యూబ్‌ చానెల్లో పంచుకున్నారు. వేడుకకు అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. సాయికుమార్‌, బ్రహ్మానందం తదితరులు కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

    నచ్చితే చూడండి లేకుంటే లేదు: కరణ్‌ జోహార్‌

    సోషల్‌ మీడియా ట్రోల్స్‌పై బాలివుడ్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ స్పందించారు. తాను ట్రోల్స్‌ అంత సీరియస్‌గా తీసుకోనని చెప్పారు. బాయ్‌కాట్‌ గ్యాంగ్‌ అనేది ఒక గ్రూప్‌ అని వారిని తాను పట్టించుకోనన్నారు. తమ సినిమా చూడమని ఎవర్నీ ఒత్తిడి చేయట్లేదని ‘ వారికి నచ్చిన అంశం సినిమాలో ఉంటే చూస్తారు. లేకుంటే లేదు. తలకు గన్‌ పెట్టి సినిమా చూడమని అయితే చెప్పలేం కదా!’ అని కరణ్‌ జోహార్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. Watch on twitterపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. … Read more

    సుధీర్‌ ‘హంట్‌’ ఫస్ట్‌ లుక్‌

    సుధీర్‌ బాబు 16వ సినిమా టైటిల్‌ను హంట్‌గా ఫిక్స్‌ చేశారు. ‘గన్స్‌ డోంట్‌ లై’ ట్యాగ్‌ లైన్‌. ఈ మేరకు ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మహేశ్‌ సురపనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్‌ మ్యూజిక్‌ చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెలుస్తోంది. ఇటీవల విజయవంతమైన కమల్‌హాసన్‌ విక్రమ్‌ టైటిల్‌ స్టైల్‌లోనే హంట్ ట్రైలర్‌ ఉంది.

    శ్రీనిధి శెట్టి క్యూట్‌ తెలుగు స్పీచ్‌

    చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా కోబ్రా. ఓ లెక్కల మాస్టారుగా క్రైమ్స్‌ చేసే పాత్రలో విక్రమ్‌ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌ ప్రారంభించిన చిత్రబృందం 23న తిరుచ్చి, మధురై, 24న కోయంబత్తూర్‌లో, 25న చెన్నై, 26న కొచ్చిలో, 27న బెంగళూరులో పర్యటించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెలుగులో చక్కగా మాట్లాడారు.

    యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘ది ఘోస్ట్’ ట్రైలర్

    అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘ది ఘోస్ట్’. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్లిపోతుంది. 8 మిలియన్స్‌కు పైగా వ్యూస్, 2 లక్షలకు పైగా లైక్స్‌తో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది.

    శ‌ర్వానంద్ కోసం పాట పాడిన కార్తి

    శ‌ర్వానంద్ న‌టిస్తు ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో హీరో కార్తి ఒక పాట పాడారు. జేక్స్ బొజోయ్ సంగీతం అందించిన మారిపోయే అనే పాట‌తో కార్తి అల‌రించాడు. ఈ మూవీ సెప్టెంబ‌ర్ సెప్టెంబ‌ర్ 9న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. రితూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సీనియ‌ర్ న‌టి అమ‌ల శ‌ర్వానంద్‌కు త‌ల్లిగా క‌నిపించ‌బోతుంది. వెన్నెల కిశోర్, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

    చిట్టితో సీత..సూప‌ర్ డ్యాన్స్‌

    ‘సీతా రామం’ మూవీ స‌క్సెస్‌ఫుల్‌గా ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఆగ‌స్ట్ 5న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి స్పంద‌న ల‌భించింది. అయితే ఇందులో హీరోయిన్‌గా న‌టించిన మృణాల్ మ‌న జాతిర‌త్నాలు చిట్టిని క‌లిసింది. వీరిద్ద‌రూ క‌లిసి సీతారామంలోని ఒక పాట‌కు సూప‌ర్‌గా డ్యాన్స్ చేశారు. ఇద్ద‌రు అంద‌మైన భామ‌లు చేసిన ఈ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన‌ సీతారామం ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.75 కోట్లు రాబ‌ట్టింది. సౌత్‌లో సినిమా సూప‌ర్‌హిట్ కావ‌డంతో సెప్టెంబ‌ర్ 2న హిందీలో రిలీజ్ … Read more

    ఆస‌క్తిక‌రంగా ‘ర‌హ‌స్య’ టీజ‌ర్‌

    నివాస్ సిస్తు, సారా ఆచార్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘ర‌హ‌స్య’ టీజ‌ర్ రిలీజ్ అయింది. హీరో, హీరోయిన్ ఇద్ద‌రూ పోలీసాఫీస‌ర్లుగా న‌టించారు. ఒక తీవ్ర‌వాది ప‌ట్టుకునే మిష‌న్‌లో భాగంగా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు టీజ‌ర్ చూస్తూ తెలుస్తుంది. శివ శ్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సునీల్ క‌శ్య‌మ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎస్ఎస్ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మి. ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి, త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.