• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తీస్మార్ ఖాన్ నుంచి ‘సమయానికే’ సాంగ్ విడుదల

    ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా కళ్యాణ్‌జి గోగన ‘తీస్మార్ ఖాన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నుంచి ‘సమయానికే’ అంటూ సాగే సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్‌లో ఆది, పాయల్ చేసిన రొమాన్స్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోగా.. ఇప్పుడు విడుదలైన సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. కాగా ఈ సినిమాకు సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు.

    ‘రాజ‌మండ్రి రోజ్‌మిల్క్’ టైటిల్ ట్రాక్ విడుద‌ల‌

    జై, అనంతిక జంట‌గా న‌టించ‌న ‘రాజ‌మండ్రి రోజ్‌మిల్క్’ మూవీ నుంచి టైటిల్ ట్రాక్ రిలీజ్ అయింది. అజ‌య్ అర‌సాడ మ్యూజిక్ అందించ‌గా ఈ పాట‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి ఆల‌పించాడు. చంద్ర‌బోస్ లిరిక్స్ అందించాడు. వెన్నెల కిశోర్, ప్ర‌వీణ్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఇన్‌ట్రోప్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాని బండిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

    తీస్ మార్ ఖాన్ నుంచి సమయానికే వీడియో సాంగ్ రిలీజ్

    సాయికుమార్ కుమారుడు ఆది యాక్ట్ చేసిన తీస్ మార్ ఖాన్ మూవీ నుంచి సమయానికే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. వీడియోలో ఆది సిక్స్ ప్యాక్ బాడీ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక హీరోయిన్ పాయల్ రాజపుత్ ఈ పాటలో వయ్యారాలు ఒలకబోస్తూ అందాల కనువిందు చేసింది. ఈ చిత్రానికి కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించగా, సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ ఆగస్టు 19న రిలీజ్ కానుంది.

    దుల్కర్ సల్మన్ సీతారామం ట్రైలర్‌ విడుదల

    దుల్కర్ సల్మన్ యాక్ట్ చేసిన సీతారామం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లో దుల్కర్ డైలాగ్స్, యాక్టింగ్ అదరగొట్టాడు. మరోవైపు లోకేషన్స్ కూడా అదిరేలా ఉన్నాయి. రొమాంటిక్ డ్రామా, యుద్ధం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ మూవీ ఆగస్టు 5న రిలీజ్ కానుంది.

    రామారావు ఆన్ డ్యూటీ టిక్కెట్ల రేట్లు ఫిక్స్

    రామారావు ఆన్ డ్యూటీ టిక్కెట్ల రేట్లు ఖరారయ్యాయి. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ శరత్ మండవ ఈ మేరకు వెల్లడించారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో టెక్కెట్ ధర రూ.195, సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, రూ.100, రూ.50గా నిర్ణయించారు. ఏపీలో రూ.177, రూ.147, రూ.80గా ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే రూ.30 ఎక్కువ తీసుకుంటారని పేర్కొన్నారు. కొంచెం కష్టమైనా థియేటర్‌కి వెళ్లి కౌంటర్‌లో టికెట్‌ తీసుకోవాలని సూచించారు. ఇక ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది.

    స్టేజీపై పానీపూరి తినిపించుకున్న చిరంజీవి-అమీర్‌ఖాన్

    నేడు లాల్‌సింగ్ చ‌డ్డా తెలుగు ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. చిరంజీవి ఈ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న కూడా పాల్గొన్నారు. ట్రైల‌ర్‌లో ఉన్న పానీపూరీ డైలాగ్‌ను తెలుగులో అమీర్‌ఖాన్‌తో నాగ‌చైత‌న్య చెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక డైలాగ్ చెప్పిన త‌ర్వాత పానీపూరీని చిరంజీవి, అమీర్‌ఖాన్ ఒక‌రికొక‌రు తినిపించుకున్నారు. లాల్‌సింగ్ చ‌డ్డా మూవీ ఆగ్ట్ 11న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

    అమీర్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్ అయింది. నాగ‌చైత‌న్య ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. క‌రీనా క‌పూర్ హీరోయిన్‌గ న‌టిస్తుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా నేడు హైద‌రాబాద్‌లో చిత్ర‌బృందం ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా లాల్‌సింగ్ చ‌డ్డా తెర‌కెక్కింది. అద్వైత్ చంద‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లాల్‌సింగ్ చ‌డ్డా ఆగ‌స్ట్ 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

    జిన్నా మూవీ నుంచి ఫ్రెండ్ షిప్ వీడియో సాంగ్ రిలీజ్

    టాలీవుడ్ హీరో మంచు విష్ణు జిన్నా మూవీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఫ్రెండ్ షిప్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇదే స్నేహం అంటూ కొనసాగుతున్న సాంగ్ చూడముచ్చటగా ఉంది. ఈ పాటను మంచువిష్ణు కవల కుమార్తెలు అరియానా, వివియానా పాడి, వారే యాక్ట్ చేయడం విశేషం. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈషాన్ సూర్య డైరెక్షన్ చేస్తున్నారు.

    సినీపోలిస్ మాస్ థియేటర్ అయితే ఇలానే ఉంటది !

    పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌, ముంబైలోని సినీపోలిస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన అభిమానులతో ఎప్పుడూ క్లాస్‌గా ఉండే సినీపోలిస్ థియేటర్ ఒక్కసారిగా మాస్ ప్రేక్షకులతో నిండిపోయింది. అభిమానుల ఈలలు, కేరింతలతో మాస్ జాతరను తలపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు సినీపోలిస్ మాస్ థియేటర్ అయితే ఇలానే ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు … Read more

    మాచర్ల నియోజక వర్గం నుంచి ఫుల్ సాంగ్ రిలీజ్

    యంగ్ హీరో నితిన్ నటించిన మాస్ మూవీ మాచర్ల నియోజకవర్గం నుంచి అదిరిందే ఫుల్ సాంగ్ విడుదలైంది. అదిరిందే పసిగుండె..మగజాతికి హానివి నువ్వే అంటూ సాగిన సాంగ్ లిరిక్స్ బాగున్నాయి. సాంగ్ లో నితిన్ సింప్లి స్టెప్పులతో అదరగొట్టాడు. హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ లుక్స్ లో హాట్ హాట్ గా కనిపించింది. సాంగ్ లోకేషన్స్ రిచ్ గా కనిపించాయి. కాగా ఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.