Celebrities in Summer: వేసవిలో చిల్‌ అవుతున్న అందాల భామలు.. ఎలాగో మీరే చూడండి?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Celebrities in Summer: వేసవిలో చిల్‌ అవుతున్న అందాల భామలు.. ఎలాగో మీరే చూడండి?

  Celebrities in Summer: వేసవిలో చిల్‌ అవుతున్న అందాల భామలు.. ఎలాగో మీరే చూడండి?

  April 16, 2024

  దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు అందాల భామలు సముద్ర తీరాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్ద వాలిపోతున్నారు. వాటర్‌ బేబీలుగా మారి రచ్చ రచ్చ చేస్తున్నారు. తమ అందాలతో ఈ వేసవిని మరింత హీట్‌ చేస్తున్నారు. ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

  బాలీవుడ్‌ బ్యూటీ వాని కపూర్‌.. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు స్విమ్మింగ్‌ పూల్‌ను ఆశ్రయిస్తోంది. చల్లటి నీటిలో హాయిగా గడుపుతూ ఫొటోకు ఫోజు ఇస్తోంది.

  దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా.. బికినీతో స్విమ్మింగ్‌ చేసి అహ్లాదంగా గడిపింది. రెడ్ డ్రెస్‌ బికినీలో ఈ భామ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

  చిరుత బ్యూటీ నేహా శర్మ.. ఈ వేసవి నుంచి తప్పించుకునేందుకు చల్ల చల్లగా ఐస్‌క్రీమ్ తింటోంది. ఇందుకు సంబంధించిన ఫోటోను నేహా స్వయంగా పంచుకుంది. 

  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌.. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు గోవా బీచ్‌కు వెళ్లింది. అక్కడ సన్‌ సెట్‌ సమయంలో దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది. 

  బాలీవుడ్ భామ.. సనయ ఇరానీ ప్రస్తుతం గ్రీసులో పర్యటిస్తోంది. అక్కడ ఓ తీరంలో సన్‌సెట్‌ సందర్బంగా దిగిన ఫొటోను ఈ బ్యూటీ పంచుకుంది. 

  మరో బ్యూటీ బార్ఖా సేన్‌ గుప్తా.. ఈ లేజీ సమ్మర్‌ డేస్‌ను కాఫీ తాగి గడుపుతున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది. 

  బాలీవుడ్‌ స్టార్‌ నటి మౌని రాయ్‌.. ఈ వేసవిని చాలా అహ్లాదకరంగా గడుపుతోంది. ఖాళీ సమయాన్ని స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద గడుపుతూ చిల్ అవుతోంది. 

  యంగ్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ.. ఈ సమ్మర్‌లో ఎక్కువ సమయాన్ని గార్డెనింగ్‌లో గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ఫ్యాన్స్‌తో పంచుకుంది. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version