Devara Movie Scam: ‘దేవర’ ప్రీరిలీజ్‌ రద్దు వెనక పెద్ద స్కామ్‌? జూ.ఎన్టీఆర్ కూడా మోసం చేశారా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara Movie Scam: ‘దేవర’ ప్రీరిలీజ్‌ రద్దు వెనక పెద్ద స్కామ్‌? జూ.ఎన్టీఆర్ కూడా మోసం చేశారా?

    Devara Movie Scam: ‘దేవర’ ప్రీరిలీజ్‌ రద్దు వెనక పెద్ద స్కామ్‌? జూ.ఎన్టీఆర్ కూడా మోసం చేశారా?

    September 24, 2024

    హైదరాబాద్‌లో ఆదివారం జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అకస్మాత్తుగా రద్దైన సంగతి తెలిసిందే. నొవాటెల్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కోసం అభిమానులు భారీగా తరలిరావడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో గందరగోళం ఏర్పడి ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. అటు తారక్‌ సైతం స్పెషల్‌ వీడియోను షేర్ చేసి మరి బాధపడ్డారు. అయితే కావాలనే దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్లాన్‌ ప్రకారమే ఈవెంట్‌ను క్యాన్సిల్‌ చేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. లాజికల్‌గా కొన్ని ప్రశ్నలు సైతం సంధిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    ఈ ప్రశ్నలకు ఆన్సర్‌ ఎక్కడ!

    ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం 6 గంటలకు నొవాటెల్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి పని చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్‌, విలన్‌గా చేసిన సైఫ్‌ అలీఖాన్‌ ఈవెంట్‌ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయిన దాఖలాలు లేవు. కనీసం ఒక్క ఎయిర్‌పోర్ట్‌ విజువల్ కూడా బయటకి రాలేదు. అంతేకాదు దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ప్రారంభానికి కొద్ది గంటల ముందే సైఫ్ అలీఖాన్‌ తన ఫ్యామిలితో ముంబయి వీధుల్లో కనిపించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈవెంట్‌ రద్దు అనంతరం జాన్వీ పోస్టు చేసిన వీడియో కూడా పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. సదరు వీడియోలో తెలుగులో మాట్లాడిన జాన్వీ ఎక్కడా ఈవెంట్‌ రద్దు గురించి ప్రస్తావించలేదు. అంటే ముందుగానే ఈ వీడియోను సిద్ధం చేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. 

    తారక్‌ పైనా అనుమానాలు!

    దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు కావడంతో తారక్‌ చాలా బాధపడ్డారు. ఫ్యాన్స్‌ను కలుసుకునే అవకాశం చేజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేసుకున్న అదే రోజు రాత్రి 11 గంటలకు తారక్‌ అమెరికాకు ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈవెంట్‌ జరిగినా అది రాత్రి 9:30 వరకు ఉండేదని నెటిజన్లు అంటున్నారు. అంటే హైదరాబాద్‌ ట్రాఫిక్‌ను దాటుకొని గంటన్నర వ్యవధిలో తారక్‌ ఎయిర్‌పోర్ట్‌లో వాలిపోవడం సాధ్యమయ్యే పరిస్థితి కాదని అభిప్రాయపడుతున్నారు. ఈవెంట్‌ జరగదని ముందే తెలిసే తారక్‌ యూఎస్‌కు ఫ్లైట్ టికెట్స్‌ బుక్‌ చేసుకున్నాడని నెటిజన్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు ప్రీ రిలీజ్‌ టికెట్‌ను ఒక్కొటి రూ.1000-3000 మధ్య విక్రయించారని, వాటిని రిఫండ్‌ చేసిన దాఖలాలు కూడా లేవని పేర్కొంటున్నారు. టికెట్ల విషయంలోనూ పెద్ద స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తున్నారు. 

    టికెట్ల రేటు పెంపు

    తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర టికెట్ల ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లపై రూ.25 , మల్టీప్లెక్స్‌ల‌లో టికెట్ రేట్లపై రూ .50 ల పెంచుకోవ‌చ్చ‌ని తెలిపింది. అంతేకాకుండా సెప్టెంబరు 27 న 29 థియేటర్ల‌లో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోస్‌కు, అదేవిధంగా ఉదయం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని థియేటర్ల‌లో స్పెషల్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా తొలిరోజున వేసే అన్ని షోలపై రూ.100 పెంచుకోవచ్చని సూచించింది. అటు ఏపీ ప్రభుత్వం టికెట్‌పై రూ.60 నుంచి రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.  మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version