Devara Trailer Review: దేవర దెబ్బకు ఎరుపెక్కిన ఎర్ర సముద్రం.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ట్రైలర్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara Trailer Review: దేవర దెబ్బకు ఎరుపెక్కిన ఎర్ర సముద్రం.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ట్రైలర్‌!

    Devara Trailer Review: దేవర దెబ్బకు ఎరుపెక్కిన ఎర్ర సముద్రం.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ట్రైలర్‌!

    September 10, 2024

    నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. జూనియర్‌ ఎన్టీఆర్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ నుంచి ట్రైలర్‌ విడుదలైంది. అందరి అంచనాలను అందుకుంటూ ట్రైలర్‌ వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది. దేవర ట్రైలర్‌పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. దర్శకుడు కొరటాల శివ మార్క్‌ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది. కొన్ని డైలాగ్స్‌ చాలా బాగా పేలాయి. 

    ట్రైలర్‌ రిలీజ్‌..!

    ముంబైలో గ్రాండ్‌గా ఎన్టీఆర్ ‘దేవర’ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, అనిల్ త‌డాని స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. మొత్తం 2 నిమిషాల 39 సెక‌న్లున్న ఈ ట్రైల‌ర్ మాస్ ఎలిమెంట్స్ ప్యాక్డ్‌గా ఉంది. ఎన్టీఆర్ అభిమానుల‌కు, యాక్ష‌న్ మూవీ ల‌వ‌ర్స్ కోరుకునే అంశాల‌ు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూవీ కోసం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ క్రియేట్ చేసిన ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచం, ఆయ‌న విజ‌న్ అద్భుతంగా ఉన్నాయి. ఆద్యంతం ఈ ట్రైలర్‌ యాక్షన్‌తో నిండిపోయింది. ఇందులో ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూపించారు. 

    ఎలా సాగిందంటే?

    ట్రైల‌ర్‌ను పరిశీలిస్తే ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది. 

    ట్రైలర్‌లో అవే హైలెట్స్‌!

    ట్రైలర్‌ చూశాక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌లో తారక్ డైలాగ్స్, నటన, మాస్ లుక్ తెగ ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కూడా చాలా క్యూట్‌గా పల్లెటూరి పిల్లగా కనిపించింది. ‘వాడికి వాడి అయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే’ అని తారక్‌ను జాన్వీ కపూర్ అంటుంది. దీంతో ఎన్టీఆర ఆశ్చర్యంగా చూస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌ ఆకట్టుకుంది. ట్రైల‌ర్ చివ‌ర‌లో ఎన్టీఆర్ షార్క్‌పై ఉండి రైడ్ చేసే సీన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. అటు ట్రైలర్‌లోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్‌ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అనిరుధ్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాలో మరో లెవల్లో ఉంటాయని ట్రైలర్‌ని బట్టే తెలిసిపోతుంది. అనిరుధ్‌ మార్క్‌ బీజీఎంతో సెప్టెంబర్‌ 27న థియేటర్లు మోతమోగనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version