సూర్య ‘ఈటీ: ఎవరికి తలవంచడు’ మూవీ నేడు థియేటర్లలో రిలీజైంది. సూర్య గత రెండు సినిమాలు ఆకాశమే హద్దురా, జై భీమ్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. మూడేళ్ల తర్వాత సూర్య మూవీ థియేటర్లలోకి వస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రియాంక మోహన్ ఈటీలో హీరోయిన్‌గా నటించింది. పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. డి.ఇమ్మాన్ సంగీతం అందించాడు. సత్యరాజ్, శరణ్య, వినయ్ రాయ్ వంటివాళ్లు కీలక పాత్రలు పోషించారు. మరి ఇంతకీ సినిమా స్టోరీ ఏంటి? ఎలా ఉంది? అనే విషయాలు తెలుసుకుందాం.
కృష్ణమోహన్(సూర్య) లాయర్‌గా పనిచేస్తుంటాడు. చిన్నప్పుడే తన చెల్లెలిని కోల్పోవడంతో ఊర్లో ఉన్న అమ్మాయిలందర్నీ తన సొంత చెల్లెల్లుగా భావిస్తూ వారికి అండగా నిలుస్తాడు. ఆ సమయంలోనే పక్క గ్రామంలోని అమ్మాయి ప్రియాంక మోహన్‌తో ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా ఆ విలేజ్‌లో అమ్మాయిలు వరుసగా సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది. ఈ మరణాలకు కారణం ఎవరు అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు కృష్ణ మోహన్. ఈ నేపథ్యంలో అతనికి నమ్మలేని నిజాలు ఎదురవుతాయి. ఇంతకీ అవి ఏంటి? మరణాల వెనక ఎవరున్నారో తెలుసుకున్నాడా? తర్వాత వారికి శిక్ష పడేలా చేశాడా? అనేదే సినిమా కథ.
సూర్య ఈ సినిమాలో జై భీమ్ క్యారెక్టర్‌ను గుర్తుచేస్తాడు. అయితే అందులో కేవలం తన ఓర్పు మేథస్సుతోనే కేసును గెలిచిన సూర్య, ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించాడు. జై భీమ్‌లో గిరిజన ప్రజలకోసం పోరాటం చేసే లాయర్‌గా మెప్పించి, ఈటీలో అమ్మాయిల కోసం పోరాటం చేస్తాడు. మొదటి భాగం మొత్తం అంతా ఫ్యామిలీ సెంటిమెంట్‌తో సీరియల్‌లాగా సాగదీశాడు డైరెక్టర్ పాండిరాజ్. అయితే ఇంటర్వెల్ భాగం మాత్రం కాస్త ఆసక్తిగా తెరకెక్కించారు. రెండో భాగంలో సినిమా మరో మలుపు తిరుగుతుంది. యాక్షన్స్ సన్నివేశాల సూర్య అదరగొట్టాడు. కానీ చివరకు క్లైమాక్స్‌ను సరిగ్గా ముగించలేదు. అప్పటివరకు బాగానే సాగిందనుకున్న సినిమాకు చివర్లో తగిన న్యాయం చేయలేదు.
సూర్య నటన గురించి చెప్పనక్కర్లేదు. లాయర్‌గా తన నటనతో మెప్పించాడు. యాక్షన్ సన్నివేశాల్లోనే తన సత్తా చూపించాడు. ప్రియాంక మోహన్‌కు ఈ సినిమాలో కీలక పాత్ర లభించింది. ఆమె క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపించింది. ఇతర నటీనటులు శరణ్య, సత్యరాజ్ తమ పాత్రల మేరకు నటించారు. విలన్‌గా వినయ్ రాయ్ మెప్పించాడు. ఇమ్మాన్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాలో సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ విలువల్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు.
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికే దానికి ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ చేసి సాగదీయడంతో కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. సమాజంలో అమ్మాయిల పట్ల చూపించే వివక్ష గురించి మంచి సందేశం ఇచ్చాడు. సూర్య యాక్షన్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది.
రేటింగ్ : ⅖
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?