Happy Birthday Movie Review
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Happy Birthday Movie Review

    Happy Birthday Movie Review

    July 20, 2022

    లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ హ్యాపీ బ‌ర్త్‌డే. నేడు ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ రితేశ్ రాణా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స‌త్య‌, వెన్నెల కిశోర్, రాహుల్ రామ‌కృష్ణ వంటివాళ్లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్రచారాల్లోనే ఈ చిత్ర‌బృందం చాలా వైవిధ్యం చూపించి అంద‌రినీ ఆక‌ర్షించింది.  ఈ సినిమాలో ఏదో ఉంది క‌చ్చితంగా చూసి తీరాల్సిందే అనుకునేలా మాత్రం చేయ‌డంలో స‌క్సెస్ సాధించింది. మ‌రి సినిమా ఎలా ఉంది స్టోరీ ఎంటీ తెలుసుకుందాం

    క‌థేంటంటే..

    మినిస్ట‌ర్ రిత్విక్ సోది(వెన్నెల కిశోర్) అంద‌రికీ గ‌న్స్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ బిల్లును ఆమోదిస్తాడు. ఆ స‌మ‌యంలో హ్యాపీ (లావ‌ణ్య త్రిపాఠి) ఒక బ‌ర్త్‌డే పార్టీకి వెళ్తుంది. అక్క‌డ క‌నిపించే చాలా మంది వ్య‌క్తులు, వారి విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌ల‌ను చూస్తుంది. ఆ త‌ర్వాత ఆ ప‌బ్‌లో ఏం జ‌రిగింది అనేదే క‌థ .

    విశ్లేష‌ణ‌

    రితేష్ రాణా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మొద‌టి సినిమా మ‌త్తు వ‌ద‌ల‌రా అంత కాక‌పోయినా ఈ సినిమా ఫ‌ర్వాలేద‌నిపించింది. అంద‌రికీ గ‌న్స్ త‌ప్ప‌నిస‌రి చేస్తే అప్పుడు ప‌రిస్థితి ఎలా ఉంటుంది. మ‌నుషులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో చెప్పే క‌థ ఇది. చాప్ట‌ర్‌ల ప్ర‌కారం వ‌చ్చే స్క్రీన్‌ప్లే ఆక‌ట్టుకుంది.  సినిమా మొద‌టి భాగంలో క్యారెక్ట‌ర్స్ ఒక్కొక్క‌టిగా ప‌రిచ‌యం అవుతుంటాయి. స‌త్య క్యారెక్ట‌ర్ ఎంట‌ర్ అయిన తర్వాత  హిలేరియ‌స్‌గా ఉంటుంది. ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్‌లో కామెడి ఇంకా బాగా పండింది. ఇక వెన్నెల కిశోర్ పాత్ర ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. న‌రేశ్ అగ‌స్త్య ఒక వ‌భిన్న‌మైన రోల్‌లో క‌నిపించాడు. మొత్తానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే చాలా కొత్త‌గా ఉన్నాయి. మీమ్స్‌, యూట్యూబ్ రివ్యూస్ వంటి ప్రెజెంట్ ట్రెండింగ్ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు. రెండో భాగం చివ‌రికి వ‌చ్చేస‌రికి క‌థ కాస్త సాగ‌దీసిన‌ట్లుగా అనిపిస్తుంది. ఈ వీకెండ్‌లో ఒక‌సారి మూవీని చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

    ఎవ‌రెలా చేశారంటే..

    లావ‌ణ్య త్రిపాఠి చాలా ఇష్టంతో ఈ పాత్ర చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. భిన్న‌మైన షేడ్స్‌లో కనిపించే హ్యాపీ క్యారెక్ట‌ర్‌కు ఆమె పూర్తి న్యాయం చేసింది. ఇక స‌త్య కామెడీ మాత్రం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. కామెడీ టైమింగ్‌తో అద‌ర‌గొట్టాడు. వెన్నెల కిశోర్ ఉన్న సీన్స్ హిలేరియ‌స్‌గా ఉన్నాయి. న‌రేశ్ అగ‌స్త్య ఒక వైవిధ్య‌మైన పాత్ర‌లో క‌నిపించాడు. ఇక ఇత‌ర న‌టీన‌టులు రాహుల్ రామ‌కృష్ణ‌, గెట‌ప్ శ్రీను త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల మేర‌కు న‌టించారు.

    సాంకేతిక విష‌యాలు

    సినిమా నిర్మాణ విలువ‌లు చాలా ఉన్న‌తంగా ఉన్నాయి. కాళ‌భైర‌వ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లాడ‌ని చెప్పాలి. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ మూవీకి ప్ర‌త్యేక‌త‌ను తీసుకొచ్చింది.  త‌క్కువ బ‌డ్జెట్ సినిమా అయిన‌ప్ప‌టికీ రిచ్ లుక్‌లో క‌నిపించేలా చేశాడు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ విష‌యంలో ఇంకాస్త క‌స‌ర‌త్తు చేయాల్సింది. ఇక రితేష్ రాణా రాసుకున్న క‌థ, స్క్రీన్‌ప్లే కొత్త‌గా ఉన్నాయి. 

    బ‌లాలు

    • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
    • లావ‌ణ్య త్రిపాఠి, స‌త్య‌, వెన్నెల కిశోర్
    • కొన్ని హిలేరియ‌స్ సీన్స్‌

    బ‌ల‌హీన‌త‌లు

    • ఎడిటింగ్
    • కొన్నిసాగ‌దీత స‌న్నివేశాలు
    • క‌థ‌లో కాస్త గంద‌ర‌గోళం

    రేటింగ్: 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version