HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్‌ కెరటం.. సన్నీ డియోల్‌ లైఫ్‌లో అంత జరిగిందా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్‌ కెరటం.. సన్నీ డియోల్‌ లైఫ్‌లో అంత జరిగిందా?

    HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్‌ కెరటం.. సన్నీ డియోల్‌ లైఫ్‌లో అంత జరిగిందా?

    October 19, 2024

    ప్రతీ మనిషి జీవితంలో గెలుపోటములు సహజం. అయితే ఓటములకు కుంగిపోకుండా గెలుపు మార్గాన్ని అన్వేషించిన వారే విజేతలుగా నిలుస్తారు. ఇందుకు సినీ నటులు ఏమాత్రం మినహాయింపు కాదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌ (Sunny Deol) సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచే వచ్చినప్పటికీ అతడి ఫిల్మ్‌ కెరీర్‌ పూల పాన్పులా సాగలేదు. అతడి కెరీర్‌ అయిపోయిందనుకున్న ప్రతీసారి బౌన్స్‌బ్యాక్‌ అవుతూ వచ్చాడు. 41 ఏళ్ల ఫిల్మ్‌ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రస్తుతం తిరుగులేని స్టార్‌గా బాలీవుడ్‌లో కొనసాగుతున్నారు. నేడు (అక్టోబర్‌ 19) సన్నీ డియోల్‌ 67వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్‌ కెరీర్‌లో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం. 

    ధర్మేంద్ర నటవారసుడిగా..

    బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ 1957 అక్టోబర్‌ 19న జన్మించాడు. దిగ్గజ నటుడు ధర్మేంద్రకు ఆయన కుమారుడు. ఎవర్‌గ్రీన్‌ బాలీవుడ్‌ చిత్రం ‘షోలే’ (Sholey)లో అమితాబ్‌ బచ్చన్‌తో పోటీ పడి ధర్మేంద్ర నటించారు. అటువంటి ధర్మేంద్ర నట వారసుడిగా సన్నీ డియోల్‌ హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నిజానికి అతడి అసలు పేరు అజయ్‌ సింగ్‌ డియోల్‌. ఇండస్ట్రీలోకి వచ్చాక సన్నీ డియోల్‌గా మార్చుకున్నారు. 1983లో వచ్చిన రొమాంటిక్‌ చిత్రం ‘బేతాబ్‌’ (Betaab)తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అద్భుత నటన కనబరిచి తొలి సినిమాకే బెస్ట్‌ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అందుకున్నాడు. ’బేతాబ్‌’లో సన్నీ చేసిన గుర్రపు స్వారీ సీన్స్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. ఎంతో కఠినమైన గుర్రపు స్వారీ సీన్లను అలవోకగా చేయడంతో పాటు యాక్షన్‌ సీన్స్‌లోనూ దుమ్మురేపాడు. హీరోయిన్‌ అమృత సింగ్‌తో కలిసి అద్భుతంగా రొమాంటిక్‌ సన్నివేశాలను పండించాడు. తొలి మూవీతోనే స్టార్‌ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్‌ చేసుకున్నారు. 

    ఒకే ఏడాది 7 చిత్రాలు రిలీజ్‌

    ‘బేతాన్’ సక్సెస్‌తో సన్నీ డియోల్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే రెండో చిత్రం ‘రాజ్‌ ఖోస్లా’ (1985) తీసి మరో హిట్‌ అందుకున్నారు సన్నీ. రొమాంటింక్‌ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం సన్నీలోని ప్రతిభను మరింత బహిర్గతం చేసింది. సన్నీ క్రేజ్‌ అమాంతం పెరగడం మెుదలైంది. ఆ తర్వాత అర్జున్‌ (1985), డెకాయిట్‌ (1987) చిత్రాలు చేశాడు. ఆ సినిమాలు కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత నుంచి కథల ఎంపికలో సన్నీ ఉదాశీనంగా వ్యవహరించారు. వచ్చిన కథను వచ్చినట్లు ఓకే చేశారు. తద్వారా 1989వ సంవత్సరంలో ఏకంగా 7 సినిమాలను రిలీజ్‌ చేశారు. కానీ వాటిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. మిగిలిన ఐదు మూవీస్‌ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. దీంతో సన్నీ క్రేజ్‌కు బీటలు వారడం మెుదలైంది. ఓటమి నుంచి పాటలు నేర్చుకున్న సన్నీ కథల విషయంలో జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నాడు. 

    ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌

    1990లో రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో ‘ఘాయల్‌’ అనే చిత్రం చేశాడు. ఈ మూవీని అతడి ధర్మేంద్ర నిర్మించడం విశేషం. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందించింది. అంతకుముందు వచ్చిన వరుస ఫ్లాప్స్‌ను అందరూ మర్చిపోయేలా చేసింది. అంతేకాదు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాజ్‌కుమార్‌ సంతోషి డైరెక్షన్‌లోనే వరుసగా దామిని (1993), ఘటక్‌ (1996) అనే రెండు బ్లాక్‌ బాస్టర్ చిత్రాలు చేశారు. ముఖ్యంగా ‘దామిని’ సినిమాలో వచ్చే కోర్టు సీన్‌లో కెరీర్‌ బెస్ట్ నటనతో సన్నీ డియోల్‌ మెస్మరైజ్‌ చేశారు. అంతేకాదు ఘటక్‌ సినిమాతో మరో నేషనల్‌ అవార్డ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)తో కలిసి చేసిన ‘డర్‌’ సినిమా సన్నీకి బిగ్‌ మైనస్‌గా మారింది. యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ ‘డర్‌’ సాఫ్ట్‌ రోల్‌ చేశాడు. దానికితోడు అందులో షారుక్‌ పాత్ర కనెక్టింగ్‌గా ఉండటంతో షారుక్‌ ముందు సన్నీ తేలిపోయాడన్న భావన ఆడియన్స్‌లో కలిగి ఉంది. 

    ‘గదర్‌’తో చెక్‌!

    1990వ దశకంలో పెద్ద ఎత్తున రొమాంటిక్‌ చిత్రాలు విడుదలయ్యాయి. ఇందుకు అనుగుణంగా షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ వంటి స్టార్స్.. ప్రేమ కథలను ఎంచుకుని మంచి విజయాలను సాధించారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌ అన్న ముద్ర పడటంతో సన్నీకి ఆ తరహా లవ్‌స్టోరీలు రాలేదు. దీంతో ఒక వర్గం ప్రేక్షకులకు సన్నీ రీచ్‌ కాలేకపోయారు. అటు డ్యాన్స్‌లోనూ సన్నీకి పెద్దగా ప్రావీణ్యం లేకపోవడం కూడా అతడి క్రేజ్‌ను కొద్దిమేర డ్యామేజ్‌ చేసింది. ఇది అతడి కెరీర్‌లో వచ్చిన సెకండ్ స్ట్రగల్‌ ఫేజ్ అని చెప్పవచ్చు. అయితే 2001లో వచ్చిన ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ (Gadar: Ek Prem Katha) మూవీతో వాటన్నింటికి సన్నీ చెక్‌ పెట్టాడు. సరిహద్దులు దాటిన ప్రేమకథ చిత్రంలో అతడు అద్భుతంగా నటించారు. అంతేకాదు తనకు బాగా కలిసొచ్చిన యాక్షన్‌తో మరోమారు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ చిత్రం అతడి కెరీర్‌లోనే అతి పెద్ద మైలురాయిగా నిలిచింది. తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. 

    23 ఏళ్ల నిరీక్షణ తర్వాత..

    ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ (Gadar: Ek Prem Katha) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత సన్నీకి ఇక తిరుగుండదని అంతా భావించారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ ఆ స్థాయి సక్సెస్‌ రాలేదు. ఓ దశలో హీరోగా అవకాశాలు కోల్పోయి క్యారెక్టర్ అర్టిస్టుగానూ సన్నీ డియోల్‌ చేశారు. 60 ఏళ్ల వయసులో ఎన్నో ఆర్థిక సమస్యలను సైతం ఆయన ఫేస్‌ చేశారని సన్నిహితులు తెలియజేశారు. దాదాపు 23 ఏళ్లుగా సాలిడ్‌ హిట్‌ కోసం సన్నీ అలుపెరగని పోరాటం చేస్తూనే వచ్చారు. ఇక అతడి కెరీర్‌ అయిపోయిందనుకుంటున్న సమయంలో మరోమారు ‘గదర్‌ 2’ మరోమారు బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 691.08 కోట్లు కొల్లగొట్టి మరోమారు సన్నీ డియోల్‌కు స్టార్ స్టేటస్‌ను అందించింది. ప్రస్తుతం ‘లాహోర్‌ 1947’, బోర్డర్‌ 2, రామాయణం వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌లో సన్నీ డియోల్ నటిస్తున్నారు.

    తెలుగు డైరెక్టర్‌తోనూ

    టాలీవుడ్‌ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలోనూ సన్నీ డియోల్‌ (Sunny Deol) ఓ బిగ్‌ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ‘జాట్‌’ (Jaat) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ను సైతం మేకర్స్‌ రిలీజ్ చేశారు. ఇందులో సన్నీ డియోల్‌ శరీరమంతా బ్లడ్‌ మార్క్స్‌తో భారీ ఫ్యాన్‌ని పట్టుకొని ఉండటాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version