HBD Thalapathy Vijay: విజయ్‌ను స్టార్‌గా నిలబెట్టిన తెలుగు రీమేక్‌ మూవీస్‌ తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD Thalapathy Vijay: విజయ్‌ను స్టార్‌గా నిలబెట్టిన తెలుగు రీమేక్‌ మూవీస్‌ తెలుసా?

    HBD Thalapathy Vijay: విజయ్‌ను స్టార్‌గా నిలబెట్టిన తెలుగు రీమేక్‌ మూవీస్‌ తెలుసా?

    June 22, 2023

    దళపతి విజయ్‌కి తెలుగులోనూ ప్రత్యేక అభిమానులు ఉన్నారు. విజయ్ సినిమా వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో హడావుడి నెలకొంటుంది. దీనికి కారణం విజయ్ చేసిన సినిమాలు తెలుగులోకి రీమేక్ కావడం, తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను తమిళ్‌లో రీమేక్ చేయడమే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 9 తెలుగు సినిమాలను విజయ్ తమిళ్‌లో చేశాడు. విజయ్ బర్త్ డే(జూన్ 22) సందర్భంగా ఈ హీరో రీమేక్ చేసిన తెలుగు సినిమాలేంటో తెలుసుకుందాం. 

    పోకిరి

    విజయ్ కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఇదొకటి. మహేశ్ బాబు చేసిన పోకిరి(2006) తమిళ్‌లోనూ అదే టైటిల్‌తో 2007లో రిలీజైంది. డబ్ వెర్షన్‌లో విజయ్ సరసన అసిన్ నటించింది. రీమేక్‌కి ప్రభు దేవా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది. 

    అతనొక్కడే

    కళ్యాణ్‌రామ్ నటించిన ‘అతనొక్కడే’(2005) సినిమా తెలుగులో డీసెంట్ టాక్‌ని సంపాదించింది. ఈ స్టోరీ నచ్చడంతో విజయ్ రీమేక్ చేశాడు. 2006లో ‘ఆతి’గా పేరుతో రీమేక్‌ మూవీ రిలీజైంది. తమిళ వెర్షన్‌కి రమణ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 

    ఒక్కడు

    మహేశ్ బాబు కెరీర్‌లో ఒక్కడు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2003లో ఒక్కడు విడుదల కాగా 2004లో తమిళ్‌లో ‘గిల్లి’గా రీమేక్ అయింది. విజయ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఈ చిత్రానికి ధరణి దర్శకత్వం వహించాడు.

    నీతో

    ప్రకాశ్ కోవెలమూడి, మెహక్ చాహల్ తొలిసారిగా నటించిన చిత్రం ‘నీతో’(2002). తమిళ్‌లో ఇది ‘సాచియాన్’(2005)గా విడుదలైంది. విజయ్ సరసన బిపాషా బసు, జెనీలియా నటించారు. జోహన్ మహేంద్రన్ దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. 

    నువ్వు నాకు నచ్చావ్

    విక్టరీ వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాను విజయ్ రీమేక్ చేశాడు. 2001లో నువ్వు నాకు నచ్చావ్ విడుదల కాగా 2003లో తమిళ్‌లో ‘వసీగర’గా వచ్చింది. ఇందులో విజయ్ సరసన స్నేహ నటించింది. తమిళ్‌లో కె.సెల్వభారతి డైరెక్ట్ చేశారు.

    చిరునవ్వుతో

    త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించిన చిరునవ్వుతో(2000) సినిమాను జి.రామ్ ప్రసాద్ డైరెక్ట్ చేశాడు. తమిళ్‌లో యూత్(2002)గా వచ్చింది. విజయ్ సరసన సంధ్య నటించింది. విన్సెంట్ సెల్వ డైరెక్షన్ వహించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 

    తమ్ముడు

    పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’(2000) సినిమాను విజయ్ ‘బద్రి’గా రీమేక్ చేశాడు. తెలుగులో తెరకెక్కించిన పి.ఎ.అరుణ్ ప్రసాద్ తమిళంలోనూ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 2001లో బద్రి విడుదలై థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. 

    పవిత్ర బంధం

    వెంకటేశ్, సౌంధర్య నటించిన ‘పవిత్రబంధం’(1996) సినిమా తమిళంలో ప్రియమానవాలె(2000) గా రీమేక్ అయింది. రీమేక్ వెర్షన్‌లో విజయ్ సరసన సిమ్రాన్ నటించింది. కె.సెల్వ భారతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. 

    పెళ్లి సందడి

    రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్‌ హిట్ ‘పెళ్లిసందడి’(1996) తమిళంలో ‘నినైదెన్ వంధై’(1998)గా రిలీజైంది. విజయ్, రంభ, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సైతం కె.సెల్వభారతి డైరెక్టర్‌గా వ్యవహరించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version