NANDINI GUPTHA: 19 ఏళ్ల అమ్మాయి… మిస్ ఇండియాగా గెలిచి ప్రపంచ వేదికపైకి !
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NANDINI GUPTHA: 19 ఏళ్ల అమ్మాయి… మిస్ ఇండియాగా గెలిచి ప్రపంచ వేదికపైకి !

    NANDINI GUPTHA: 19 ఏళ్ల అమ్మాయి… మిస్ ఇండియాగా గెలిచి ప్రపంచ వేదికపైకి !

    April 17, 2023

    తొమ్మిదేళ్ల కల.. వయసు 19 ఏళ్లు.. ఆశయానికి అనుగుణంగా కష్టపడిన ఆమెను విజయం వరించింది. రాజస్థాన్‌కు చెందిన నందినీ గుప్తా మిస్‌ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది ఈ సుందరి. ఆమె గురించి మరిన్ని వివరాలు  తెలుసుకుందాం. 

    మిస్ ఇండియా 2023

    మిస్ ఇండియా పోటీల్లో రాజస్థాన్‌ కోటాకు చెందిన నందనీ గుప్తా గెలుపొందింది. మణిపూర్‌లో జరిగిన 59వ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ… కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఏప్రిల్ 15న జరిగిన ఫైనల్స్‌ జరగ్గా… ఆమె అందానికి అందరూ దాసోహం అయ్యారు. విజేతగా ప్రకటిస్తూ జడ్జీలు నిర్ణయం తీసుకున్నారు. కిరీటాన్ని పెట్టి మిస్ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు బాటలు వేశారు. దీంతో నందినీ గుప్తా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 

    చిన్ననాటి కల

    నందినీ 10 ఏళ్ల వయసు నుంచే మిస్ ఇండియా కావాలని కలలు కంటోంది. ఈ విషయాన్ని తన బయోలో వెెల్లడించింది ఈ అందాల తార. చిన్నతనంలోనే వివిధ కార్యక్రమాలకు హోస్టింగ్ చేయడం పట్ల ఆసక్తి చూపించేదట. ఈ క్రమంలోనే ఫ్యాషన్ రంగంవైపు అడుగులు వేసింది నందినీ. చిన్న పట్టణం నుంచి ప్రపంచ వేదికపైకి వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రకటించింది. “రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ కంటే ఈ ప్రయాణం తక్కువేం కాదు. కష్టం, సంకల్పం, అంతులేని మద్దతు నా విజయానికి కారణం. ప్రతిక్షణం దేశం గర్వించేలా చేసేందుకు కష్టపడతాను. ఈ విజయం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు అంకితం” అని పేర్కొంది. 

    స్ఫూర్తినిచ్చింది వీళ్లే

    రతన్ టాటా, ప్రియాంక చోప్రా తనకు ఆదర్శమని నందినీ గుప్తా వెల్లడించారు. “రతన్ టాటా నా జీవితంలో అత్యంత ప్రభావం చూపించిన వ్యక్తి. మానవత్వంతో సంపాదించిన చాలా మెుత్తం చారిటీకి ఖర్చు చేస్తారు. ఎంతో మంది ఆయన్ని ఇష్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వంతో ఉంటారు. అందుకే రతన్‌ టాటా నాకు స్ఫూర్తి” అని చెప్పింది. అంతేకాదు, ప్రియాంక చోప్రా కూడా అంతే స్ఫూర్తినిచ్చినట్లు వెల్లడించింది. చిన్న వయసులోనే భారతదేశం గర్వించేలా ప్రపంచ వేదికపై మిస్ వరల్డ్‌గా నిలిచిన ఆమె ప్రయాణం తనను ప్రేరేపించిందని చెప్పింది నందినీ గుప్తా. 

    నందినీ లక్ష్యం

    రాజస్థాన్‌ కోటాలో లభించే అత్యంత మన్నికైన ఫాబ్రిక్‌ గురించి ప్రచారం కల్పించాలని చూస్తోంది మిస్ ఇండియా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత రంగానికి ప్రచారం కల్పించి నేతన్నలకు మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాదు… చాలామందికి ఉపాధి కల్పించాలనేది ఆమె లక్ష్యం. 

    విశ్వ సుందరి అవుతుందా?

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగబోయే 71వ మిస్ వరల్డ్ పోటీల్లో నందినీ గుప్తా పోటీ పడబోతుంది.ఇందుకోసం ఎంతవరకైనా కష్టపడతానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.  మరి, ఈ పోటీల్లో గెలిచి విశ్వ సుందరిగా రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version