PLANTS FOR HEALTH: ఈ ఐదు మొక్కలను ఇంట్లో పెంచితే అదృష్టం, ఐశ్వర్యం సిద్ధించడం ఖాయం!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PLANTS FOR HEALTH: ఈ ఐదు మొక్కలను ఇంట్లో పెంచితే అదృష్టం, ఐశ్వర్యం సిద్ధించడం ఖాయం!

    PLANTS FOR HEALTH: ఈ ఐదు మొక్కలను ఇంట్లో పెంచితే అదృష్టం, ఐశ్వర్యం సిద్ధించడం ఖాయం!

    July 4, 2023

    మొక్కలు ప్రాణవాయువుకు మూలాధారం. శుద్ధమైన ఆక్సీజన్‌ను పీల్చడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎలాంటి రోగాలు దరిచేరవు. ప్రస్తుత కాలంలో మానవ జీవితం అపార్ట్‌మెంట్ కల్చర్‌గా మారిపోయింది. సొంత ఇళ్లులు, గార్డెనింగ్ చాలా తక్కువ. ఈ క్రమంలో పెరట్లో పెరగాల్సిన మొక్కలు ఇంట్లోకి వచ్చేశాయి. సరైన పద్దతిలో ఇంట్లో మొక్కలను పెంచితే ఆ ఇంట్లో ఆహ్లాదంతో పాటు పాజిటివ్ వైబ్స్ విస్తరిస్తాయి. వాటిని చూసినప్పుడు మానసిక ఉల్లాసం కలుగుతుంది. మన లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరుచుకునేందుకు.. ఇంట్లో ఈ ఐదు రకాల మొక్కలను పెంచితే సత్ఫలితాలు వస్తాయని మొక్కల ప్రేమికులతో పాటు.. వాస్తు శాస్త్రం చెబుతోంది.

    లక్కీ వెదురు మొక్క

    లక్కీ వెదురు మొక్కను ఇంట్లో పెంచుకుంటే అదృష్టం, సంపదను ఆకర్షిస్తుంది అని నమ్మకం. దీనిని మహిళలు తులసి మొక్క తర్వాత అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. లక్కి వెదురును చాలా తక్కువ ప్రయాసతో పెంచుకోవచ్చు. ఇళ్లు, కార్యాలయాలు ఎక్కడైన వీటిని పెంచుకోవచ్చు. అందుకే ఈ మొక్క ఇండోర్‌  ప్లాంట్‌గా ప్రాచుర్యం పొందింది. ఈ మొక్కను ఆఫీస్ టేబుల్స్‌పై సైడ్ కార్నర్‌ పెంచుకుంటే ఉత్తమం.

     నెమలి మొక్క

    నెమలి మొక్కలను కూడా ఇళ్లల్లో ఎక్కువగా పెంచుకుంటుంటారు.  దట్టమైన కొమ్మలతో  ఎల్లప్పుడూ ఆకుపచ్చగా ఉంటుంది. మందంగా ఉండి మృదువైన ఆకులను కలిగి ఉంటుంది, ఇవి కొమ్మల వెంట వ్యతిరేక జతలలో పెరుగుతాయి. మీ లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం వద్ద ఉంచినట్లయితే, అది మీ ఇంటి అందాన్ని మాత్రమే కాకుండా సానుకూల దృక్పతాన్ని పెంచుతుంది.

    ఇంట్లో వాస్తు దోషాలు ఏమైన ఉంటే వాటి తాలుకు దుష్ప్రభావాలను అడ్డుకుంటుందని నమ్మకం.  ఈ మొక్కను ఆలు-మగల అన్యోన్యతకు చిహ్నంగా చాలా మంది భావిస్తుంటారు. ఈ మొక్కను ఒక జతగా నాటి ఎల్లప్పుుడు  నీరు పెట్టి ఈ మొక్కలను ,,సంరక్షించుతోవాలి.  ఇవి వాడిపోతే ఇంట్లో సమస్యలకు చిహ్నంగా ఉంటుందని చెబుతుంటారు. 

    మనీ ప్లాంట్

    మనీ ప్లాంట్ మొక్కను అదృష్టానికి, ఐశ్వర్య సిద్ధికి చిహ్నంగా భావిస్తారు.  అందుకే  చాలా మంది తమ ఇళ్లలో ఎక్కువగా పెంచుతుంటారు. మనీ ప్లాంట్ ఉన్న చోట ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరుస్తుందని వాస్తుశాస్త్రం చెబుతుంది.  ఇది చాలా సులువుగా పెరుగుతుంది. పెద్దగా నిర్వాహణ అవసరం లేదు. పాత గాజు సీసాలు, నీటి డబ్బాలు, చిన్న చిన్న మట్టి కుండీలలో ఎక్కడైన పెరుగుతుంది. ఈ మొక్కను ఇంట్లో ఎక్కడైన పెంచుకోవచ్చు. ఇంటి ద్వారం, రీడింగ్ టేబుల్, కిటికీ కింద గాని పెంచుకోవచ్చు.

    తులసి

    తులసిని లక్ష్మీ దేవి ప్రతిరూపంగా పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి మొక్క ఉన్న చోట త్రిమూర్తులు సహా సర్వదేవతలు కొలువుదీరుతారని పురాణాలు చెబుతున్నాయి. ఇళ్లల్లో తులసి మొక్కను పెంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ, దోషాలు తొలగిపోతాయి. దీనిని ఉత్తరం, తూర్పు దిక్కుల్లో బాల్కనీలో పెంచుకుంటే బాగుంటుంది. తులసి మొక్కకు వాస్తు ప్రాధాన్యతతో పాటు ఔషధ మొక్కగా అనేక ప్రయోజనాలు అందిస్తుంటుంది. తులసి ఆకుల కషాయం తాగితే జ్వరం, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.  కీళ్ల సమస్యలను నివారించడానికి, రక్తంలో మలినాలను శుభ్రపరచడానికి దోహదపడుతుంది. పంటినొప్పికి.. లవంగంతో కూడిన తులసి అద్భుతంగా పని చేస్తుంది. 

    స్నేక్ ప్లాంట్

    స్నేక్ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుకుంటే పాజిటివ్ ఎనర్జిని వ్యాప్తి చేయడంలో సాయపడుతుంది. గదిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడంతో దోహదపడుతుంది. గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను ఫిల్టర్ చేసి శుద్ధమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. తద్వారా ఆరోగ్యాన్ని పెంచడంలో సాయపడుతుంది. దీనిని పెంచడానకి పెద్దగా ప్రయాస అవసరం లేదు. ఇంట్లో ఓ మూలన పెంచుకోవచ్చు. నీడ తగిలే చోట బాగా పెరుగుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version