Rocketry Movie Review
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rocketry Movie Review

    Rocketry Movie Review

    July 20, 2022

    మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన రాకెట్రీ సినిమా ఈరోజు థియేట‌ర్ల‌లో విడుదలైంది. ఎక్కువ ప్ర‌చారం లేకుండానే సినిమా ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చింది. చాలా కాలం త‌ర్వాత సిమ్ర‌న్ మ‌ళ్లీ తెర‌పై క‌నిపిస్తుంది. ఇస్రో శాస్త్ర‌వేత్త నంబీనార‌య‌ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? స్టోరీ ఎంటీ? తెలుసుకుందాం. 

    క‌థేంటంటే..

    మాధ‌వ‌న్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన సినిమా రాకెట్రీ. ప్ర‌ముఖ ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ప‌ద్మ‌భూష‌ణ్ సొంతం చేసుకున్న ఆయ‌న‌పై గూడ‌చార్యం ఆరోప‌ణ‌లు రావ‌డం , వాటి నుంచి చివ‌రికి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు ఇలా ఆయ‌న జీవితంలో ఉన్న మ‌లుపుల అన్నింటితో క‌థ సాగుతుంది. మొద‌ట హీరో సూర్య, నంబీ నారాయ‌ణ‌న్‌ను టీవీ ఇంట‌ర్వ్యూ చేస్తాడు. అక్క‌డినుంచి క‌థ మొద‌ల‌వుతుంది. 

    ఎలా ఉందంటే..

    మాధ‌వ‌న్ మొద‌టిసారిగా మెగాఫోన్ ప‌ట్టుకొని ద‌ర్శ‌కుడిగా మారిన‌ప్ప‌టికీ ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా సినిమాను తెర‌కెక్కించాడు. మొద‌టిభాగంలో మొత్తం భార‌త‌ అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో నంబీ నారాయ‌ణ‌న్ చేసిన కృషి,  ఆయ‌న‌కు ఎదురైన ఇబ్బందులను చూపించే ప్ర‌య‌త్నం చేశారు. రెండో భాగంలో  ఆయ‌న‌పై గూఢ‌చార్యం ఆరోప‌ణ‌లు రావ‌డం, దాంతో ఆయ‌న‌తో పాటు కుటుంబ‌స‌భ్యుల భావోద్వేగాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు తెర‌కెక్కించారు. రెండో భాగం కథ ఎమోష‌న‌ల్‌గా సాగుతుంది. 

    సాంకేతిక విష‌యాల్లో కూడా ఎటువంటి త‌ప్పులు దొర్ల‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా క‌స‌ర‌త్తులు చేశాడు మాధ‌వ‌న్. వికాస్ ఇంజిన్ కోసం ఆయ‌న ప‌డిన శ్ర‌మ‌తో పాటు  ఫ్రాన్స్, ర‌ష్యా శాస్త్ర‌వేత్త‌ల‌తో మాట్లాడి అక్క‌డి సాంకేతిక‌త‌ను ఇండియాకు తీసుకురావ‌డం, అబ్దుల్ క‌లాంతో అనుబంధం.. ఈ అంశాల‌న్నింటిని ట‌చ్ చేశారు. దేశం కోసం ఇంత చేసిన ఆయ‌న‌ గూఢ‌చార్యం కేసులో ఇరుక్కోవ‌డం స‌గ‌టు ప్రేక్ష‌కుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. క్లైమాక్స్‌లో సూర్య న‌ట‌న క‌థ‌కు బ‌లాన్ని చేకూర్చింది.   నిజ‌జీవిత క‌థ కాబ‌ట్టి ఎక్క‌డా డ్రామాటిక్‌గా అనిపించ‌దు. 

    ఎవరెలా చేశారంటే..

    నంబీ నారాయ‌న‌ణ్ యుక్త వ‌య‌సు నుంచి వృద్ధాప్యం వ‌ర‌కు ఎలా ఉన్నాడో మాధ‌వ‌న్ త‌న ఆహార్యాన్ని అలా మార్చుకంటూ వ‌చ్చాడు. నంబీ నార‌య‌ణ‌న్‌లా చాలా స‌హజంగా క‌నిపిస్తాడు. ఆయ‌న భార్య పాత్ర‌లో సిమ్ర‌న్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇత‌ర న‌టులు కూడా వారి పాత్ర‌ల మేర‌కు న‌టించి మెప్పించారు. నంబీ నారాయ‌ణ‌న్ ఇంట‌ర్వ్యూ చేసే పాత్ర‌లో సౌత్‌లో సూర్య క‌నిపిస్తే.. హిందీలో షారుఖ్ ఖాన్ క‌నిపించాడు.

    సాంకేతిక‌త‌ విష‌యాలు

    మాధ‌వ‌న్ రాసుకున్న క‌థ చాలా బాగుంది. డైలాగ్స్ కూడా మ‌న‌సుల‌ను క‌ద‌లిస్తాయి. శ్యామ్ సి.ఎస్ అందించిన మ్యూజిక్ సినిమాకు బ‌లంగా మారింది.  సిర్షా రేయ్ సినిమాటోగ్ర‌ఫీ స‌హ‌జంగా ఉంది. బిజిత్ బాలా ఎడిటింగ్ చ‌క్క‌గా కుదిరింది. ట్రైక‌ల‌ర్ ఫిల్మ్స్, వ‌ర్ఘీస్ మూల‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. 

    బ‌లాలు:

    మాధ‌వ‌న్ డైరెక్ష‌న్‌, యాక్ష‌న్

    సెకండాఫ్ ఎమోష‌న్స్‌

    క్లైమాక్స్‌

    బ‌ల‌హీన‌త‌లు:

    మొద‌టి భాగంలో క‌థ కాస్త నెమ్మ‌దించ‌డం

     రేటింగ్: 3.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version