ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu) సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో (Mathias Boe)తో ఆమె ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఈ ప్రేమ జంట వివాహబంధంతో ఒక్కటైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మార్చి 20న ఈ జంట ప్రీవెడ్డింగ్ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్ బోతో పెళ్లి జరిగిందని.. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం.
ఇక ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాప్సీ బెస్ట్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ కనిక (Kanika Dhillon) తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేశారు. వాటికి ‘నా స్నేహితుల పెళ్లిలో’ అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆమె ఈ పెళ్లికే వెళ్లారంటూ పలువురు వెల్లడిస్తున్నారు.
తాప్సీ – మథియాస్ వేడుకకు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తాప్సీ అధికారిక ప్రకటన కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇటీవల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు రాగా వాటిపై తాప్సీ స్పందించారు. ‘వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమంటూ ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ నేను దేని గురించైనా ప్రకటన చేయాలనుకుంటే స్వయంగా వెల్లడిస్తాను. పెళ్లి గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది’ అని ఆమె పేర్కొంది.
బాలీవుడ్‍లో తన తొలి సినిమా ‘ఛష్మీ బద్దూర్’ (2013) షూటింగ్ సమయంలో మథియస్‍ను తాను కలిశానని తాప్సీ ఓ ఇంటర్యూలో చెప్పింది. అతడితో రిలేషన్‍లో తాను చాలా సంతోషంగా ఉన్నానని అప్పట్లో పేర్కొంది. ఇలా దశాబ్ద కాలం నుంచి తాప్సీ – మథియస్ లవ్ స్టోరీ నడుస్తోంది.
రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఝమ్మంది నాదం’ సినిమాతో తాప్సీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తాప్సీ పరువాలకు మంచి ప్రశంసలే దక్కాయి.
‘ఝమ్మంది నాదం’ (Jhummandi Naadam) తర్వాత తాప్సీ వరుస అవకాశాలు దక్కించుకుంది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.
ప్రభాస్‌తో ‘Mr. పర్‌ఫెక్ట్’, గోపీచంద్‌తో ‘సాహసం’, లారెన్స్‌తో ‘కాంచన 2’, దగ్గుబాటి రానాతో ‘ఘాజీ’, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
2013లో బాలీవుడ్‍లో అడుగుపెట్టిన తాప్సీ.. ‘పింక్’ సినిమాతో అక్కడ చాలా పాపులర్ అయ్యింది. ఆమె టాలెంట్‌కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె ముడేళ్లుగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు.
తాప్సీ పన్ను ఇటీవల ‘డంకీ’ (Dunki) గత డిసెంబర్‌లో రిలీజై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు జోడీగా నటించి ఈ బ్యూటీ మెప్పించింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ తాప్సీ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ చేతిలో ఓ లడ్కీ హై కహాన్ (Woh Ladki Hai Kahaan?) పిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా (Phir Aayi Haseen Dillruba) ఖేల్ ఖేల్ మీన్ (Khel Khel Mein) వంటి చిత్రాలు ఉన్నాయి.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్