• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2022 ఓవరాల్ ఆంధ్రప్రదేశ్‌ రౌండప్‌

  కొత్త జిల్లాల ఏర్పాటు. వాటి పేర్లపై రచ్చ.  హైకోర్టులో నూతన జడ్జీల ప్రమాణం. మూడు రాజధానులపై రగడ. ఆశావాహులు, అసంతృప్తుల మధ్యే కొలువుదీరిన కొత్త మంత్రివర్గం. అల్లూరి జిల్లాలో 30 అడుగుల విగ్రహం.  అదే సందిగ్ధతలో పోలవరం. టీడీపీ, వైకాపా మధ్య పెరుగుతున్న అంతరం. మధ్యలో జనసేనాని పవన్ కల్యాణ్‌ వైరం. సంక్షేమానికి అప్పులు. మాదక ద్రవ్యాల సరఫరా కట్టడిలో విఫలం. ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు, సమస్యలు, పోరాటాలు మధ్య ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం సాగింది. కొత్త జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ … Read more

  ఉత్తర్వులపై స్టేకు సుప్రీం నిరాకరణ

  AP: అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయాలన్న ప్రతిపాదనలపై మాత్రమే అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. మిగతా ఆదేశాలపై స్టే విధించడానికి నిరాకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, అమరావతి రైతుల తరఫు న్యాయవాదుల మధ్య గంటన్నర పాటు వాదోపవాదాలు జరిగాయి. దీంతో హైకోర్టు విధించిన మాండమస్‌ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఏడు సూచనలు చేసింది. వచ్చే ఏడాది జనవరి 31న తదుపరి విచారణ జరగనుంది.

  నారాయణ వాంగ్మూలం నమోదు

  అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి నారాయణ వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు నమోదు చేశారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి తీసుకున్నారు. ఈ కేసులో విచారణకు రావలంటూ నారాయణకు గతంలో నోటీసులు పంపించారు. అనారోగ్యంతో ఉన్న కారణంగా రాలేనని..ఇటీవల శస్త్రచికిత్స జరిగిందని నారాయణ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం హైదరాబాద్ లోనే న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టవచ్చని చెప్పటంతో వెళ్లారు.

  త్వరలో పరిపాలనా రాజధానిగా విశాఖ

  ఏపీలో త్వరలోనే పరిపాలనా రాజధానిగా విశాఖ అవుతుందని డిప్యూటీ స్పీకర్‌ వీరభద్రస్వామి స్పష్టం చేశారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ విశాఖపై వ్యాఖ్యలు చేశారు. రాజధాని వ్యవహారంలో చంద్రబాబు ప్రోత్సాహంతోనే రైతుల పేరిట దొంగ పాదయాత్రలు సాగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. గుర్తింపు కార్డులు చూపమనగానే యాత్రలన్నీ చెల్లాచెదురయ్యాయని విమర్శించారు.

  ‘అమరావతి’ విచారణ నుంచి తప్పుకున్న CJI

  ఏపీ రాజధాని అమరావతి విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజధానికి సంబంధించిన పిటిషన్లను తాను విచారణ చేయనని CJI యూయూ లలిత్‌ తప్పుకున్నారు. ఈ పిటిషన్లను తాను లేని వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. రాజధాని ప్రాంత రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ల విచారణకు యూయూ లలిత్‌ విముఖత చూపారు.

  పేదల ఇళ్లకు ప్రత్యేక జోన్

  AP: అమరావతి మాస్టర్ ప్లాన్‌లో కీలక మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కృష్ణయపాలేం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఉంటుందని వెల్లడించింది. రాజధాని పరిధిలోని 900 ఎకరాలను పేదల ఇళ్ల కోసం కేటాయించనున్నట్లు వివరించింది. ఉత్తర్వులపై అభ్యంతరాలను 15రోజుల్లోగా తెలపాలని ఏపీ ప్రభుత్వం పేర్కోంది.

  రాజధాని అంశంపై సుప్రీంకు ఏపీ సర్కారు

  మూడు రాజధానులపై అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఏపీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సర్కార్‌ సుప్రీంను ఆశ్రయించింది. రాష్ట్రానికి అమరావతే రాజధాని అని, రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఆర్నెళ్లలో అమరావతి రాజధాని పూర్తిచేయాలని ఆదేశించింది. అయితే CRDA చట్టం ప్రకారమే చేయాలని హైకోర్టు ఆదేశించడం..శాసనసభ అధికారాలను ప్రశ్నించడమేనని ప్రభుత్వం వాదిస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తెలిపింది. హైకోర్టు … Read more

  విటుడిపై కేసు నమోదు చేయొద్దన్న హై కోర్టు

  వ్యభిచార గృహానికి వెళ్లే విటుడిపై కేసు నమోదు చేయకూడదని పోలీసులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. ఓ వ్యక్తిపై దిగువ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసును కొట్టేసింది. వ్యభిచారం చేసేవారిని, లేదా వ్యభిచారం నిర్వహించడం కోసం ఇంటిని అద్దెకు ఇచ్చేవారిని విచారించవచ్చు కానీ డబ్బులు చెల్లించి అక్కడికి వెళ్లిన విటుడ్ని విచారించేందుకు వీలు లేదని కోర్టు తెలిపింది. పలు చట్ట నిబంధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.

  Categories AP

  ఉగాది రోజున కొత్త మంత్రుల ప్ర‌మాణ స్వీకారం

  ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. తెలుగు సంవ‌త్సరాది ఉగాది రోజున కేబినెట్ లో చేర‌బోయే కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో అంత‌కు మందే మార్చి 27న ప్ర‌స్తుత మంత్రులు రాజీనామా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో మంత్రి వ‌ర్గంలో చేర‌బోయే కొత్త‌వారి గురించి ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ న‌డుస్తోంది. కేబినెట్ లో ఉండేదెవ‌రో.. ఊడేదెవ‌రో ఉగాది రోజున తెలిసిపోనుంది. అయితే, ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా పాల‌న మొద‌లు కాబోతున్న త‌రుణంలో జిల్లాకు ఒకరు చొప్పున 26 మంది … Read more

  Categories AP

  ఏపీ హైకోర్టు తీర్పుపై రాజ‌కీయ‌ నేత‌లేమ‌న్నారంటే..

  ఏపీ హైకోర్టు నేడు 3 రాజ‌ధానుల అంశంపై, సీఆర్డీఏ ర‌ద్దు చ‌ట్టంపై కీల‌క తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టాన్ని అనుస‌రించి న‌డుచుకోవాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తిలో 800 రోజుల‌కు పైగా ఉద్య‌మం నిర్వ‌హిస్తున్న రైతులు సంతోషం వ్య‌క్తం చేశారు. చివ‌రికి న్యాయ‌మే గెలిచింద‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వివిధ‌ రాజకీయ పార్టీ నేత‌లు స్పందిస్తున్నారు. బీజేపీ నేత పురంధ‌రేశ్వ‌రి మా పార్టీ ఎప్ప‌టికీ రాజ‌ధానిగా అమ‌రావతికే క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. సుజ‌నా చౌద‌రి చాలా సంతోష‌క‌ర‌మైన తీర్పని అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌న‌సేన పార్టీ … Read more

  Categories AP