• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • న‌వీన్ చంద్ర ‘రిపీట్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

  న‌వీన్ చంద్ర హీరోగా న‌టిస్తున్న ‘రిపీట్’ మూవీ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ సినిమాలో ఆయ‌న ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఒక క్రైమ్ మిస్ట‌రీని ఛేదించే దిశ‌గా పోలీసాఫీస‌ర్ చేసే ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఆగ‌స్ట్ 25 నుంచి మూవీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. న‌వీన్ చంద్ర వ‌రుస‌గా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీగా మారాడు. ప్ర‌తి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ స‌రికొత్త పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఇటీవ‌ల హాట్‌స్టార్‌లో నవీన్ చంద్ర న‌టించిన ప‌రంప‌ర వెబ్‌సిరీస్‌కు మంచి విజ‌యం సాధించింది. https://youtube.com/watch?v=QsURblraGtE

  ఓటీటీలో దూసుకెళ్తున్న ‘విక్ర‌మ్‌’

  క‌మ‌ల్ హాస‌న్, ఫ‌హాద్ ఫాజిల్, విజ‌య్ సేతుప‌తి క‌లిసి న‌టించిన ‘విక్ర‌మ్’ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. లోకేశ్ క‌న‌గ‌రాజ్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జులై 8 నుంచి మూవీ ప్ర‌ముఖ ఓటీటీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్క‌డ కూడా విక్ర‌మ్ కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింద‌ని హాట్‌స్టార్ తెలిపింది. ఇంత‌కు ముందు ఉన్న అత్య‌ధిక స్ట్రీమింగ్ టైమ్‌ను అధిగ‌మించి విక్ర‌మ్ దూసుకెళ్తుంది. అదేవిధంగా అన్ని భాష‌ల్లో క‌లిపి బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ సాధించింద‌ని వెల్ల‌డించింది. దీనిపై స్పందించిన … Read more

  ‘విక్ర‌మ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

  క‌మ‌ల్ హాస‌న్ , ప‌హాద్ ఫాజిల్, విజ‌య్ సేతుప‌తి న‌టించిన ‘విక్ర‌మ్’ మూవీ జూన్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లై భారీ స‌క్సెస్ సాధించింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.400 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. అయితే తాజాగా విక్ర‌మ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ మూవీ డిస్నీ+హాట్‌స్టార్‌లో జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చాలాకాలం త‌ర్వాత క‌మ‌ల్‌కు ఈ సినిమా మంచి స‌క్సెస్‌ను ఇచ్చింది. విక్ర‌మ్‌ను క‌మ‌ల్ స్వ‌య‌గా రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై నిర్మించాడు. ఈ చిత్రం … Read more

  ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న KRK

  స‌మంత‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘క‌న్మ‌ణి రాంబో ఖ‌తిజా’ (KRK)మూవీ ఓటీటీలో రిలీజైంది. ప్ర‌ముఖ ఓటీటీ హాట్‌స్టార్‌లో నేటి నుంచి స్ట్రీమ్ అవుతుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.66కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. విగ్నేశ్ శివ‌న్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అనిరుధ్‌ మ్యూజిక్ అందించాడు.

  The AP High Court is not pleased with the Bigg Boss Telugu show.

  The reality show Bigg Boss is back in the news. Telugu Yuvashakti President Kethireddy Jagadeeshwar Reddy filed a case against the show in 2019. According to Kethireddy, the reality show is guiding young people down the path of vulgarity. Mr. Reddy requested an urgent hearing on his petition after the issue had been on hold for several months. The court … Read more

  బిగ్‌బాస్‌లో న‌ట‌రాజ్‌ను చంపిన‌ కిల్ల‌ర్ ఎవ‌రు?

  బిగ్‌బాస్‌లో ఈరోజు ఎపిసోడ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ప్లాన్ చేశారు. అంద‌రినీ క‌న్ఫెష‌న్ రూమ్‌కి పిలిచి ఆట‌ప‌ట్టించాడు బిగ్‌బాస్. అందులో ఎవ‌రికో ఒక‌రికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అది ఎవ‌రికో ఇచ్చారో తెలుసుకునేందుకు కంటెస్టెంట్స్‌ ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే బాబా మాస్ట‌ర్ నేనే కిల్ల‌ర్‌ని అని చెప్తున్న‌ప్ప‌టికీ ఎవరు న‌మ్మ‌డంలేదు. మ‌రో వైపు ఎవ‌రో అద్దంపై న‌ట‌రాజ్ డెడ్ అని రాశారు. దీంతో న‌ట‌రాజ్ ఆట నుంచి త‌ప్పుకున్నాడు. మ‌రి ఆ కిల్ల‌ర్ ఎవ‌రో తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

  బిగ్ బాస్ OTT: ఐదో వారం నామినేష‌న్లో ఉన్న‌ది వీరే

  తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ షో 5వ వారానికి చేరుకుంది. గ‌త‌వారం స‌ర‌యు ఎలిమినేట్ అయి వెళ్లిపోయంది. ఇక‌, ఈ వారం నామినేషన్స్ కు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ‌యింది. ఇందులో కంటెస్టంట్స్ ఫుల్ ఫైర్ లో ఉన్నారు. నామినేష‌న్ ప్రక్రియలో భాగంగా త‌ల‌పై గుడ్లు కొట్టి నామినేట్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో యాంక‌ర శివ‌, మిత్రాశ‌ర్మ‌, మ‌హేశ్ విట్టా, బిందు మాధ‌వి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కాగా, ఈ వారం మొత్తం 7మంది నామిష‌న్ల‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో … Read more

  ప్రేక్ష‌కుల హృద‌యాలు గెలుచుకుంటున్న బిందు మాధ‌వి

  బిగ్‌బాస్ ఓటీటీలో మొత్తం 18 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే వాళ్ల‌లో బిందు మాధ‌వికి ప్రేక్ష‌కుల నుంచి మంచి స‌పోర్ట్ ల‌భిస్తుంది. ఏం జ‌రిగినా చాలా కూల్‌గా, మెచ్యూర్‌డ్‌గా బిహేవ్ చేస్తుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. గేమ్‌లో భాగంగా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ చేతి త‌గిలిన‌ప‌పుడు ఆమె పెద‌వికి గాయ‌మై ర‌క్త‌మొచ్చిన‌ప్ప‌టికీ ఆమె పాజిటివ్‌గానే తీసుకుంది. కానీ ఈరోజు టాస్క్‌లో బిందు కార‌ణంగా దెబ్బ త‌గిలింద‌ని అఖిల్‌ ఆమెపై అరుస్తున్నాడు. అక్క‌డే వారి మెచ్యూరిటీ ఏంటో తెలుస్తుంది అంటున్నారు. నా ఫేవ‌రెట్ కంటెస్టెంట్‌, టాప్ 3 కంటెస్టెంట్ … Read more