• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాహుల్ యాత్ర.. జంట బాంబు పేలుళ్లు

    జమ్ము కశ్మీర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న క్రమంలో వరుస బాంబు దాడులు చోటు చేసుకోవడం కలకలం రేపింది. జమ్ములోని నర్వామాలో ఈ ఘటన జరిగింది. జంట బాంబు పేలుళ్లు జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రాహుల్ పాదయాత్ర జరిగే రూట్‌లో పకడ్బందీగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ బాంబు పేలుళ్లలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వారిని ఆసుపత్రికి తరిలించారు. అయితే, పేలుళ్ల వెనుక ఉద్దేశమేంటని ఇంకా తెలియరాలేదు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని … Read more

    బాంబ్ బ్లాస్ట్ ఘటనలో నిందితుడు అరెస్ట్

    కర్ణాటకలోని మంగళూరులో ఇవాళ ఉదయం అనుమానస్పద రీతిలో ఆటో పేలింది. బ్లాస్ట్‌కు గల కారణాలను పోలీసు అధికారులు ఉగ్రకుట్రగా భావించి దర్యాప్తు చేపట్టారు. ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని కర్ణాటక పోలీసులు తేల్చారు. నిందితుడిని శివమొగ్గకు చెందిన మహ్మద్‌ షరీఖ్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం షరీఖ్‌ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. నిందితుడి ఇంట్లో బాంబు తయారీ మెటీరియల్స్‌‌ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, జైలు నుంచి వచ్చిన తర్వాత నిందితుడు ఉగ్రదాడికి ప్లాన్‌ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    అంబానీ కుటుంబానికి బాంబు బెదిరింపు

    అపరకుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబానికి బాంబు బెదిరింపు వచ్చింది. కొందరు ఆగంతకులు రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి, ఆసుపత్రిని పేల్చేస్తామని బెదిరించారు. దీంతో పాటు అంబానీకి కుటుంబ సభ్యుల్లో కొందరిని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంబానీ కుటుంబానికి అదనపు భద్రత కల్పించారు.