• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీకొట్టారు: జానా రెడ్డి

    కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామని జానారెడ్డి అన్నారు. ‘మా పథకాలను చూసి కేసీఆర్‌ తన పథకాలను మార్చుకున్నారు. మేనిఫెస్టోలో వచ్చిన పథకాలను కాంగ్రెస్ పార్టీని చూసి భయపడే వచ్చినవే. మేము చెప్పింది చేస్తాం. నిజంగా పథకాలు అమలులోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలి’ అని జానా రెడ్డి అన్నారు. మరోవైపు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి కేసీఆర్‌కు చలి జ్వరం పుట్టుకొచ్చిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే మేనిఫెస్టోను కాపీ కొట్టారన్నారు.

    ప్రజలు తెలివితో ఓటు వేయాలి: కేసీఆర్

    బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించిన కేసీఆర్ హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ‘ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివితో ఆలోచించాలి. మోసపోవద్దు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతోంది. ఇప్పటికీ 10 సార్లు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అంధకారం చేసింది. బీఆర్ఎస్ విజయ ప్రస్థానానికి హుస్నాబాద్ వేదిక కావాలి. తొమ్మిదిన్నర ఏళ్ల కింద తెలంగాణ ఎలా ఉండేది. ఇప్పుడు తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌. మరోసారి అధికారంలోకి వస్తే రూ.5 వేలు ఇస్తాం’ అని అన్నారు.

    ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా

    సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మెనిఫెస్టోని ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న 93 లక్షల మందికి కేసీఆర్ బీమా కింద రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తున్నాం. బీమా ప్రిమియం డబ్బును ఎల్‌ఐసీకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. దివ్యాంగుల పెన్షన్‌కు రూ.6 వేలకు పెంచుతున్నాం. రైతు బంధు పథకం డబ్బును రూ.16 వేలకు పెంచుతున్నాం. అసరా పెన్షన్లు రూ.5 వేలకు పెంచుతున్నాం. అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం పంపిణీ చేస్తాం. అక్రిడేషన్‌లో ఉన్న జర్నలిస్టులకు రూ.400కే సిలిండర్లు అందిస్తున్నట్లు చెప్పారు.

    దెబ్బతీసేందుకు కుట్ర: కేసీఆర్

    తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్‌ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సాంకేతికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు.. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలి.. మాకే అంతా తెలుసు అనుకోవద్దు. మళ్లీ విజయం మనదే, ఎవరూ తొందరపడొద్దు.. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో సీటు మార్పు.. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు.. ప్రతీ కార్యకర్తతో నేతలు మాట్లాడాలి. మనల్ని గెలవలేకే కుయుక్తులు పన్నుతున్నారు అని చెప్పుకొచ్చారు.

    రేవంత్ రెడ్డి ఇక జైలుకే: హరీష్ రావు

    ఓటుకు నోటుకు కేసులో త్వరలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కేసులో దొరికిన రేవంత్ రెడ్డి విచారణ ఆపాలని సుప్రీం కోర్టుకు పోతే కోర్టు కూడా విచారణ జరగాలని స్పష్టం చేసింది. ఆ కేసు విచారణ అయ్యేది ఖాయం, రేవంత్ జైలుకు వెళ్లేది ఖాయం అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈనెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ పెడుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రకటించే బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి విపక్షాలు బిక్కమొహం వేస్తాయని పేర్కొన్నారు.